Family Star Trailer: చులకనగా మాట్లాడాలంటే భయపడాలి - విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ వచ్చేసింది
Family Star Trailer: విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ గురువారం రిలీజైంది. ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ రొమాన్స్ అంశాలతో ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా సాగింది. సోషల్ మీడియాలో ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ ట్రెండ్ అవుతోంది.
Family Star Trailer: గీతా గోవిందం బ్లాక్‌బస్టర్ తర్వాత హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మూవీ ఫ్యామిలీ స్టార్. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఏప్రిల్ 5న వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ రిలీజ్ అవుతోంది.
ట్రైలర్ రిలీజ్...
ఫ్యామిలీ స్టార్ ట్రైలర్‌ను బుధవారం రిలీజైంది. ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ అంశాలతో ఈ ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. స్వామి...కొత్తగా నాకు లైఫ్‌లో బ్రేక్‌లు ఇవ్వాల్సిన పనిలేదు. ఉన్నదానిని మాత్రం చెడగొట్టకు అనే విజయ్ దేవరకొండ డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ట్రైలర్‌లో ట్రెండీ లుక్‌లో మృణాల్ ఎంట్రీ ఇచ్చింది. ఈ రోజు నుంచి ఫ్రెండ్‌షిప్‌లు, తిరగడాలు బంద్. ఆ పిల్ల ఇంటికి రావడానికి వీలులేదు. మీరు పైకి వెళ్లడానికి వీలు లేదు అంటూ విజయ్ దేవరకొండ ఫ్యామిలీ మెంబర్స్‌తో ఒట్టు వేయించుకోవడం నవ్విస్తోంది.
మీకు ఫుల్లుగా పడిపోయా...
నేనైతే మీకు ఫుల్లుగా పడిపోయాంటూ మృణాల్ ఠాకూర్ విజయ్ దేవరకొండతో చెప్పే రొమాంటిక్ డైలాగ్ ఆకట్టుకుంటోంది. బుర్ర బద్దలైపోతుద్ది కొడకా...భయపడాలిరా ఇంకోసారి ఎవరైన చులకనగా మాట్లాడాలంటే అంటూ విజయ్ విలన్స్‌కు వార్నింగ్ ఇచ్చే సీన్స్ ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచాయి. కోపం ఎగిరిపోతుందటే నన్ను కొట్టవే బాబు అంటూ ట్రైలర్ చివరలో విజయ్ దేవరకొండ అనగానే మృణాల్ అతడి చెంపపై గట్టిగా ఒక్కటి కొట్టడం ఆకట్టుకుంటోంది.
మిడిల్ క్లాస్ కుర్రాడిగా స్టైలిష్‌గా కనిపిస్తూనే తన కామెడీతో ఫ్యాన్స్‌ను నవ్వించాడు విజయ్ దేవరకొండ. విజయ్, మృణాల్ ఠాకూర్ కెమిస్ట్రీ ఈ ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచింది. రిలీజైన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ ట్రెండింగ్‌గా మారింది. పరశురామ్ గత సినిమాలకు భిన్నంగా ట్రెండీగా ఈ మూవీ కనిపిస్తోంది.
మిడిల్ క్లాస్ యువకుడిగా...
మిడిల్ క్లాస్ యువకుడి కథతో దర్శకుడు పరశురామ్ ఫ్యామిలీ మ్యాన్ సినిమాను తెరకెక్కించినట్లుగా ట్రైలర్ చూస్తే కనిపిస్తోంది. త ఫ్యామిలీ కోసం అతడు ఏం చేశాడు అన్నది హార్ట్ టచింగ్ ఎమోషన్స్‌తో కామెడీ, లవ్‌స్టోరీ కలగలిపి ఈ సినిమాలో దర్శకుడు చూపించబోతున్నట్లు సమచారం. ఫ్యామిలీ స్టార్ మూవీ కోసం భారీ ఖర్చుతో హైదరాబాద్‌లో మిడిల్ క్లాస్ కాలనీ సెట్ వేసినట్లు సమాచారం.
మూడు భాషల్లో రిలీజ్...
ఫ్యామిలీ స్టార్ మూవీకి గోపీ సుందర్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. తొలుత ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని దిల్‌రాజు భావించారు. కానీ సంక్రాంతి పోటీ ఎక్కువగా ఉండటం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో ఏప్రిల్ ఐదుకు ఈ మూవీ వాయిదాపడింది. ఏప్రిల్ 5న విడుదల కావాల్సిన దేవర వాయిదాపడటంతో ఆ రోజున ఫ్యామిలీ స్టార్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాలోని మూడు పాటలను ఇటీవల రిలీజ్ చేశారు.