Telugu News  /  National International  /  Aaftab Claims To Have Burnt Shraddha Walkar's Face After Murder: Reports
ఆఫ్తాబ్, శ్రద్ధ వాకర్ (ఫైల్ ఫొటో)
ఆఫ్తాబ్, శ్రద్ధ వాకర్ (ఫైల్ ఫొటో)

Shraddha's murder: ‘‘గుర్తు పట్టకుండా ఉండేందుకు ముఖాన్ని కాల్చేశాడు’’

17 November 2022, 21:08 ISTHT Telugu Desk
17 November 2022, 21:08 IST

Shraddha's murder: తనతో లివిన్ రిలేషన్ లో ఉన్న శ్రద్ధ వాకర్ ను దారుణంగా హత్య చేసిన ఆఫ్తాబ్ పోలీసుల విచారణలో ఒక్కొక్కటిగా నిజాలను వెల్లడిస్తున్నాడు.

Shraddha's murder: శ్రద్ధ వాకర్ ను హత్య చేసిన ఆఫ్తాబ్ కిరాతకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గొంతు నులిమి, దారుణంగా హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని35 ముక్కలు చేశానని, వాటిని ఫ్రిజ్ లో దాచి, అనంతరం, రోజుకొకటి చొప్పున ఒక్కొక్కటిగా దగ్గర్లోని అడవిలో పడవేశానని ఇప్పటికే వెల్లడించాడు.

ట్రెండింగ్ వార్తలు

Shraddha's murder: ముఖాన్ని కూడా కాల్చాడు

అయితే, హత్య అనంతరం మృతురాలి ముఖాన్ని హంతకుడు ఏం చేశాడనే విషయంపై పోలీసులు ఆరా తీశారు. ఆ ముఖ భాగాన్ని బయట పడవేస్తే, గుర్తు పట్టే అవకాశముందన్న అనుమానంతో, ఆ ముఖం భాగాన్ని గుర్తుపట్టని విధంగా కాల్చేసినట్లు పోలీసులకు తెలిపాడని సమాచారం. హత్య చేసి, శరీరాన్ని ముక్కలుగా చేసి ఫ్రిజ్ లో పెట్టిన తరువాత, మిగతా అవయవాలను బయట పడేసిన తరువాత కూడా, కొన్ని రోజుల పాటు శ్రద్ధ ముఖ భాగాన్ని ఫ్రీజర్ లోనే ఉంచానని పోలీసుల విచారణలో ఆఫ్తాబ్ వెల్లడించాడు.

Shraddha's murder: ఆ ముఖం శ్రద్ధదేనా?

ఈ నేపథ్యంలో, గత ఆరు నెలల కాలంలో ఢిల్లీ పరిసరాల్లో లభించిన శరీర అవయవాలపై పోలీసులు ఆరా తీయడం ప్రారంభించారు. జూన్ నెలలో తూర్పు ఢిల్లీ ప్రాంతంలో లభించిన యువతి ముఖం శ్రద్ధ దే కావచ్చన్న అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. అలాగే, శ్రద్ధ శరీర అవయవాలను పడేశానని ఆఫ్తాబ్ చెప్పిన అటవీ ప్రాంతంలో పోలీసుల గాలింపు కొనసాగుతోంది. వారికి మనుషులకు చెందిన కొన్ని ఎముకలు లభించాయని, శ్రద్ధ వాకర్ ది గా భావిస్తున్న తుంటి ఎముక కూడా లభించిందని సమాచారం. వాటిని ఫొరెన్సిక్ లాబ్ కు పంపించారని తెలుస్తోంది.

Shraddha's murder: 5 రోజుల రిమాండ్

శ్రద్ధ వాకర్ ను దారుణంగా హత్య చేసిన ఆరోపణలను ఎదుర్కొంటున్న ఆఫ్తాబ్ పూనావాలా కు ఢిల్లీలోని సాకేత్ కోర్టు గురువారం 5 రోజుల పోలీసు రిమాండ్ విధించింది. ఆఫ్తాబ్ ను సెక్యూరిటీ కారణాల దృష్ట్యా వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా కోర్టుకు చూపించారు. కోర్టులో ఈ విచారణ సాగుతున్న సమయంలో, కోర్టు వెలుపల భారీగా చేరిన లాయర్లు, ఇతరులు ఆఫ్తాబ్ కు ఉరిశిక్ష విధించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.