Ashada Ekadashi 2022 : అసలు ఆషాడ ఏకాదశి గురించి పురాణాలు ఏమి చెప్తున్నాయంటే..-ashada ekadashi 2022 rituals and significance and history ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ashada Ekadashi 2022 : అసలు ఆషాడ ఏకాదశి గురించి పురాణాలు ఏమి చెప్తున్నాయంటే..

Ashada Ekadashi 2022 : అసలు ఆషాడ ఏకాదశి గురించి పురాణాలు ఏమి చెప్తున్నాయంటే..

Geddam Vijaya Madhuri HT Telugu
Jul 09, 2022 10:23 AM IST

Ashada Ekadashi 2022 : హిందూ మాసంలో రెండు చాంద్రమాన పక్షాలు ఉన్నాయి. ఒకటి శుక్ల పక్షం మరొకటి కృష్ణ పక్షం. ఆషాఢ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని దేవశయని ఏకాదశి అంటారు. ఈ ఏడాది దేవశయని ఏకాదశిని జూలై 9న ప్రారంభమై.. జూలై 10వ తేదీన ముగుస్తుంది.

<p>దేవశయని ఏకాదశి</p>
దేవశయని ఏకాదశి

Ashada Ekadashi 2022 : ఆషాడంలో దేవశయని ఏకాదశి తిథి నేడు అనగా.. జూలై 9వ తేదీ శనివారం సాయంత్రం 4.39 గంటలకు ప్రారంభమై.. జూలై 10వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2.13 గంటల వరకు కొనసాగుతుంది. దేవశయని ఏకాదశి హరి వాసర ముగింపు ముహూర్తం జూలై 10, రాత్రి 7.29 గంటలకు, దేవశయని ఏకాదశి పరణ సమయం జూలై 11, సోమవారం ఉదయం 5.31 నుంచి 8.17 వరకు ఉంటుంది.

పురణాలు ఏమి చెప్తున్నాయంటే..

దేవ్ అంటే దేవుడు (ఇక్కడ విష్ణువుకు సూచన). శయాని అంటే విశ్రాంతి అని అర్థం. హిందూ గ్రంధాల ప్రకారం.. దేవశయని ఏకాదశి అంటే విష్ణువు నాలుగు నెలల పాటు యోగ నిద్రలోకి వెళ్లే రోజు. దేవుడు క్షీరసాగరం లేదా విశ్వ సముద్రంలో తన సర్పమైన శేషనాగు శరీరంపై విశ్రాంతి తీసుకుంటారని భక్తులు నమ్ముతారు.

నాలుగు నెలల తర్వాత ప్రబోధిని ఏకాదశి రోజున విష్ణువు నిద్రలేచాడు. విష్ణువు విశ్రాంతి తీసుకుంటుండగా.. శివుడు విశ్వాన్ని చూసుకుంటాడు. అందుకే ఈ సమయంలో శివుడిని ఎక్కువగా పూజిస్తారు. శ్రావణ మాసంలో కూడా భక్తులు పరమశివుని పూజిస్తారు. ఈ ఏకాదశి తిథితో శ్రావణ, భాద్రపద, అశ్వినీ, కార్తీక మాసాల పవిత్ర చాతుర్మాస కాలం ప్రారంభమవుతుంది.

ఈ నాలుగు నెలల్లో హిందువులు కృష్ణ జన్మాష్టమి, గణేష్ చతుర్థి, శ్రావణ సోమవార వ్రతం, నవరాత్రి, దీపావళి వంటి కొన్ని పెద్ద పండుగలను జరుపుకుంటారు. అయితే ఆషాడంలో వివాహాలు, నిశ్చితార్థాలు, నామకరణ వేడుకలు లేదా గృహప్రవేశ కార్యక్రమాలు వంటి శుభకరమైన కార్యక్రమాలు చేయారు.

Whats_app_banner

సంబంధిత కథనం