Digital Transaction | OTPలతో జాగ్రత్త.. ఈ మోసం జరిగే ప్రమాదం ఉంది!
సురక్షితమైన లావాదేవీల కోసం బ్యాంక్‌లు Digital Transactionలను పోత్సహిస్తున్నాయి. ఆన్‌లైన్ ట్రాన్జాక్షన్ జరిపేటప్పుడు 2 స్టెప్ వెరిఫికేషన్, OTP ధృవీకరణ పద్దతిని ఉపయోగిస్తున్నాయి. అయితే సైబర్ నేరగాళ్లు ఈ OTP ధృవీకరణ విధానాన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.
ఈ డిజిటల్ యుగంలో బ్యాంకు ట్రాన్జాక్షన్లు సులువుగా మారిపోయాయి. ఇంట్లోనే కూర్చొని ఓ స్మార్ట్‌ఫోన్‌తో మరొకరికి నగదు బదిలీ చేసే అవకాశం ఇప్పుడు ఉంది. ఇది కస్టమర్ల పనిని సులువు చేసింది కానీ.. ఇదే అదునుగా సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతాల్లో సొమ్మును దోచేస్తున్నారు. ఎంతో సురక్షితమైనదిగా భావించే OTP వెరిఫికేషన్ ను కూడా వీళ్లు మాయ చేసి పక్కదారి పట్టిస్తున్నారు.
మీ కార్డు బ్లాక్ అవుతుందంటారు. ఓటీపీ చెప్పండంటూ ఫోన్ చేస్తారు. చెప్పగానే క్షణాల్లో బ్యాంకు ఖాతాలో డబ్బు మాయం. లావాదేవీలు చేసే సమయంలో.. కొన్నిసార్లు తొందరగా OTP వస్తుండగా కొన్ని సార్లు చాలా ఆలస్యమవుతోంది. కొన్ని సమయాల్లో మెుబైల్‌కు OTPయే రాదు. చాలా మంది ఇది నెట్‌వర్క్ సమస్యగా భావించి వదిలేస్తుంటారు. కానీ ఇది సైబర్ నేరగాళ్ల పని కూడా అయి ఉండవచ్చు.
OTP మోసం ఎలా జరుగుతుంది?
సైబర్ నేరగాళ్లు మీ ఫోన్ సందేశాలను హ్యాక్ చేసి.. మీరు ఆన్‌లైన్ ట్రాన్జాక్షన్ చేసే సమయాల్లో మీ మొబైల్‌కు రావాల్సిన OTPని మరో ఫోన్‌కు మళ్లిస్తారు. ఈ సందేశం హ్యాకర్ల చేతికి చేరే అవకాశం ఉంటుంది. హ్యాకర్లు మీ OTPని వాడుకొని లావాదేవీలు చేసి మీ ఖాతాను ఖాళీ చేస్తుంటారు. ఇలాంటి బ్యాంకింగ్ మోసాలు చాలా కష్టమైనప్పటికీ జరిగే ప్రమాదం ఉండటంతో.. మీరు ట్రాన్జాక్షన్ చేసే సమయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.
OTP మోసాన్ని ఎలా నివారించాలి?
మీరు ఆన్‌లైన్ ట్రాన్జాక్షన్ జరిపేటప్పుడు OTP సందేశాలు ఆలస్యమైనా, రాకపోయినా బ్యాంక్ హెల్ఫ్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలి. మీరు ఎప్పుడూ 2 స్టెప్ వెరిఫికేషన్ లావాదేవీలు జరుపుతూ ఉండాలి. అవకాశం ఉంటే, ఈ-మెయిల్ రూపంలో OTPని పొందే ఆప్షన్‌ను ఎంచుకోండి. అలాగే బ్యాంకింగ్ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు.
పాస్‌వర్డ్/OTP/CVV/కార్డ్ నంబర్ వంటి వ్యక్తిగత వివరాలను ఎవరికీ చెప్పొద్దు. ఫోన్/ఈ-మెయిల్ లేదా SMS ద్వారా ఎలాంటి సమాచారాన్నికూడా బ్యాంక్‌లు కస్టమర్‌లను అడగవు. ఆన్‌లైన్‌లో చేసి ప్రతి ట్రాన్జాక్షన్ పట్ల అప్రమత్తంగా ఉండండి.
సంబంధిత కథనం