చీజ్ బాల్స్.. ఈ స్టార్టర్ ఇప్పుడెంతో మందికి ఫేవరేట్, రెసిపీ కూడా చాలా సింపుల్-craving for snacks try out cheese balls ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  చీజ్ బాల్స్.. ఈ స్టార్టర్ ఇప్పుడెంతో మందికి ఫేవరేట్, రెసిపీ కూడా చాలా సింపుల్

చీజ్ బాల్స్.. ఈ స్టార్టర్ ఇప్పుడెంతో మందికి ఫేవరేట్, రెసిపీ కూడా చాలా సింపుల్

Manda Vikas HT Telugu
Dec 28, 2021 05:34 PM IST

వాతావరణం చల్లగా మారినపుడువేడివేడిగా ఏదైనా తినాలి, తాగాలి అని మన నోటికి కోరికలు మరింత పెరిగినట్లు అనిపిస్తుంది. ఇలాంటి సమయాలో వేడివేడి పకోడిలు, టీ చాలా మందికి ఫేవరేట్. ముఖ్యంగా పిల్లలు ఈ స్నాక్ తినటానికి ఎక్కువగా ఇష్టపడతారు. అందుకే చీజ్ బాల్స్ ఎంతో రుచికరంగా ఉంటాయి. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Chees Balls Recipe
Chees Balls Recipe (Stock Photo)

చిరుతిండ్లను తినడానికి మనమందరం చాలా ఇష్టపడతాము. వర్షాకాలం, చలికాలంలోనైతే చిరుతిండ్లు ఇంకా ఎక్కువ గుర్తొస్తాయి. వాతావరణం చల్లగా మారినపుడు వేడివేడిగా ఏదైనా తినాలి, తాగాలి అని మన నోటికి కోరికలు మరింత పెరిగినట్లు అనిపిస్తుంది. ఇలాంటి సమయాలో వేడివేడి పకోడిలు, టీ చాలా మందికి ఫేవరేట్. అయితే, ఎప్పుడు పకోడి తిని విసిగిపోతే అందుకు ప్రత్యామ్నాయమైన మరో రుచికరమైన స్నాక్ చీజ్ బాల్స్. 

పెద్దపెద్ద ఈవెంట్స్ లేదా పార్టీలు జరుగుతున్నపుడు చీజ్ బాల్స్ ఇప్పుడు పాపులర్ స్టార్టర్స్ గా చెప్తున్నారు. అలాగని ఇవి స్టార్ హెటెళ్లలో పనిచేసే చెఫ్స్ మాత్రమే చేసే వంటకం ఏం కాదు. మన ఇంట్లో కూడా సులభంగా తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా పిల్లలు ఈ స్నాక్స్ తినటానికి ఎక్కువగా ఇష్టపడతారు. మీరు ఈ వారాంతంలో ఈ రెసిపీని ప్రయత్నించి మీ కుటుంబ సభ్యులను ఆశ్చర్యపరచండి. వీటికి కావాల్సిన పదార్థాలేంటి, ఎలా తయారు చేయాలి? కింద ఇచ్చాము, గమనించండి.

చీజ్ బాల్స్ తయారీకి పదార్థాలు:

• ఒక కప్పు తురిమిన చీజ్

• రెండు గుడ్లు

• పావు కప్పు మైదా

• ఒక టీస్పూన్ ఉప్పు

• పావు టీస్పూన్ మిరప పొడి

• హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్

• వేయించడానికి నూనె

చీజ్ బాల్స్ తయారు చేసే విధానం:

ముందుగా ఒక గిన్నెలో నూనె మినహా పైన పేర్కొనబడిన అన్ని పదార్థాలను బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక మెత్తని పిండి ముద్దలాగా చేసుకొని, చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత వీటిని ఒక 15 నిమిషాల పాటు పక్కనపెట్టండి. దీని తర్వాత ఒక మూకుడులో నూనె తీసుకొని వేడి చేయాలి. తర్వాత చీజ్ బాల్స్‌ను డీప్ ఫ్రై చేసుకోవాలి. ముదురు బంగారు రంగుకు మారిన తర్వాత, సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే చీజ్ బాల్స్ రెడీ అయినట్లే.

 

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్