2 helicopters collide mid-air: ఆకాశంలో రెండు హెలీకాప్టర్లు ఢీ
2 helicopters collide mid-air: ఆకాశంలో రెండు హెలీకాప్టర్లు ఢీ కొన్న ఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
2 helicopters collide mid-air: టూరిస్ట్ లతో ప్రయాణిస్తున్న రెండు చాపర్లు ఆకాశంలో వేగంగా ఢీ కొన్న ఘటనలో నలుగురు చనిపోగా, ఇద్దరు తీవ్రంగా గాయాల పాలయ్యారు. ఈ ప్రమాదం తరువాత కూడా అందులోని ఒక హెలీకాప్టర్ క్షేమంగా నేలకు దిగడం విశేషం.
2 helicopters collide mid-air: ఆస్ట్రేలియా బీచ్ లో..
ఈ ఘటన ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ తీరంలోని మెయిన్ బీచ్ సమీపంలో జరిగింది. ఇది క్వీన్స్ లాండ్ రాష్ట్రంలోని బ్రిస్బేన్ కు సుమారు 65 కిమీల దూరంలో ఉంటుంది. ప్రపంచంలోనే ఈ ప్రాంతం చాలా పాపులర్ టూరిస్ట్ స్పాట్. వెకేషన్స్ ఎక్కువగా ఉండే డిసెంబర్, జనవరి సమయాల్లో ఇక్కడికి టూరిస్టులు పోటెత్తుతుంటారు. ఈ ప్రమాదం అనంతరం అక్కడి సీ వరల్డ్ డ్రైవ్ ను తాత్కాలికంగా మూసేశారు. ప్రమాద సమాచారం తెలియగానే సహాయ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి సహాయ చర్యలు ప్రారంభించారు. ఈ ప్రమాదానికి సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఒకే సమయంలో ఒక చాపర్ టేకాఫ్ అవుతుండగా, మరో హెలీకాప్టర్ ల్యాండింగ్ కు ప్రయత్నించడంతో ఈ ప్రమాదం సంభవించింది. మృతులంతా టేకాఫ్ కు ప్రయత్నిస్తున్న చాపర్ లోని వారే.
2 helicopters collide mid-air: పైలట్ సాహసం
మరో చాపర్ ఢీ కొట్టడంతో గాయాల పాలైనప్పటికీ, ముందు భాగమంతా పూర్తిగా ధ్వంసమైనప్పటికీ.. హెలీకాప్టర్ ను సురక్షితంగా ల్యాండ్ చేసిన పైలట్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రమాదంలో బ్రిటన్ కు చెందిన ఒక జంట, ఇద్దరు ఆస్ట్రేలియన్లు చనిపోయారని అధికారులు వెల్లడించారు.
టాపిక్