Crime news : 16ఏళ్ల స్నేహితుడిని నడిరోడ్డు మీద కిరాతకంగా చంపిన 15ఏళ్ల బాలుడు.. కారణం ఒక అమ్మాయి!
Gurugram crime news : ఓ 15ఏళ్ల బాలుడు.. తన 16ఏళ్ల ఇన్స్టాగ్రామ్ స్నేహితుడిని రోడ్డు మీద కిరాతకంగా హత్య చేశాడు. తన ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్‌తో చాట్ చేస్తున్నాడన్న కారణంతో ఇలా చేశాడు!
గురుగ్రామ్‌లో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 16ఏళ్ల బాలుడిని ఓ 15ఏళ్ల బాలుడు రోడ్డు మీద కిరాతకంగా చంపేశాడు. తన ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్‌తో ఆ వ్యక్తి చాటింగ్ చేస్తుండటమే ఇందుకు కారణం!
ఇదీ జరిగింది..
ఆ 16ఏళ్ల బాలుడు, 15ఏళ్ల బాలుడు రెండేళ్లుగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్రెండ్స్. వీరు మధ్యప్రదేశ్‌కి చెందినవారు. కాగా వీరిద్దరు సెక్టార్ 39లోని ఝార్సా సెక్టార్లో నివాసముంటున్నారు.
3 నెలల క్రితం వీరిద్దరి మధ్య తొలిసారి విభేదాలు వచ్చాయి. 16ఏళ్ల బాలుడు, తన ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్‌తో చాట్ చేస్తున్నాడని ఈ 15ఏళ్ల బాలుడు తెలుసుకున్నాడు. చాట్ చేయొద్దు అని హెచ్చరించాడు. ఇక నుంచి చాట్ చేయనని స్పష్టం చేశాడు ఆ 16ఏళ్ల బాధితుడు.
కానీ అతను ఇంకా తన ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్‌తో చాటింగ్ చేస్తున్నాడని తెలుసుకున్నాడు ఆ 15ఏళ్ల బాలుడు. చివరికి అతడిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం భారీ స్కెచ్ వేశాడు.
నిందితుడు ఇంట్లో నుంచి రూ. 20వేలు దొంగలించాడు. మంగళవారం ఇంట్లో నుంచి వచ్చేసి, ఓ హోటల్లో బస చేశాడు. రూ. 12వేలు విలువ చేసే ఫోన్ కొనుగోలు చేసి బాధితుడితో టచ్‌లోకి వచ్చాడు. బుధవారం తనని కలవాలని చెప్పాడు. ఇంతలో ఒక షాపు నుంచి పదునైన కత్తిని తీసుకున్నాడు.
గురుగ్రామ్ సెక్టార్ 40లోని ఓ పార్క్ వద్ద వారిద్దరు కలుసుకున్నారు. కోపంతో ఊగిపోయిన ఆ 15ఏళ్ల బాలుడు, బాధితుడి గొంతు, ఛాతీ, మెడ, కడుపు భాగాల్లో కత్తితో బలంగా పొడిచాడు.
తీవ్ర రక్తస్రావంతో ఆ వ్యక్తి పరిగెత్తుకుంటూ, పరిగెత్తుకుంటూ 500 మీటర్ల దూరంలోని ఓ ఇంటి ముందు పడిపోయి, అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. నిందితుడు అక్కడి నుంచి పారిపోయి, రేవారీలో కశోలాలోని తన మామ ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. గురుగ్రామ్ రైల్వే స్టేషన్‌కి వెళ్లాడు. కానీ అక్కడ ట్రైన్ మిస్ అయ్యాడు. చివరికి బస్‌స్టాండ్‌కి వచ్చి రేవారీకి బస్సు ఎక్కాడు.
మరోవైపు తన ఇంటి ఎదురుగా మృతదేహం పడి ఉండటాన్ని గమనించిన యజమాని షాక్ అయ్యాడు. షాక్ నుంచి తేరుకున్న అనంతరం పోలీసులకు ఫోన్ చేశారు.
ఘటనాస్థలానికి పరుగులు తీసిన పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా ఉన్న ఓ దుకాణం నుంచి మృతుడి వివరాలను సేకరించారు.
దర్యాప్తులో భాగంగా పోలీసులు బాధితుడి ఇంటికి వెళ్లారు. మృతదేహం వెరిఫికేషన్ జరిగింది. నిందితుడి గురించి తెలుసుకునేందుకు సీసీటీవీ ఫుటేజ్‌ని చెక్ చేశారు. అతను స్థానికంగా నివాసముండే వ్యక్తి అని తేలింది. చివరికి నిందితుడిని అతని మామ ఇంటి నుంచి గురువారం మధ్యాహ్నం అరెస్ట్ చేశారు.
దర్యాప్తులో భాగంగా నిందితుడు నిజం ఒప్పుకున్నాడు. తన ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్‌తో చాటింగ్ చేస్తున్నాడనే కారణంతో చంపేసినట్టు వివరించాడు.
పోలీసుల ప్రకారం బాధితుడు 8వ తరగతి వరకు చదువుకుని రెస్టారెంట్లు, వెడ్డింగ్ ఫంక్షన్స్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్నాడు. నిందితుడు 10వ క్లాస్ డ్రాపౌట్. ఆటో నడుపుకుంటున్నాడు.
సంబంధిత కథనం