Miss Universe: మిస్ యూనివర్స్ బ్యూనోస్ ఎయిర్స్ పోటీలో విజేతగా నిలిచింది ఒక 60 ఏళ్ల మోడల్..-60yearold wins miss universe buenos aires breaks stereotypes things to know ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Miss Universe: మిస్ యూనివర్స్ బ్యూనోస్ ఎయిర్స్ పోటీలో విజేతగా నిలిచింది ఒక 60 ఏళ్ల మోడల్..

Miss Universe: మిస్ యూనివర్స్ బ్యూనోస్ ఎయిర్స్ పోటీలో విజేతగా నిలిచింది ఒక 60 ఏళ్ల మోడల్..

HT Telugu Desk HT Telugu
Apr 27, 2024 06:07 PM IST

Miss Universe: అందం యువత సొంతం మాత్రమే కాదని నిరూపించింది అర్జెంటీనాకు చెందిన ఈ సుందరి. అందాల పోటీల్లో కుర్రకారు మాత్రమే గెలుస్తారన్న విశ్వాసాన్ని కూడా పటాపంచలు చేసింది. అరవై ఏళ్ల వయస్సులో, చెరగని అందంతో అందాల పోటీలో నెగ్గి, రికార్డు సృష్టించింది.

మిస్ యూనివర్స్ బ్యూనోస్ ఎయర్స్ విజేత అలెజాండ్రా మారిసా రోడ్రిగ్జ్
మిస్ యూనివర్స్ బ్యూనోస్ ఎయర్స్ విజేత అలెజాండ్రా మారిసా రోడ్రిగ్జ్ (Instagram/@missuniversoar)

Miss Universe: అందాల పోటీల చరిత్రలో తొలిసారిగా అరవై ఏళ్ల మోడల్ మిస్ యూనివర్స్ పోటీల్లో కంటెస్టెంట్ గా నిలిచే అవకాశం సాధించింది. అర్జెంటీనాలోని బ్యూనోస్ ఎయిర్స్ లో జరిగిన మిస్ యూనివర్స్ బ్యూనోస్ ఎయర్స్ పోటీలో 60 ఏళ్ల వయస్సున్న మోడల్ అలెజాండ్రా మారిసా రోడ్రిగ్జ్ విజయం సాధించింది. అందానికి వయస్సు అడ్డంకి కాదని నిరూపించింది. ఇకపై వయోపరిమితిని 28 ఏళ్లకు పరిమితం చేయబోమని గత ఏడాది అందాల పోటీలు ప్రకటించాయి. ఇప్పుడు 18 ఏళ్లు పైబడిన వారు అందరూ ఈ అందాల పోటీల్లో పాల్గొనవచ్చు. అలెజాండ్రా మారిసా రోడ్రిగ్జ్ విజయం ఆమె అంకితభావానికి, సంకల్పానికి నిదర్శనంగా నిలుస్తోంది.

మారిసా రోడ్రిగ్జ్ ఎవరు?

బ్యూనస్ ఎయిర్స్ ప్రావిన్స్ కు మిస్ యూనివర్స్ గా అలెజాండ్రా మారిసా రోడ్రిగ్జ్ ఎంపికయ్యారు. అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్ ప్రావిన్స్ రాజధాని లా ప్లాటాకు చెందిన అలెజాండ్రా.. మోడల్ మాత్రమే కాదు. న్యాయవాది, జర్నలిస్ట్ కూడా. అందం విషయంలో సంప్రదాయ ప్రమాణాలను పునర్నిర్వచించిన అలెజాండ్రా ఒక ‘ రోల్ మోడల్’ గా నిలుస్తుంది.

మిస్ యూనివర్స్ అర్జెంటీనా పోటీకి సిద్ధం

మిస్ యూనివర్స్ బ్యూనోస్ ఎయిర్స్ పోటీలో నెగ్గిన అలెజాండ్రా మారిసా రోడ్రిగ్జ్ ఈ సంవత్సరం మే లో జరగనున్న మిస్ యూనివర్స్ అర్జెంటీనా పోటీల్లో బ్యూనస్ ఎయిర్స్ కు ప్రాతినిధ్యం వహించనుంది. ఆ పోటీలో విజయం సాధిస్తే, అర్జెంటీనా తరఫున ఆమెకు మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొనే అవకాశం లభిస్తుంది.

IPL_Entry_Point