IGNOU admission: ఇగ్నో రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు.. చివరి తేదీ ఎప్పుడంటే!-ignou re registration today is the last date for re registration of ignou will not get the chance again ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ignou Admission: ఇగ్నో రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు.. చివరి తేదీ ఎప్పుడంటే!

IGNOU admission: ఇగ్నో రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు.. చివరి తేదీ ఎప్పుడంటే!

HT Telugu Desk HT Telugu
Aug 26, 2022 04:02 PM IST

IGNOU July Re-registration 2022: ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (ఇగ్నో) రీ-రిజిస్ట్రేషన్‌కు గడవు తేదీని 25 ఆగస్టు 2022 వరకు పొడిగించారు.

<p>IGNOU July Re-registration 2022</p>
IGNOU July Re-registration 2022

ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (ignou) రీ-రిజిస్ట్రేషన్‌ చివరి తేదీని 25 ఆగస్టు 2022 వరకు పొడిగించారు . ఈ మేరకు ఇగ్నో యూనివర్శిటీ ట్వీటర్ ద్వారా సమాచారం ఇచ్చింది. దీనితో పాటు, అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వరకు వేచి ఉండకూడదని ముందుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ignou.samarth.edu.inని సందర్శించడం ద్వారా విద్యార్థులు రీ-రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని IGN తెలిపింది. రిజిస్ట్రేషన్ తేదీని ఇగ్నో రెండు సార్లు పొడిగించింది. ఆగస్టు 12 వరకు చివరి గడువు తేదీ ఉండగా దానిని 25 ఆగస్టు వరకు పెంచింది. అంతకు ముందు జూలై 31 చివరి తేదీ గడువు తేదీ ఉండగా దానిని ఆగస్టు 12 వరకు పొడిగించింది.

IGNOUలో వివిధ అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ కోర్సులలో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు ఆగస్టు 25లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు గడువు తేదీ కంటే ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని యూనివర్శిటీ సూచించింది. దరఖాస్తును చేసుకోవడానికి విద్యార్థులు యూజర్ నెమ్, పాస్‌వర్డ్ అవసరమవుతుంది. IGNOUలో చదవాలనుకునే 12వ తరగతి విద్యార్థులు BSc, BBA, BCA సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు, ఇది కాకుండా MBA, MSc, MCA, PGకి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.250 చెల్లించాలి. ఇచ్చిన గేట్‌వే నుండి మాత్రమే ఫీజు చెల్లింపు తీసుకోబడుతుంది. ఫీజు చెల్లించిన తర్వాతే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.

IGNOU July Session 2022: ఎలా నమోదు చేసుకోవాలి

ignou.samarth.edu.in వద్ద IGNOU అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

లాగిన్ వివరాలను పూరించండి, సమర్పించండి.

దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి, దరఖాస్తు రుసుమును జమ చేయండి.

అప్లికేషన్ పూర్తి కాగానే సబ్‌మిట్ చేయండి.

అక్నాలెడ్జ్మెంట్ డౌన్‌లోడ్ చేసి, భవిష్యత్తు అవసరాల కోసం హార్డ్‌కాపీ దగ్గర ఉంచండి.

Whats_app_banner

సంబంధిత కథనం