RRR | ఆర్ఆర్ఆర్ పేరు చెప్పి ఆంధ్రలో దండుకుంటున్నారు.. ఆకాశంలో టికెట్ రేట్లు..!-ticket rates is all time high in vijayawada the name rrr ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rrr | ఆర్ఆర్ఆర్ పేరు చెప్పి ఆంధ్రలో దండుకుంటున్నారు.. ఆకాశంలో టికెట్ రేట్లు..!

RRR | ఆర్ఆర్ఆర్ పేరు చెప్పి ఆంధ్రలో దండుకుంటున్నారు.. ఆకాశంలో టికెట్ రేట్లు..!

Maragani Govardhan HT Telugu
Mar 26, 2022 04:05 PM IST

ఏపీలో టికెట్ల రేట్లు మోత మోగుతున్నాయి. మొన్నటివరకు టికెట్ల రేట్లు పెంచాలని చిత్రసీమ డిమాండ్ చేస్తే.. ఇటీవలే అదనపు షోలు, కొంతమొత్తం మేర టికెట్ ధరలను పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది. అయితే బ్లాక్ మార్కెట్‌లో మాత్రం అసలు రేటు కంటే డబుల్, ట్రిపుల్ రేట్లకు టికెట్లను విక్రయిస్తున్నారు.

<p>ఆర్ఆర్ఆర్&nbsp;</p>
ఆర్ఆర్ఆర్ (Twitter)

ఆర్ఆర్ఆర్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. ఇద్దరు సూపర్ స్టార్లు తారక్, రామ్‌చరణ్ కలిసి నటించిన సినిమా కావడం.. బాహుబలి లాంటి సూపర్ హిట్ అందించిన రాజమౌళి దర్శకత్వం వహించడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. దీంతో ఈ సినిమా టికెట్ల కోసం అభిమానులు పోటీ పడుతున్నారు. వీరి ఆశను ఆసరాగా తీసుకుంటున్నారు కొంతమంది థియేటర్ యజమానులు. టికెట్లను నిర్ణయించిన రేట్ల కంటే రెండు, మూడు రెట్టింపు ధరకు విక్రయిస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ టికెట్ల లూటీ అధికంగా ఉంది.

ఇప్పటికే బెనిఫిట్ షోలు, ప్రత్యేక ప్రీమియం షోలతో అధిక ధరకు టికెట్లను విక్రయించి డబ్బులు సంపాదించారు థియేటర్ యజమానులు. ఏపీకి చెందిన ఓ డిస్ట్రిబ్యూటర్ అన్ని టికెట్లను థియేటర్ల నుంచి కొనుగోలు చేసి తన కార్యాలయం నుంచి బ్లాక్ మార్కెట్‌లో డబుల్, ట్రిపుల్ రేట్లకు విక్రయించినట్లు సమాచారం. ఒక డిస్ట్రిబ్యూటరే ఈ విధంగా బ్లాక్‌లో టికెట్లను విక్రయించడంపై ఎగ్జిబ్యూటర్లు సైతం దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

విజయవాడలో ఓ మాల్‌లో ఫుడ్ ప్యాకెట్‌తో కలిపి రూ.800ల ఫ్లాట్ రేట్‌కు తప్పనిసరిగా కొనుగోలు చేయాలనే నిబంధన పెడుతున్నారని వినియోగదారులు చెబుతున్నారు. అసలు సినిమా టికెట్ ధర అన్ని పన్నులతో కలుపుకుని రూ.234లు ఉంటే.. ఫుడ్ ప్యాకెట్‌తో కలుపుకుని రూ.800 వసూలు చేస్తున్నారని వాపోతున్నారు. ఫుడ్ ప్యాకెట్ అంటే ఇందులో ఏవో ఐటెమ్స్ ఉన్నాయనుకుంటే మీరు పొరబడినట్లే.. ఓ కూల్ డ్రింక్, ఓ పాప్ కార్న్ డబ్బా మాత్రమే ఉంటుంది. ఇందుకు అదనంగా రూ.564లు వసూలు చేస్తున్నారు.

స్థానిక రాజకీయ నాయకులు సైతం టికెట్లను పెద్ద మొత్తంలో బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో అధికార పార్టీ నేతల హస్తం కూడా ఉండటంతో అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. సినిమా టికెట్ల ధరలను తగ్గించి సామాన్యుల జేబుకు చిల్లు పడకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆలోచన వీరి చర్యల ద్వారా గాల్లో కలిసిపోయింది.

 

Whats_app_banner

సంబంధిత కథనం