Vivaha Bhojanambhu : హీరో సందీప్ కిషన్ హోటల్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు, గడువు ముగిసిన ఆహార పదార్థాలు గుర్తింపు-secunderabad fssai official found food safety violations in hero sundeep kishan vivaha bhojanambu hotel ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Vivaha Bhojanambhu : హీరో సందీప్ కిషన్ హోటల్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు, గడువు ముగిసిన ఆహార పదార్థాలు గుర్తింపు

Vivaha Bhojanambhu : హీరో సందీప్ కిషన్ హోటల్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు, గడువు ముగిసిన ఆహార పదార్థాలు గుర్తింపు

Bandaru Satyaprasad HT Telugu
Jul 10, 2024 03:26 PM IST

Vivaha Bhojanambhu Hotel : టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ కు చెందిన రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. హోటల్ లో గడువు ముగిసిన ఆహార పదార్థాలు, సింథటిక్ కలర్స్ వాడిన పదార్థాలు గుర్తించారు. హోటల్ నిర్వాహకులు పలు ఉల్లంఘనలకు పాల్పడినట్లు గుర్తించారు.

హీరో సందీప్ కిషన్ హోటల్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు
హీరో సందీప్ కిషన్ హోటల్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు

Vivaha Bhojanambhu Hotel : టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ కు చెందిన రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. హోటల్ లో గడువు ముగిసిన ఆహార పదార్థాలను గుర్తించారు. ఈ నెల 8న సికింద్రాబాద్ లోని 'వివాహ భోజనంబు' రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీలో హోటల్ నిర్వాహకుల ఆహాయ భద్రతా ఉల్లంఘనలకు పాల్పడినట్లు గుర్తించారు.

గడువు ముగిసిన ఆహారాలు గుర్తింపు

ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీల్లో 25 కిలోల గడువు ముగిసిన చిట్టిముత్యాలు బియ్యం గుర్తించారు. స్టీల్ కంటైనర్లలో నిల్వ చేసిన, పాక్షికంగా తయారు చేసిన ఆహారాలు గుర్తించారు. వీటిని ఎప్పుడు తయారు చేశారో సరైన లేబులింగ్ లేదని అధికారులు తెలిపారు. కొన్ని డస్ట్‌బిన్‌లు మూతలు లేకుండా కూడా కనిపించాయన్నారు. ఫుడ్ హ్యాండ్లర్‌ల మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు అందుబాటులో లేవు. వంటగదిలో అశుభ్రంగా, వాడిన నీరు నిల్వను గుర్తించారు. ఆహార తయారీలో ఉపయోగిస్తున్న, కస్టమర్లకు అందిస్తున్న వాటర్‌ బాటిళ్ల నాణ్యతకు సంబంధించిన నీటి విశ్లేషణ నివేదిక లేదని అధికారులు తెలిపారు.

ఆహార పదార్థాల నాణ్యతపై సూచనలు

అయితే హోటల్ కిచెన్ లో సిబ్బంది హెయిర్‌నెట్‌లు, యూనిఫాంలు ధరించి, పరిశుభ్రత ప్రమాణాలకు పాటించినట్లు అధికారులు గుర్తించారు. పెస్ట్ కంట్రోల్ కు సంబంధించిన రికార్డ్‌లు సరిగా ఉన్నాయన్నారు. అలాగే హోటల్ నిర్వహణకు సంబంధించి FSSAI ఒరిజినల్ లైసెన్స్ వినియోగదారులకు కనిపించేలా ప్రదర్శించలేదన్నారు. రెస్టారెంట్ లో ఆహార భద్రత, పరిశుభ్రత ప్రమాణాలను పాటిస్తున్నా ఇంకా తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. కిచెన్ పరిశుభ్రత, ఆహార పదార్థాల నాణ్యత విషయంలోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులు వివాహ భోజనంబు నిర్వాహకులను ఆదేశించారు. ఈ రెస్టారెంట్ వెబ్‌సైట్‌లో హీరో సందీప్ కిషన్ ఫొటో ఉంది. ఆయన ఇతరులతో పాటు మేనేజింగ్ పార్టనర్‌గా ఉన్నారు.

గ్రిల్ 9 హోటల్ లో తనిఖీలు

ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ బృందం సికింద్రాబాద్ లోని గ్రిల్ 9 రెస్టారెంట్ లో సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో పలు ఉల్లంఘనలు గుర్తించింది.

  • FSSAI లైసెన్స్ ఒరిజినల్ కాపీ హోటల్ ప్రదర్శించలేదు.
  • పొట్లీ మసాలా (ఏప్రిల్ 2022 తేదీతో 35 ప్యాకెట్లు), సాస్ (1.4 కేజీలు), గార్లిక్ చిల్లీ సాస్ (13 ప్యాకెట్లు) గడువు ముగిసినట్లు గుర్తించారు.
  • స్టోర్ రూమ్‌లో సౌందర్య రోజ్ వాటర్ (250 మి.లీ) కనుగొన్నారు. దీనిని ఆహార పదార్ధాల్లో ఉపయోగిస్తున్నారనే అనుమానంతో దానిని తొలగించారు. స్టోర్ రూమ్ లోపల ఎలుకలు ఉన్నట్లు గుర్తించారు.
  • హెయిర్‌నెట్‌లు, గ్లౌజులు, యూనిఫాంలు ధరించకుండా కొంత మంది ఫుడ్ హ్యాండ్‌లర్‌లు కనిపించారు.
  • రిఫ్రిజిరేటర్‌లో నిల్వ ఉంచిన ఆహార వస్తువులు, సరిగ్గా లేబుల్ చేయని వాటిని గుర్తించారు. వెజ్, నాన్ వెజ్ ఫుడ్ ఆర్టికల్స్‌ను కలిపి నిల్వ ఉంచారు. రిఫ్రిజిరేటర్ అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు.
  • హోటల్ ప్రాంగణంలో పెస్ట్ కంట్రోల్ రికార్డులు, ఫుడ్ హ్యాండ్లర్లకు మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు అందుబాటులో లేవు.
  • హోటలో పెస్ట్ ప్రూఫ్ స్క్రీన్‌ను అమర్చలేదు. శుభ్రతా నియమాలు పాటించడంలేదు.

Whats_app_banner

సంబంధిత కథనం