liver disease affects heart: లివర్ వ్యాధులా.. మీ గుండెకు రిస్క్‌ అంటున్న స్టడీ-study finds early forms of liver disease affect heart health ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Liver Disease Affects Heart: లివర్ వ్యాధులా.. మీ గుండెకు రిస్క్‌ అంటున్న స్టడీ

liver disease affects heart: లివర్ వ్యాధులా.. మీ గుండెకు రిస్క్‌ అంటున్న స్టడీ

Srishti Chaturvedi HT Telugu
Dec 09, 2022 01:00 PM IST

liver disease affects heart: లివర్ వ్యాధులు గుండె జబ్బులకు కారణమవుతాయని తాజా అధ్యయనం మరింత స్పష్టత ఇచ్చింది.

లివర్ వ్యాధులతో గుండె జబ్బులు కూడా
లివర్ వ్యాధులతో గుండె జబ్బులు కూడా (Twitter/This_Life_Mag)

లివర్ వ్యాధి ఆరంభ స్థాయిలో ఉన్నప్పటికీ అది గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని స్మిడ్త్ హార్ట్ ఇనిస్టిట్యూ పరిశోధకులు వెల్లడించారు. కార్డియోవాస్కులర్ మెడిసిన్ ఫ్రాంటియర్స్ జర్నల్‌లో సంబంధిత అధ్యయన ఫలితాలు ప్రచురితమయ్యాయి. లివర్ వ్యాధి, గుండె జబ్బుల మధ్య సంబంధంపై మరింత స్పష్టత ఇచ్చేందుకు ఈ అధ్యయనం దోహదపడింది.

లివర్ ఫైబ్రాసిస్ పేషెంట్లలో ఎఫ్ఐబీ 4 స్కోరు ఉన్న వారిని పరిశోధకులు పోల్చి చూశారు. ఈ స్కోరు తీవ్రమైన లివర్ వ్యాధులను సూచిస్తుంది. అలాగే గుండె అసాధారణ పనితీరును ఎమ్మారై స్కాన్ల ద్వారా పరీక్షించారు. ఎఫ్ఐబీ 4 స్కోరు ఉన్న పేషెంట్లలో గుండె పనితీరు, వాస్కులర్ డైమెన్షన్ అసాధారణంగా ఉన్నట్టు కనుగొన్నారు.

నాన్ ఆల్కహల్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉన్న వారిలో కార్డియోవాస్కులర్ మరణాలు సంభవిస్తాయని గతంలో తేలిందని, అయితే ఈ రెండింటి మధ్య సంబంధాలపై, అలాగే డయాబెటిస్ వంటి ఉమ్మడి రిస్క్ ఫ్యాక్టర్లకు గల సంబంధంపై స్పష్టత లేదని పరిశోధకులు డాక్టర్ ఆలన్ క్వాన్ వెల్లడించారు. గతంలో జరిగిన ఇదే తరహా అధ్యయనాల పరిధి పరిమితమని, అవి కేవలం సిరోసిస్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీయడాన్ని మాత్రమే పరిశీలించాయని చెప్పారు.

గడిచిన 11 ఏళ్లకు సంబంధించి 1,668 మంది పేషెంట్ల మెడికల్ రికార్డులను పరిశోధకులు అధ్యయనం చేశారు. ఎఫ్ఐబీ-4 స్కోర్ ఉన్న పేషెంట్ల రికార్డులను , అలాగే ఇది డయాగ్నసిస్ అయ్యాక ఏడాదిలోపు కార్డియాక్ ఎమ్మారై కలిగి ఉన్న పేషెంట్ల రికార్డులను ఇందుకు పరిగణనలోకి తీసుకున్నారు. 86 శాతం పేషెంట్లలో కనీసం ఒక్కటైనా గుండె సంబంధిత అసాధరణతలను కనుగొన్నట్టు పరిశోధకలు తెలిపారు.

గుండె స్వరూపం, పనితీరు, రక్త నాళాల పరిమాణం, స్ట్రక్చర్, గుండె కండరాల కూర్పు వంటివన్నీ ఈ కార్డియాక్ ఎమ్మారై స్కాన్‌లో తెలిసిపోతుంది.

‘వాస్కులర్ మార్పులు, రక్త నాళాలు ఉబ్బడం, రక్తం పరిమాణం పెరగడం వంటి అసాధారణ పరిమాణాలు మేం గమనించాం..’ అని క్వాన్ తెలిపారు.

‘పిజిషియన్లు గుండెను పరీక్షిస్తున్నప్పుడు సాధారణంగా లివర్ గురించి గానీ, లివర్ పరీక్షిస్తున్నప్పుడు గుండెను గురించి గానీ ఆలోచించరు. అయితే గుండెకు సంబంధించిన పరీక్షలు జరిపినప్పుడు, గుండె ఆరోగ్యం గురించి పరిశీలించినప్పుడు లివర్ కండిషన్ కూడా తెలుసుకోవాల్సి ఉంటుందని ఈ అధ్యయనం తేల్చింది. ఈ రెండు అవయవాలను వేర్వేరుగా చూడలేం..’ అని క్వాన్ వివరించారు.

తమ అధ్యయనంలో తదుపరి దశలో భాగంగా గుండె ఆరోగ్యంపై కాలేయం ఎలాంటి ప్రభావం చూపబోతోందన్న అంశాన్ని పరిశీలించడమేనని చెప్పారు.

‘నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధికి చికిత్స అందిస్తే అది గుండెకు కూడా సాయపడుతుందా? వంటి ప్రశ్నలకు కూడా జవాబు దొరకాల్సి ఉంది. హై కొలెస్ట్రాల్, బ్లడ్ ప్రెజర్, డయాబెటిస్, ఫ్యామిలీ హిస్టరీ వంటివి గుండె జబ్బుల్లో డిస్కస్ చేస్తారు. అయితే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్‌గా పరిగణనలోకి తీసుకోవాలా? అన్న ప్రశ్నకు కూడా జవాబు దొరకాలి..’ అని క్వాన్ వివరించారు.

ఈ అంశానికి సంబంధించి ఇంకా పరిశోధించేందుకు చాలా కారణాలు ఉన్నాయని స్మిడ్త్ హార్ట్ ఇనిస్టిట్యూట్ వైద్య నిపుణులు సూసన్ చెంగ్ అంగీకరించారు.

‘గుండెను లివర్ ప్రభావం చేయడం వెనక ఉన్న శాస్త్రీయ కారణాలను అర్థం చేసుకుంటే గుండె, ఇతర అవయవాల ఉమ్మడి పనితీరును అర్థం చేసుకోవచ్చు..’ అని వివరించారు. ‘ఇది భవిష్యత్తులో లివర్ డిసీజ్‌తో బాధపడుతున్న వారు గుండె జబ్బుల బారిన పడకుండా ఇవ్వాల్సిన చికిత్సను కనుగొనడంలో తోడ్పడుతుంది..’ అని వివరించారు.

WhatsApp channel