Running: పొట్ట దగ్గర కొవ్వు తగ్గాలంటే రోజూ ఎంతసేపు రన్నింగ్ చేయాలి?
Running: ప్రతిరోజూ రన్నింగ్ చేయడం ద్వారా పొట్ట కొవ్వును తగ్గించుకోవచ్చని చెబుతున్నారు వ్యాయామ నిపుణులు.
Running: ప్రతిరోజూ రన్నింగ్ చేయడం వల్ల పొట్ట దగ్గర కొవ్వు తగ్గే అవకాశం ఎక్కువేనని చెబుతున్నారు వ్యాయామ నిపుణులు. రన్నింగ్ అనేది క్యాలరీలను బర్న్ చేయడానికి సహాయపడే కార్డియోస్కులర్ వ్యాయామం. ముఖ్యంగా బొడ్డు చుట్టూ చేరిన కొవ్వును ఇది కోల్పోయేలా చేస్తుంది. బరువు తగ్గేందుకు ఇది సులువైన వ్యాయామంగా చెప్పుకోవచ్చు. అయితే రోజులో ఎంతసేపు రన్నింగ్ చేస్తే పొట్ట కొవ్వును త్వరగా తగ్గించుకోవచ్చో వివరిస్తున్నారు వ్యాయామం నిపుణులు.
ఉదయం పూట వ్యాయామం చేయడం వల్ల ఫలితం ప్రభావంతంగా ఉంటుంది. రన్నింగ్ చేయాలనుకునేవారు ప్రతిరోజూ కనీసం 10 నిమిషాల నుండి 20 నిమిషాలకు తగ్గకుండా రన్నింగ్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే కచ్చితంగా వారు రన్నింగ్ షూ లను వాడాలి. ఎలాంటి రక్షణ లేకుండా రన్నింగ్ చేయడం వల్ల దీర్ఘకాలంలో వారు ఎముకలు, కీళ్లు దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఉత్తమ రన్నింగ్ షూలను వినియోగించాల్సి ఉంటుంది. మీరు రెగ్యులర్‌గా వాడే షూలను రన్నింగ్ కు ఉపయోగించడం వల్ల చీలమండ, ఇతర కీళ్ల సమస్యలు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి రన్నింగ్ చేయడానికి అవసరమైన షూలను కొనుక్కోవాలి.
ఒకరోజు రన్నింగ్ చేయడం, రెండు రోజులు రెస్ట్ తీసుకోవడం అనేది సరైన పద్ధతి కాదు. పొట్ట దగ్గర కొవ్వును తగ్గించాలంటే ప్రతిరోజూ రన్నింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి. వారంలో కనీసం ఐదు రోజులు రన్నింగ్ చేయడం ద్వారా త్వరగా పొట్ట కొవ్వును కరిగించుకోవచ్చు. దీన్ని మీ వ్యాయామ దినచర్యలో ఒక భాగం చేసుకోండి. ప్రత్యేకంగా ఉదయం ఖాళీ పొట్టతో పరిగెత్తడం వల్ల మంచి ప్రయోజనాలు వచ్చే అవకాశం ఉంది. ఇలా ప్రతిరోజూ రన్నింగ్ చేసే వారికి చక్కటి నిద్ర పడుతుంది. అలాగే డిప్రెషన్, యాంగ్జయిటీ వంటి వాటితో బాధపడుతున్న వారు కూడా రన్నింగ్ చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది. రన్నింగ్ చేసే వారిలో ఎండార్షిన్లు విడుదలవుతాయి. ఎండార్పిన్ హార్మోన్లు విడుదల కావడం వల్ల శరీరం ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది.
ప్రతిరోజూ రన్నింగ్ చేయడం వల్ల మెదడుకు అవసరమైన ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. మెదడుకు ఆక్సిజన్ అందుతుంది. దీనివల్ల ప్రతికూల భావోద్వేగాలు తగ్గుతాయి. ఎన్నో రకాల వ్యాధులు వచ్చే అవకాశం తగ్గుతుంది. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. పొట్ట తగ్గడం వల్ల మీరు పనులు కూడా చక్కగా చేయగలుస్తారు. చురుగ్గా ఉండగలుగుతారు. దీని వల్ల మీపై మీకు నమ్మకం పెరుగుతుంది.