Cobra Trailer: కోబ్రా తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. విక్రమ్ విశ్వరూపం చూపించాడు-vikram new movie cobra telugu trailer released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Cobra Trailer: కోబ్రా తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. విక్రమ్ విశ్వరూపం చూపించాడు

Cobra Trailer: కోబ్రా తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. విక్రమ్ విశ్వరూపం చూపించాడు

Maragani Govardhan HT Telugu
Aug 26, 2022 07:06 PM IST

విక్రమ్ హీరోగా నటించిన తాజా చిత్రం కోబ్రా. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 31న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

కోబ్రా తెలుగు ట్రైలర్
కోబ్రా తెలుగు ట్రైలర్ (Twitter)

విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న హీరో విక్రమ్. తన సినిమాల్లో వైవిధ్యాన్ని ప్రదర్శించే కథానాయకుల్లో విక్రమ్ ముందు వరుసలో ఉంటారు. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చున్నారు. ప్రయోగాత్మాక చిత్రాలకు పేరొందిన ఈ హీరో.. మరోసారి అలాంటి విభిన్న తరహా సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. అదే కోబ్రా. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలై ఆడియోన్స్‌లో అంచనాను పెంచేసింది. గురువారం నాడు ఈ చిత్రం తమిళ ట్రైలర్ విడుదల కాగా.. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.

ఈ ట్రైలర్‌ను గమనిస్తే విక్రమ్‌ను విలన్ గ్యాంగ్ చిత్రహింసలు పెట్టే సన్నివేశంతో సినిమా ప్రారంభమవుతుంది. ఇందులో విక్రమ్ విభిన్న గెటప్పుల్లో కనిపిస్తారు. ఆయన పోషించిన విభిన్న పాత్రలు ఒక్కక్కటి రివీల్ అవుతూ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. ప్రతి లుక్‌ను తనదైన మార్కును చూపించారు విక్రమ్. ఇందులో ఆయన గణిత శాస్త్రవేత్తగా కనిపించనున్నారు.

ఈ సినిమాలో విక్రమ్ లుక్స్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. అంతగా ప్రతి గెటప్పులోనూ వైవిధ్యం ప్రదర్శించారు. ఈ సినిమాతో పాటు పొన్నియిన్ సెల్వన్ చిత్రంలోనూ ఆయన నటిస్తున్నారు. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబరు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ చేసింది. మృణాళిని రవి, కేఎస్ రవికూమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. 7 స్టూడియోస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఆగస్టు 25న ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు మేకర్స్. ఇదే విధంగా ఆగస్టు 31న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్