The Kashmir Files Controversy: నిజం ప్రమాదకరం.. అబద్ధం చెప్పిస్తుంది.. కశ్మీర్ ఫైల్స్ దర్శకుడి కౌంటర్
The Kashmir Files Controversy: ఇఫీ జ్యూరీ హెడ్ నడవ్ లాపిడ్.. ది కశ్మీర్ ఫైల్స్ చిత్రంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆయన కామెంట్లపై చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి సహా నిర్మాత, అందులో నటించిన అనుపమ్ ఖేర్ స్పందించారు.
The Kashmir Files Controversy: అంతర్జాతీయ చలనచిత్ర వేడుకల్లో(IFFI) ది కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని ప్రదర్శించడంపై జ్యూరీ అధినేత, ఇజ్రాయెల్ దర్శకుడు నడవ్ లాపిడ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రెగింది. ఈ సినిమా అసభ్యకర చిత్రమంటూ అతడు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయన పోస్టుపై సోషల్ మీడియా వేదికగా మిశ్రమ స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇఫీ జ్యూరీ హెడ్ వ్యాఖ్యలను కశ్మీరీ ఫైల్స్ చిత్రబృందం సహా నెటిజన్లు, అభిమానులు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు.
అసలేం జరిగిందంటే..
గోవాలో జరిగిన అంతర్జాతీయ భారతీయ చలనచిత్రోత్సవం(ఇఫి)లో ది కశ్మీరి ఫైల్స్ చిత్రాన్ని ప్రదర్శించారు. దీనిపై ఇఫీ జ్యూహీ అధినేత నడవ్ లాపిడ్ ముగింపు వేడుకల్లో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఈ సినిమా చూసి దిగ్భ్రాంతి చెందా. ఇది ప్రచారం కోసం తీసిన అసభ్యకర చిత్రం. ఇలాంటి సిని మహోత్సవంలో ఇది ప్రదర్శించేందుకు ఈ సినిమా తగదు. కళలకు, జీవితానికి, అవసరమైన విమర్శనాత్మక చర్చకు ఈ ఫెస్టివల్ ఎప్పటికీ స్వాగతీస్తుంది. అందుకే నేను నా అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెబుతున్నా.” అని తెలిపారు.
నిజం చాలా ప్రమాదకరమైంది: కశ్మీరి ఫైల్స్ దర్శకుడు..
అయితే లాపిడ్ వ్యాఖ్యలపై నెట్టింట విభిన్నమైన స్పందనలను వినిపిస్తున్నాయి. కశ్మీరీ పండిట్ల బాధల పట్ల ఆయనకు ఎలాంటి విచారం లేదంటూ కొంతమంది విమర్శించారు. ఆయన వ్యాఖ్యలపై ఈ సినిమాలో నటించిన అనుపమ్ ఖేర్ కూడా స్పందించారు. “యూదులపై దారుణమైన మారణహోమం లాంటి బాధలను అనుభవించిన వర్గానికి చెందిన ఓ వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా సిగ్గుచేటు. అప్పుడు యూధులపై నరమేధం నిజమే అయితే.. కశ్మరీ పండిట్ల ఊచకోత కూడా నిజమే. భగవంతుడు ఆయనకు తెలివి ఇవ్వాలని కోరుకుంటున్నా.” అని విమర్శించారు. ఈ చిత్రం దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కూడా ట్విటర్‌లో తన స్పందనను తెలియజేశారు. "గుడ్ మార్నింగ్ నిజం చాలా ప్రమాదకరమైంది.. ఇది ప్రజలతో అబ్బద్దం చెప్పించగలదు" అంటూ ట్వీట్ చేశారు.
లాపిడ్ వ్యాఖ్యలపై చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ కూడా స్పందించారు. “మీ ధ్రువీకరణ మాకు అవసరం లేదు నడవ్ లాపిడ్. ఈ మారణహోమంలో బాధితులు మా వద్ద వేలాది మంది ఉన్నారు. వారి బాధలను, కష్టాలను వ్యక్తిగతంగా చూశాను. చాలా మందిని కలిశాను.” అని ట్వీట్ చేశారు.
జ్యూరీ బోర్డు ప్రకటన..
ఈ వివాదంతో ఇఫీ జ్యూరీ బోర్డు మంగళవారం నాడు ఓ ప్రకటన విడుదల చేసింది. కశ్మీరి ఫైల్స్ చిత్రంపై లాపిడ్ చేసిన వ్యాఖ్యలు.. పూర్తిగా ఆయన వ్యక్తిగత అభిప్రాయమేనని, దీనికి జ్యూరీ బోర్డుకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. “జ్యూరీ సభ్యులుగా.. ఓ సినిమా సాంకేతికత, నాణ్యత, సామాజిక-సాంస్కృతిక ఔచిత్యాన్ని మాత్రమే మేము అంచనా వేస్తాం. అంతేకానీ సినిమాలపై ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలను చేయము. ఒకవేళ జ్యూరీ సభ్యులెవరైనా అలా చేస్తే.. అది పూర్తి వారి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.” అని పేర్కొంది.
బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ది కశ్మీర్ ఫైల్స్ చిత్రం మార్చిలో విడుదలైంది. అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఇఫీలో ఇండియన్ పనోరమ సెక్షన్‌లో భాగంగా నవంబరు 22న ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించారు.
సంబంధిత కథనం