VS11 first look: ఎన్టీఆర్ తెలుగోడి ఆత్మగౌరవం.. తారకరాముడికి విశ్వక్ సేన్ ట్రిబ్యూట్
VS11 first look: విశ్వక్ సేన్ సీనియర్ ఎన్టీఆర్ అదిరిపోయే రీతిలో నివాళీ ప్రకటించారు. తన నటిస్తున్న సరికొత్త చిత్రం VS11 మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. తెలుగోడి ఆత్మగౌరవం అంటూ ఎన్టీఆర్ గురించి అందులో ప్రస్తావించారు.
VS11 first look: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ తన కెరీర్‌లోనే బెస్ట్ ఫేజ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు ఈ స్టార్. గతేడాది అశోక వనములో అర్జున కల్యాణం, ఓరి దేవుడా, ముఖచిత్రం లాంటి సినిమాల్లో మెరిసిన ఈ బ్యూటీ ఈ ఏడాది దాస్ కా ధమ్కీ లాంటి యాక్షన్ థ్రిల్లర్‌తో సందడి చేశాడు. త్వరలో మరో అదిరిపోయే మూవీతో రాబోతున్నాడు. VS11 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ మూవీకి సంబధించిన అప్డేట్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
"కీర్తిని సాధించాలనుకున్న మనిషిని ఏది ఆపలేదు. లెజెండ్ శ్రీ నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ ఆయన 100వ జయంతి సందర్భంగా వీఎస్11 లుక్ విడుదల చేస్తున్నాం" అంటూ విశ్వక్ తన మూవీ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ పోస్టర్‌ను గమనిస్తే.. విశ్వక్ సేన్ రగ్గెడ్ లుక్‌లో దర్శనమిచ్చారు. అంతేకాకుండా బ్యాక్ గ్రౌండ్‌లో జోహార్ ఎన్టీఆర్ తెలుగోడి ఆత్మగౌరవం అని రాసి ఉండటం గమనించవచ్చు. ఈ పోస్టర్‌ను బట్టి చూస్తే ఈ మూవీ ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది. విశ్వక్ ఇమేజ్ తగినట్లుగా స్క్రిప్టును రూపొందించారు. ఈ మూవీలో విశ్వక్ సరికొత్త అవతార్‌లో కనిపించనున్నారు.
ఈ మూవీకి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని సమకూరుస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశ్వక్ సరసన హీరోయిన్ ఇంకా ఫైనలైజ్ కాలేదు. విశ్వక్ నటిస్తున్న ఈ మూవీని ఈ ఏడాది చివర్లో విడుదల చేయనున్నారు మేకర్స్.
టాపిక్