Lakshmi Manchu: మా నాన్న, ఫ్యామిలీ వల్ల ఇబ్బందులు పడ్డా.. మా తమ్ముళ్లకో రూల్.. నాకో రూల్: మంచు లక్ష్మి సంచలన కామెంట్స్-lakshmi manchu says she is the victim of patriarchy men down south do not want their daughters to act ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Lakshmi Manchu: మా నాన్న, ఫ్యామిలీ వల్ల ఇబ్బందులు పడ్డా.. మా తమ్ముళ్లకో రూల్.. నాకో రూల్: మంచు లక్ష్మి సంచలన కామెంట్స్

Lakshmi Manchu: మా నాన్న, ఫ్యామిలీ వల్ల ఇబ్బందులు పడ్డా.. మా తమ్ముళ్లకో రూల్.. నాకో రూల్: మంచు లక్ష్మి సంచలన కామెంట్స్

Hari Prasad S HT Telugu
Jun 20, 2024 07:20 PM IST

Lakshmi Manchu: మంచు లక్ష్మి సంచలన కామెంట్స్ చేసింది. తన నాన్న మోహన్ బాబు, కుటుంబం వల్ల ఇబ్బందులు పడ్డానని, తన తమ్ముళ్లకు సులువుగా దక్కింది తనకు దక్కలేదని ఆమె అనడం గమనార్హం.

మా నాన్న, ఫ్యామిలీ వల్ల ఇబ్బందులు పడ్డా.. మా తమ్ముళ్లకో రూల్.. నాకో రూల్: మంచు లక్ష్మి సంచలన కామెంట్స్
మా నాన్న, ఫ్యామిలీ వల్ల ఇబ్బందులు పడ్డా.. మా తమ్ముళ్లకో రూల్.. నాకో రూల్: మంచు లక్ష్మి సంచలన కామెంట్స్

Lakshmi Manchu: మంచు లక్ష్మి.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. సీనియర్ నటుడు మోహన్ బాబు కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి. అయితే ఇప్పుడామె హైదరాబాద్ వదలి ముంబైలో ఉంటున్న విషయం తెలిసిందే. దీనికి కారణం ఏంటి? తన కుటుంబం వల్ల తాను పడిన ఇబ్బందుల గురించి ఫ్రీ ప్రెస్ జర్నల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడింది.

yearly horoscope entry point

ముంబైకి రాకుండా అడ్డుపడ్డారు

తాను హైదరాబాద్ వదిలి ముంబై రావడానికి తన కుటుంబం ఓ అడ్డంకిలా మారిందని మంచు లక్ష్మి ఈ ఇంటర్వ్యూలో తెలిపింది. చాలా రోజుల వరకు తాను ముంబై వెళ్లకుండా వాళ్లు అడ్డుపడినట్లు వెల్లడించింది. "నన్ను ముంబై పంపించాలంటే వాళ్లు సంకోచించారు.

నేను నా బెస్ట్ ఫ్రెండ్ రకుల్ ప్రీత్ ఇంట్లో ఉండేదాన్ని. నన్ను ముంబై రావాల్సిందిగా ఆమెనే పట్టుబట్టింది. రానాతో మాట్లాడినప్పుడు కూడా నేను ఎప్పటికీ హైదరాబాద్ లోనే ఉండిపోకూడదని అతడు కూడా చెప్పాడు" అని లక్ష్మి తెలిపింది.

నేను పితృస్వామ్యానికి బాధితురాలినే..

తన తమ్ముళ్లు (మంచు విష్ణు, మంచు మనోజ్) సులువుగా దక్కించుకున్నదాని కోసం తాను మాత్రం ఫైట్ చేయాల్సి వచ్చిందని కూడా మంచు లక్ష్మి తెలిపింది. దక్షిణాదిలో తమ కూతుళ్లు, అక్కలు, చెల్లెళ్లను సినిమాల్లో నటింపిజేయడానికి ఇష్టపడరని, తనకూ అలాంటి పరిస్థితే ఎదురైందని ఆమె చెప్పడం గమనార్హం. "నేనూ పితృస్వామ్య బాధితురాలినే.

దక్షిణాదిలో జనం హీరోల కూతుళ్లు, అక్కచెల్లెళ్లు నటులుగా మారడాన్ని అంగీకరించరు. మాలాంటి వాళ్లను నటింపజేయడానికి వెనుకడుగు వేస్తారు. ప్రకాశ్ కోవెలమూడి నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. కానీ మా నాన్న (మోహన్ బాబు), అతని నాన్న (రాఘవేంద్ర రావు) అది జరగకుండా చూడటానికి ప్రయత్నించారు" అని లక్ష్మి చెప్పడం గమనార్హం.

లక్ష్మి మంచు కెరీర్ ఇలా..

చాలా రోజుల పాటు అమెరికాలోనే ఉన్న లక్ష్మి మంచు అక్కడి టీవీ షోలలో నటించింది. ఆ తర్వాత ఇండియాకు తిరిగి వచ్చి 2011లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అనగనగా ఓ ధీరుడు మూవీతో అరంగేట్రం చేసింది. ఈ సినిమాకు రాఘవేంద్రరావు తనయుడు ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వం వహించాడు. ౌ

ఆ తర్వాత గుండెల్లో గోదారి, వైఫ్ ఆఫ్ రామ్ లాంటి సినిమాలు చేసింది. ఇక ఈ మధ్యే ఆమె మాన్‌స్టర్ మూవీతో మలయాళం ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఇక తాజాగా యక్షిణి వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈసిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ యక్షిణి ట్రైలర్ లాంచ్ సందర్భంగా కూడా లక్ష్మి ఆసక్తికర కామెంట్స్ చేసింది. నేను ఎవరో అవకాశాలు ఇస్తారని వేచి చూడను. అవకాశాలు క్రియేట్ చేసుకుంటా. అందుకే సిరీస్‌లు, షోస్ అంటూ ఏదో ఒక వర్క్‌లో బిజీగా ఉంటాను. యక్షిణి మిమ్మల్ని ఆకట్టుకుంటుంది అని ఆమె చెప్పింది. ఈ వెబ్ సిరీస్ లో ఆమె జ్వాల అనే పాత్రలో నటించింది. అటు బాలీవుడ్ లోనూ అవకాశాల కోసం చూస్తోంది.

Whats_app_banner