Viral : ఆటగాడివే! ఒకేసారి ఇద్దరు గర్ల్​ఫ్రెండ్స్​.. దొరికిపోయి- చివరికి..-bihar teenager forced to marry his two girlfriends after being caught redhanded ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Viral : ఆటగాడివే! ఒకేసారి ఇద్దరు గర్ల్​ఫ్రెండ్స్​.. దొరికిపోయి- చివరికి..

Viral : ఆటగాడివే! ఒకేసారి ఇద్దరు గర్ల్​ఫ్రెండ్స్​.. దొరికిపోయి- చివరికి..

Sharath Chitturi HT Telugu
May 13, 2024 06:20 PM IST

Teenager forced marry twice : బిహార్​కు చెందిన ఓ యువకుడు.. 19ఏళ్ల వయస్సులోనే తన ఇద్దరు గర్ల్​ఫ్రెండ్స్​ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది! వేరువేరు ఘటనల్లో.. ఇద్దరితో కలిసి ఉన్నప్పుడు దొరికిపోవడంతో బలవంతంగా పెళ్లి జరిపించారు.

గర్ల్​ఫ్రెండ్స్​తో ఉన్నప్పుడు దొరికిపోయి.. చివరికి!
గర్ల్​ఫ్రెండ్స్​తో ఉన్నప్పుడు దొరికిపోయి.. చివరికి!

Bihar viral news : బిహార్​లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు వార్తల్లో నిలిచింది! ఓ యువకుడికి.. 20 రోజుల వ్యవధిలో రెండుసార్లు వివాహం జరిగింది. వేరువేరు ఘటనల్లో తన ఇద్దరు గర్ల్​ఫ్రెండ్స్​ని కలిసేందుకు వెళ్లిన ఆ వ్యక్తి.. రెడ్-​హ్యాండెడ్​గా దొరికిపోవడం ఇందుకు కారణం.

ఇదీ జరిగింది..

బిహార్​లోని జమౌ జిల్లాలో జరిగింది ఈ ఘటన. వినోద్​ అనే 19ఏళ్ల యువకుడు.. అక్షర అనే గ్రామంలో నివాసముంటున్నాడు. గత నెల 22న.. అతను, నవ్​కడిహ్​ గ్రామంలోని ప్రీతీ కుమారీ ఇంటికి వెళ్లాడు. వారిద్దరికి ఫేస్​బుక్​లో పరిచయం అయ్యింది. అది కాస్తా ప్రేమగా మారింది. అందుకే ఆమెను చూసేందుకు ప్రీతి ఇంటికి వెళ్లాడు.

అయితే.. ప్రీతీకి అప్పటికే పెళ్లి జరిగింది. ఒక బిడ్డ కూడా ఉంది. ఇవేవీ పట్టించుకోని ఆమె.. వినోద్​ని ఇంటికి పిలిచింది. చివరికి గ్రామస్థులకు వారిద్దరు రెడ్​-హ్యాండెడ్​గా దొరికిపోయారు. వారిద్దరిని వెంటనే స్థానిక గుడికి తీసుకెళ్లి.. బలవంతంగా వివాహం జరిపించారు. సింగిల్​గా వెళ్లిన వినోద్​.. తన ఇంటికి భార్య ప్రీతీతో తిరిగి వచ్చాడు. ఇద్దరు కలిసి వైవాహిక బంధాన్ని కొనసాగించారు.

Bihar Jamui marriage news : ఈ కథ ఇక్కడితో ముగిసిపోలేదు! ఇక్కడే మరో ట్విస్ట్​ ఉంది. ఈ వినోద్​.. తన గ్రామంలో డీజేగా పనిచేస్తూ ఉంటాడు. గిరిజ కుమారి అనే సింగర్​తో చాలా కాలంగా ఇతను రిలేషన్​లో ఉన్నాడు. ప్రీతీతో పెళ్లి తర్వాత కూడా.. గిరిజతో రిలేషన్​ని కొనసాగించాడు. తన పెళ్లి వ్యవహారాన్ని గిరిజ దగ్గర దాచాడు. గిరిజ వ్యవహారాన్ని భార్య ప్రీతీకి కూడా చెప్పలేదు.

ఇదీ చూడండి:- Crime news : గల్లీ క్రికెట్​ మ్యాచ్​లో గొడవ.. యువకుడిని బ్యాట్​తో కొట్టి చంపేశారు!

మొదటి పెళ్లి అయిన 20 రోజుల్లోనే.. గిరిజ ఇంటింకి వెళ్లాడు వినోద్​. గర్ల్​ఫ్రెండ్​తో ఉండగా.. గ్రామస్థులు వారిద్దరిని రెడ్​-హ్యాండెడ్​గా పట్టుకున్నారు. గ్రామస్థులు.. వారిని ఆలయానికి తీసుకెళ్లి, బలవంతంగా పెళ్లి జరిపించారు.

ఇలా.. 20 రోజుల వ్యవధిలో ఇద్దరు గర్ల్​ఫ్రెండ్స్​ని పెళ్లి చేసుకుని, ఇంటికి తీసుకెళ్లాడు వినోద్​.

Bihar viral news : ఇక రెండో పెళ్లి గురించి తెలుసుకున్న ప్రీతి.. షాక్​కు గురైంది. ఈ వ్యవహారంపై పోలీస్​ స్టేషన్​కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కాగా.. రెండో భార్య మాత్రం.. 'నాకే ఇబ్బంది లేదు. ముగ్గురం కలిసి సంతోషంగా జీవిద్దాము,' అని అంటోంది.

ఈ వార్త ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. వినోద్​ పరిస్థితి చూసి కొందరు నవ్వుకుంటుంటే.. ఇంకొందరు మాత్రం.. ఆ ఇద్దరిని మోసం చేశాడని ఆరోపిస్తున్నారు. 19ఏళ్లకే చాలా బరువు బాధ్యతలు మోయాల్సి వస్తోందని ఇంకొందరు కామెంట్స్​ చేస్తున్నారు. మరి.. ఇద్దరు గర్ల్​ఫ్రెండ్స్​తో వినోద్​ పెళ్లి గురించి మీరేం అంటారు?

వాస్తవానికి.. గర్ల్​ఫ్రెండ్​తో బలవంతంగా పెళ్లి జరిపించడం చాలా సాధారణమైన విషయం. కానీ.. ఇద్దరితో పెళ్లి జరిపించడమే కొత్తగా ఉందని నెటిజన్లు అంటారు. మొదటి భార్య ఉన్నప్పుడు.. రెండో గర్ల్​ఫ్రెండ్​తో ఎందుకు పెళ్లి జరిపించారు? ఇలా చేయడం.. సమస్యకు పరిష్కారమా? అని ప్రశ్నిస్తున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం