Telugu Web Series: తెలుగులో మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. ఎక్కడ చూడాలంటే?-telugu web series agnisakshi to stream from 12th july on disney plus hotstar ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Web Series: తెలుగులో మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. ఎక్కడ చూడాలంటే?

Telugu Web Series: తెలుగులో మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. ఎక్కడ చూడాలంటే?

Hari Prasad S HT Telugu
Jun 27, 2024 06:24 PM IST

Telugu Web Series: తెలుగులో ఓ మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్ రాబోతోంది. అగ్నిసాక్షి పేరుతో కొన్నాళ్ల కిందట హాట్‌స్టార్ ఈ సిరీస్ అనౌన్స్ చేయగా.. ఇప్పుడు స్ట్రీమింగ్ డేట్ కూడా చెప్పింది.

తెలుగులో మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. ఎక్కడ చూడాలంటే?
తెలుగులో మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. ఎక్కడ చూడాలంటే?

Telugu Web Series: ఓటీటీల్లో తెలుగు కంటెంట్ క్రమంగా పెరిగిపోతోంది. కొత్త కొత్త షోలు, వెబ్ సిరీస్, సినిమాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా మరో వెబ్ సిరీస్ రాబోతోంది. అయితే తొలిసారి తెలుగులో ఓ లాంగ్ ఫార్మాట్ షో ఇదే కావడం విశేషం. ఈ సిరీస్ పేరు అగ్నిసాక్షి. ఇప్పటికే సీరియల్స్ లో కలిసి నటించిన అంబటి అర్జున్, ఐశ్వర్య లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.

అగ్నిసాక్షి వెబ్ సిరీస్

నిజానికి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కొన్ని రోజుల కిందట ఈ అగ్నిసాక్షి వెబ్ సిరీస్ అనౌన్స్ చేసింది. ఈ థ్రిల్లర్ సిరీస్ పేరు రివీల్ చేసినా.. ఇందులోని పాత్రలను సీక్రెట్ గా ఉంచారు. తర్వాత కొన్ని రోజులకు అంబటి అర్జున్, ఐశ్వర్య జంటగా నటిస్తున్నట్లు హాట్‌స్టార్ వెల్లడించింది. ఇక తాజాగా ఈ అగ్నిసాక్షి వెబ్ సిరీస్ జులై 12 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది.

ఈ సిరీస్ లాంగ్ ఫార్మాట్ షోగా రానుంది. అంటే ఎన్నో ఎపిసోడ్లపాటు ఇది సాగనుంది. ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీలైన్ తోపాటు అదిరిపోయే పర్ఫార్మెన్స్ లతో ఈ సిరీస్ ఆకట్టుకుంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సందర్భంగా అర్జున్, ఐశ్వర్య కలిసి ఉన్న పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.

అగ్నిసాక్షి స్టోరీ ఇదీ..

అగ్నిసాక్షి సిరీస్ శంకర్ అనే ఓ పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతుంది. ఈ పాత్రలో అర్జున్ నటిస్తున్నాడు. తన కుటుంబంలో ఒకరిని కోల్పోయి విషాదంలో ఉన్న అతనికి గౌరి (ఐశ్యర్య) కలుస్తుంది. ఆ తర్వాత అతని జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది.

డెడికేటెడ్ పోలీస్ ఆఫీసర్ శంకర్ గా అర్జున్ అంబడి, జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయిన యువతి గౌరి పాత్రలో ఐశ్వర్య కనిపించనున్నారు. ఒక మిస్టీరియస్ మర్డర్ కేసు ఈ జంట జీవితాన్ని మలుపుతిప్పుతుంది. సస్పెన్స్, ఎమోషన్, ట్విస్టులతో అగ్నిసాక్షి ఆద్యంతం ఆసక్తికరంగా సాగనుంది. అగ్నిసాక్షికి అన్ని వర్గాల ప్రేక్షకుల మంచి రెస్పాన్స్ వస్తుందని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఆశిస్తోంది.

ఇప్పటికే అర్జున్, ఐశ్యర్య పలు టీవీ షోలలో కలిసి నటించారు. తెలుగు రాష్ట్రాల్లో వీళ్లది పాపులర్ జోడీనే. దీంతో ఈ ఇద్దరితో వెబ్ సిరీస్ తీసి హాట్‌స్టార్ ఆసక్తి రేపుతోంది. ఈ షో డైరెక్టర్, ఇతర సాంకేతిక సిబ్బంది గురించి మేకర్స్ ఇంకా వెల్లడించలేదు.

ఈ మధ్యే హాట్‌స్టార్ లో యక్షిణి అనే మరో హారర్ వెబ్ సిరీస్ కూడా వచ్చిన విషయం తెలిసిందే. అందులో లక్ష్మి మంచు కూడా నటించింది. ఈ సిరీస్ కు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయితే ఈ ఓటీటీలో మాత్రం సిరీస్ మంచి వ్యూస్ తో దూసుకెళ్తూనే ఉంది. ఇందులో వేదిక, రాహుల్ విజయ్, అజయ్ లాంటి వాళ్లు కూడా నటించారు. ఇక ఇప్పుడు అగ్నిసాక్షితో మరో తెలుగు వెబ్ సిరీస్ కూడా రాబోతోంది. మరి ఈ కొత్త వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

WhatsApp channel