Breakfast Ideas : బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ ఆహారాలు తింటే ఆరోగ్యానికి చాలా బెస్ట్-breakfast ideas eat these foods in breakfast for health ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Breakfast Ideas : బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ ఆహారాలు తింటే ఆరోగ్యానికి చాలా బెస్ట్

Breakfast Ideas : బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ ఆహారాలు తింటే ఆరోగ్యానికి చాలా బెస్ట్

HT Telugu Desk HT Telugu
Apr 12, 2023 06:30 AM IST

Breakfast Ideas : రాత్రిపూట భోజనం చేసిన తర్వాత.. మరుసటి రోజు ఉదయం వరకూ చాలా టైమ్ ఉంటుంది. అందుకే అల్పాహారం ఆరోగ్యమైనవి తీసుకోవాలి.

బ్రేక్ ఫాస్ట్ ఐడియాలు
బ్రేక్ ఫాస్ట్ ఐడియాలు

ఉదయం బ్రష్ చేయగానే.. కడుపు ఆకలి అని అడుగుతుంది. ఏదో ఒకటి తినేద్దామని మీరు అనుకుంటారు. కానీ ఏది పడితే అది తింటే అనారోగ్య సమస్యలు వస్తాయి. ఉదయం పూట శక్తివంతమైన ఆహారాలు తీసుకుంటే.. రోజంతా యాక్టివ్ గా ఉంటారు. శ‌రీరానికి శ‌క్తి, పోష‌ణ ల‌భిస్తాయి. ఉద‌యం ప‌ర‌గ‌డుపున తినాల్సిన ఆహారాల్లో కొన్ని బెస్ట్ ఆహారాలు ఇక్కడ ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోండి.

yearly horoscope entry point

ఉద‌యంపూట చాలా మంది బియ్యంతో పొంగ‌ల్ చేసుకొని తింటారు. అయితే బియ్యానికి బ‌దులుగా కొర్రల‌తో పొంగ‌ల్ చేసి.. తింటే ఎంతో మంచిది. రుచిగా కూడా ఉంటుంది. అంతేకాదు.. పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. ఉద‌యం కొర్రలతో చేసిన పొంగ‌ల్‌ను తింటే డ‌యాబెటిస్ ఉన్నవారికి ఎంతో మంచిది. అధిక బ‌రువును సుల‌భంగా తగ్గించుకోవ‌చ్చు. కొర్రలు, పొట్టు పెస‌ర ప‌ప్పు, అల్లం ముక్కలు, ప‌చ్చి మిర్చి ముక్కలు, మిరియాల పొడి, జీలకర్ర, క‌రివేపాకులు, కొత్తిమీర‌, ఇంగువ‌, ఉప్పు, నెయ్యి, చిక్కుడు కాయ‌లు, క్యారట్, మెంతి కూరను వేసి కొర్రలతో పొంగ‌ల్ త‌యారు చేయాలి. ఇది తింటే ఎంతో బ‌లం వ‌స్తుంది. అనేక పోష‌కాలు కూడా అందుతాయి. ఉదయం తింటే ఆరోగ్యానికి మంచిది.

ఉద‌యాన్నే రాగి జావ చేసుకుని.. అందులో నెయ్యి, జీడిప‌ప్పు వేసి తీసుకోవ‌చ్చు. అంతేకాదు.. రాత్రి పూట అన్నం వండి అందులో కొద్దిగా పాలు పోసి క‌లిపి మ‌జ్జిగ వేసి పెట్టుకోవాలి. మ‌రుస‌టి రోజు ఉద‌యం అది చద్దన్నంగా అవుతుంది. ఇది తింటే ఎన్నో పోష‌కాల‌ను లభిస్తాయి. అద్భుతమైన అల్పాహారం చద్దన్నం. ఒక్క ఉల్లిపాయ‌లు, కొత్తిమీర‌, ప‌చ్చి మిర్చి ముక్కలను కలిపి తింటే.. ఆ రుచే వేరు.

ఉద‌యం బ్రౌన్ రైస్‌ను అన్నంలా వండుకుని తినొచ్చు. ఇది కూడా మంచి బ్రేక్ ఫాస్ట్. నూనె లేకుండా గోధుమ పిండితో పుల్కాల‌ను కాల్చి అందులోకి శ‌న‌గ‌ల కూర వేసుకుని తింటే ఆరోగ్యానికి మంచిది. ప‌ర‌గ‌డుపున మొదట గోరు వెచ్చని నీరు, తేనె, నిమ్మరసం కలిపి తాగాలి. త‌రువాత బొప్పాయి, ఆపిల్, జామ, పుచ్చకాయ, కర్భుజా వంటి పండ్లను తినొచ్చు. ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో మొలకెత్తిన విత్తనాలు, ఉడ‌క‌బెట్టిన కోడిగుడ్డు, పండ్లను కూడా తీసుకోవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం