Egg Pakora: సాయంత్రం స్నాక్స్ లోకి ఎగ్ పకోడీ.. పక్కా కొలతలతో..-know how to make tasty egg pakora for evening snacks ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Egg Pakora: సాయంత్రం స్నాక్స్ లోకి ఎగ్ పకోడీ.. పక్కా కొలతలతో..

Egg Pakora: సాయంత్రం స్నాక్స్ లోకి ఎగ్ పకోడీ.. పక్కా కొలతలతో..

Koutik Pranaya Sree HT Telugu
Nov 08, 2023 04:15 PM IST

Egg Pakora: వేడిగా సాయంత్రం పూట ఏమైనా తినాలనిపిస్తే ఎగ్ పకోడీ ప్రయత్నించండి. చాలా రుచిగా ఉంటాయి. చేయడం కూడా సులభమే.

ఎగ్ పకోడీ
ఎగ్ పకోడీ (flickr)

సాయంత్రం పూట వేడి వేడిగా ఎగ్ పకోడీ చేసిస్తే ఎవరైనా ఇష్టంగా తినేస్తారు. సింపుల్ గా పక్కా కొలతలతో చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. వీటిని సర్వ్ చేసుకునేటప్పుడు మామూలుగా కాకుండా కాస్త వినూత్నంగా ప్రయత్నించండి. ముక్కలు కోసి మసాలాలు చల్లి ఇవ్వచ్చు. మధ్యలో కూరగాయ ముక్కలు పెట్టి ఇవ్వచ్చు. వాటిని ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి.

కావాల్సిన పదార్థాలు:

6 గుడ్లు

డీప్ ఫ్రైకి సరిపడా నూనె

1 కప్పు మైదా

2 చెంచాల బియ్యం పిండి

1 చెంచా కారం

1 చెంచా మిరియాల పొడి

పావు చెంచా పసుపు

1 టీస్పూన్ సోంపు పొడి

అరచెంచా అల్లం వెల్లుల్లి ముద్ద

తగినంత ఉప్పు

చిటికెడు బేకింగ్ సోడా

తయారీ విధానం:

  1. ముందుగా గుడ్లను ఉడికించుకుని, సగం ముక్కలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
  2. ఒక గిన్నెలో మైదా, బియ్యం పిండి, కారం, పసుపు, సోంపు పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద, బేకింగ్ సోడా వేసుకుని కలుపుకోవాలి.
  3. కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ జారుడు పిండిలాగా కలుపుకోవాలి.
  4. ఇప్పుడు సగం ముక్కలుగా చేసుకుని గుడ్లను తీసుకుని ఒక్కొక్క ముక్కను పిండిలో ముంచి వేడి నూనెలో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి.
  5. వీటిని మళ్లీ ముక్కలుగా చేసుకుని కొద్దిగా మిరియాల పొడి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసుకుని టమాటా కెచప్‌తో సర్వ్ చేసుకుంటే చాలు.

Whats_app_banner