Romantic Comedy OTT: థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ
Romantic Comedy OTT: టాలీవుడ్ రొమాంటిక్ కామెడీ మూవీ అలనాటి రామచంద్రుడు థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. అలనాటి రామచంద్రుడు మూవీలో కృష్ణవంశీ, మోక్ష హీరోహీరోయిన్లుగా నటించారు.
Romantic Comedy OTT: తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ అలనాటి రామచంద్రుడు థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఎలాంటి ముందుస్తు అనౌన్స్‌మెంట్ లేకుండా అలనాటి రామచంద్రుడు మూవీ సెలైంట్‌గా ఓటీటీలోకి వచ్చింది.
కొత్త హీరోహీరోయిన్లు...
అలనాటి రామచంద్రుడు మూవీలో కృష్ణవంశీ, మోక్ష హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ మూవీతోనే వీరిద్దరు టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. బ్రహ్మాజీ, కేశవ్ దీపక్, వెంకటేష్ కాకుమాను కీలక పాత్రల్లో కనిపించారు. ఈ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీలో చిలుకూరి ఆకాశ్ రెడ్డి డైరెక్టర్‌గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.
కామెడీ మిస్...
యూత్‌ఫుల్ లవ్‌స్టోరీకి ఫాదర్ సెంటిమెంట్‌ను జోడించి దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించాడు. అయితే కాన్సెప్ట్‌లో కొత్తదనం లేకపోవడం, కామెడీ ఆశించిన స్థాయిలో పండకపోవడంతో అలనాటి రామచంద్రుడు మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఆగస్ట్ 2న ఈ మూవీ థియేటర్లలో విడుదలైంది.
అలనాటి రామచంద్రుడు మూవీ కథ ఇదే...
భిన్న మనస్తత్వాలు కలిగిన ఓ జంట కథతో ట్రయాంగిల్ లవ్ స్టోరీగా అలనాటి రామచంద్రుడు మూవీ తెరకెక్కింది. సిద్ధు (కృష్ణవంశీ), ధరణి (మోక్ష) ఒకే కాలేజీలో చదువుతుంటారు. సిద్ధు ఇంట్రోవర్ట్. కాలేజీలో ఎవరితో సరిగా కలవడు. ధరణి అందరితో కలివిడిగా ఉంటుంది. ధరణిని ప్రాణంగా ప్రేమిస్తాడు సిద్ధు.
కానీ తన ప్రేమను ఆమెకు చెప్పడానికి భయపడిపోతుంటాడు. ధరణి మాత్రం విక్రమ్‌ను ఇష్టపడుతుంది. కొన్ని పరిస్థితుల కారణంగా ధరణి జీవితం అనుకోని మలుపులు తిరుగుతుంది. విక్రమ్‌కు దూరమవ్వడమే కాకుండా గతాన్ని కూడా మర్చిపోతుంది. అందరికి దూరంగా మనాలి వెళ్లిపోయిన ధరణిని వెతుక్కుంటూ సిద్ధు అక్కడికి వస్తాడు.ఆ తర్వాత ఏమైంది? ధరణికి తన ప్రేమను సిద్ధు ఎలా చెప్పాడు అన్నదే అలనాటి రామచంద్రుడు మూవీ కథ.
కొత్తవాళ్లు ఇండస్ట్రీలోకి ఎంట్రీ...
అలనాటి రామచంద్రుడు మూవీకి శశాంక్ తిరుపతి మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాతో పలువురు నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ సినిమాను హైమావతి, శ్రీధర్ ప్రొడ్యూస్ చేశారు. ఆగస్ట్ 2న పోటీగా పలు చిన్న సినిమాలు రిలీజ్ కావడం అలనాటి రామచంద్రుడుకు మైనస్ అయ్యింది.