Veggies Egg Sandwich | సండే కోసం సరైన బ్రేక్‌ఫాస్ట్.. కూరగాయలతో ఎగ్ శాండ్‌విచ్!
Veggies Egg Sandwich Recipe: ఎక్కువ శ్రమలేకుండా శాండ్‌విచ్ చేసుకొని తినడం చాలా సులభం. ఇక్కడ రుచికరమైన, ఆరోగ్యకరమైన వెజ్జీస్ ఎగ్ శాండ్‌విచ్ రెసిపీని
Healthy Breakfast Recipes: అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన భోజనం అనడంలో ఎలాంటి సందేహం లేదు. సండే అయినా, మండే అయినా రోజూ ఉదయం మరిచిపోకుండా బ్రేక్ ఫాస్ట్ చేయాలి. ఇది మీకు అన్ని పోషణ, శక్తిని అందిస్తుంది. ఉదయాన్నే మంచి భోజనం తీసుకోవడం ద్వారా మీరు రోజంతా చురుకుగా ఉండటానికి అద్భుతమైన మార్గం. అయితే ఆదివారం రోజున చాలా మంది ఇంట్లోనే ఉంటాం కదా అని బ్రేక్ ఫాస్ట్ చేయరు, అసలు అల్పాహారం చేసుకోవడానికి కూడా బద్ధకిస్తారు. అయితే, ఎక్కువ శ్రమలేకుండా శాండ్‌విచ్ చేసుకొని తినడం చాలా సులభం. మీరు ఈ రెసిపీని క్షణాల్లో సిద్ధం చేసుకోవచ్చు.
ఇక్కడ రుచికరమైన, ఆరోగ్యకరమైన వెజ్జీస్ ఎగ్ శాండ్‌విచ్ రెసిపీని అందిస్తున్నాము. ఇక్కడ ఇచ్చిన సూచనలు చదివి ఈజీగా చేసేయండి.
Veggies Egg Sandwich Recipe కోసం కావలసినవి
- 2 మల్టీగ్రెయిన్ బ్రెడ్ ముక్కలు
- 2 ఉడికించిన గుడ్లు
- 1 ఉల్లిపాయ
- 1 టమోటా
- 1 క్యారెట్
- 2 టీస్పూన్ల నూనె/ వెన్న
- రుచికి తగినంత ఉప్పు, మిరియాల పొడి
- సీజనింగ్ కోసం చిల్లీ ఫ్లేక్స్
వెజ్జీస్ ఎగ్ శాండ్‌విచ్ ఎలా చేయాలి
- ముందుగా ఉడికించిన గుడ్లను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- ఒక గిన్నె తీసుకుని అందులో గుడ్డు ముక్కలు, ఉల్లిపాయ, టొమాటో, క్యారెట్ ముక్కలు వేసి బాగా కలపాలి.
- ఇప్పుడు అందులో ఉప్పు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్ చల్లి బాగా కలపాలి.
- అనంతరం ఈ గుడ్డు మిశ్రమాన్ని రెండు మల్టీగ్రెయిన్ బ్రెడ్ ముక్కల మధ్య స్టఫ్ చేయండి
- ఇప్పుడు ఒక పాన్ తీసుకుని దానిపై కొద్దిగా నూనె లేదా వెన్న పూసి వేడి చేయండి.
- ఆపై బ్రెడ్ ముక్కలు క్రిస్పీగా అయ్యే వరకు పాన్‌లో టాసు చేయండి.
అంతే, వెజ్జీస్ ఎగ్ శాండ్‌విచ్ రెడీ. ఈ శాండ్‌విచ్ తింటూ కాఫీ లేదా టీ తాగుతూ మీ సండే బ్రేక్‌ఫాస్ట్‌ను సరైన రీతిలో పూర్తి చేయండి.
సంబంధిత కథనం