NTR |రాజమౌళి సినిమా సెంటిమెంట్‌ను ఎన్టీఆర్ 30 బ్రేక్ చేస్తుందా?
రాజమౌళితో సినిమా చేసి హిట్ కొట్టిన హీరోలందరూ తమ తదుపరి సినిమాలతో ఫ్లాప్‌లను ఎందుర్కొన్నారు. ప్రభాస్, ఎన్టీఆర్,రవితేజ ఈ సెంటిమెంట్‌కు బ్రేక్ చేయాలని ప్రయత్నించి విఫలమయ్యారు. ఇటీవలే ఆచార్యతో రామ్‌చరణ్ విషయంలో ఈ సెంటిమెంట్ రిపీట్ కావడంతో అందరి దృష్టి ఎన్టీఆర్ తదుపరి సినిమాపై పడింది
సినీ పరిశ్రమలో సెంటిమెంట్స్ ఎక్కువే. కోట్లలో ముడిపడిన బిజినెస్ కావడంలో దర్శకనిర్మాలతో పాటు హీరోలు కూడా ఈ సెంటిమెంట్స్‌ను ఫాలో అవుతుంటారు. బ్రేక్ చేసి రిస్క్‌లు తీసుకోవడానికి ఇష్టపడరు. వాటిలో రాజమౌళి సినిమా సెంటిమెంట్ ఒకటి. రాజమౌళితో సినిమా చేసి హిట్ కొట్టిన హీరోలందరూ తమ తర్వాతి సినిమాలతో ఫ్లాప్‌ను ఎదుర్కొన్నారు. ప్రభాస్, ఎన్టీఆర్, రవితేజతో పాటు రాజమౌళితో పనిచేసిన ప్రతి ఒక్క హీరో ఈ సెంటిమెంట్‌కు బలైపోయారు. తాజాగా ఆచార్యతో ఈ సెంటిమెంట్ మరోసారి పునరావృతమైంది.
ఆచార్య ప్రీ రిలీజ్ వేడుకలో రాజమౌళి సెంటిమెంట్‌ను తమ సినిమా బ్రేక్ చేస్తుందని చిరంజీవి నమ్మకంగా చెప్పారు. కానీ ఆ మాటలు నిజం కాలేదు. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆచార్యతో చరణ్ కు ఫ్లాప్ వచ్చింది. దాంతో ఇప్పుడు అందరి దృష్టి ఎన్టీఆర్ సినిమాపై పడింది. రాజమౌళితో స్టూడెంట్ నంబర్‌వన్, సింహాద్రి, యమదొంగ సినిమాలు చేశారు ఎన్టీఆర్. ఈ విజయాల తర్వాత ఎన్టీఆర్ నటించిన సినిమాలు ఫ్లాప్‌గా నిలిచాయి. దాంతో ఈ సెంటిమెంట్ మళ్లీ ఎక్కడ రిపీట్ అవుతుందోనని ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో భయపడుతున్నారు.
ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాల శివతో ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే ఆచార్యతో కొరటాల శివపై చాలా విమర్శలొస్తున్నాయి. ఎన్టీఆర్ సినిమాను అంచనాలకు తగ్గట్లుగా అతడు తెరకెక్కిస్తాడా లేదో నని అభిమానులు కలవరపడుతున్నారు. ఆచార్య ఫ్లాప్ తో ఈ సినిమాపై అనేక సందేహాలు మొదలుయ్యాయి. వీటికి తోడు రాజమౌళి సెంటిమెంట్ కూడా తోడవ్వడంతో కొరటాలపై మరింత ఒత్తిడి పెరిగిపోయింది. ఈ సినిమాతో ఆ సెంటిమెంట్ ను ఎన్టీఆర్, కొరటాల శివ బ్రేక్ చేస్తారో లేదో అన్నది సస్పెన్స్ గా మారింది. ఒకవేళ రాజమౌళి సెంటిమెంట్ గెలిస్తే కొరటాల శివ కెరీర్‌కు ఇబ్బందులు తప్పవని అంటున్నారు. జూన్ నెలలో ఈ సినిమా సెట్స్ పైకి రానున్నది. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కలిసి చేస్తున్న సినిమా ఇది.
సంబంధిత కథనం
టాపిక్