NNS 23rd April Episode: రామ్మూర్తి వల్ల చెరిగిన బంధనరేఖ.. కల్యాణమండపంలో అరుంధతి.. ముసుగేసుకుంటానన్న మనోహరి!
NNS 23rd April Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మంగళవారం (ఏప్రిల్ 23) ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. కల్యాణ మండపంలో అరుంధతి ప్రత్యక్షమవుతుంది.
NNS 23rd April Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం మంగళవారం (ఏప్రిల్ 23) ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. రామ్మూర్తి, మంగళ కంగారుగా కల్యాణ మండపానికి చేరుకుంటారు. వారిని చూసి గుప్త, అరుంధతి షాకవుతారు. ఏమైంది అంత కంగారు పడుతున్నారని రామ్మూర్తిని అడుగుతాడు గుప్త. తన కూతురు ఉన్నపళంగా కల్యాణ మండపానికి వచ్చిందని అంటాడు రామ్మూర్తి.
కల్యాణ మండపలోకి అరుంధతి
దానికి కంగారెందుకు అంటున్న గుప్తతో.. పౌర్ణమి రోజున నా కూతురు పెళ్లి జరుగుతుందని పంతులు చెప్పారు, ఈ రోజు బాబుగారి పెళ్లి జరుగుతుంది, ఉన్నట్టుండి నా కూతురు ఇక్కడకు వచ్చింది అంటాడు రామ్మూర్తి. అది విని షాకవుతాడు గుప్త. విన్నారా గుప్తగారు ఆయనకి, భాగీకి పెళ్లి చేయాలని దేవుడే అనుకుంటున్నాడు అంటుంది అరుంధతి.
మంగళ చెబుతున్నా వినకుండా కంగారుగా లోపలకు పరిగెత్తుతాడు రామ్మూర్తి. పక్కనే ఉన్న నీళ్ల బాటిల్ రామ్మూర్తి చెయ్యి తాకి కిందపడుతుంది. దాంట్లోని నీళ్లు బంధన రేఖపై పడటంతో చెరిగిపోతుంది. రామ్మూర్తి వెనకాల పరిగెత్తుతూ చూసుకోకుండా అరుంధతి కల్యాణ మండపం లోపలికి వెళ్తుంది. అది చూసిన చిత్రగుప్తుడు ఆశ్చర్యపోతాడు. గమనించిన అరుంధతి చూశారా గుప్తగారు.. నేను చేయాలనుకుంటున్నది మంచి పని, అందుకే ఆ దేవుడు కూడా నాకు సాయం చేస్తున్నాడు అంటుంది. చిత్రగుప్తుడు ఎంత చెప్పినా వినకుండా పెళ్లి ఆపేందుకు కల్యాణమండపంలోకి పరుగు పెడుతుంది అరుంధతి.
అమర్ పక్కన భాగీ
పెళ్లి ముహుర్తం దగ్గర పడుతున్నకొద్దీ టెన్షన్ పెరుగుతోందని కంగారు పడుతుంది మనోహరి. మండపంలో తనకోసం వచ్చిన బిహారీ గ్యాంగ్ ఉందో చూసి రమ్మని పంపిస్తుంది. అప్పుడే మనోహరి దగ్గరకు వచ్చిన అరుంధతి తన స్నేహితురాలిగా ఉన్న మనోహరి నువ్వేనా అంటూ బాధపడుతుంది. నీల వచ్చి అక్కడ ఎవరూ లేరని చెప్పడంతో మండపంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతుంది మనోహరి.
పెళ్లి ఆపడానికి ఏం చేయాలా అని ఆలోచిస్తున్న అరుంధతి అక్కడే ఉన్న భాగీ కనిపిస్తుంది. వెంటనే తన దగ్గగరకు వెళ్లి అమర్‌ని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని అడుగుతుంది. ఆయన రాముడిలాంటివాడు. ఆయన్ని పెళ్లి చేసుకోవడం అంటే ఏ అమ్మాయైనా అదృష్టంగా భావిస్తుందని అంటుంది భాగీ. తన భర్తపై భాగీకి ఉన్న అభిమానం అర్థం చేసుకున్న అరుంధతి తను తీసుకున్న నిర్ణయం సరైనదే అనుకుంటుంది. రాథోడ్ పిలుస్తుండటంతో వస్తున్నా అని చెబుతుంది భాగీ. తనని క్షమించమంటూ భాగీ శరీరంలో ప్రవేశిస్తుంది అరుంధతి.
అమ్మాయిని తీసుకురండమ్మా అని పంతులు చెప్పడంతో మనోహరి మండపంలోకి వచ్చేందుకు సిద్ధమవుతుంది. అక్కడే కూర్చున్న బిహారీ గ్యాంగ్‌ని చూసి పరుగున రూమ్‌లోకి వెళ్లి కంగారు పడుతుంది. అమర్ తల్లి మనోహరికి ఏమైందని కనుక్కోవడానికి వస్తుంది. ఓ గుళ్లో తను ఓ మొక్కు మొక్కుకున్నానని, తన పెళ్లి ముసుగు వేసుకుని చేసుకోవాలని అంటుంది మనోహరి. సరే నీ ఇష్టం, త్వరగా రమ్మని చెప్పి వెళ్లిపోతుంది నిర్మల. కల్యాణ మండపంలో అమర్ పక్కన కూర్చున్న భాగీని చూసి మనోహరి ఏం చేసింది? తను పెళ్లి చేసుకోబోయేది మిస్సమ్మని అని అమర్ తెలుసుకుంటాడా? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు ఏప్రిల్ 23న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!
టాపిక్