Fathers Day Telugu Movies: ఫాదర్ సెంటిమెంట్‌తో తెలుగులో స్టార్ హీరోలు చేసిన బెస్ట్ మూవీస్ ఇవే
తల్లిని మించిన దైవం లేదు...తండ్రిని మించిన గురువు ఉండడని చెబుతుంటారు. ప్రతి ఒక్కరికి తొలి గురువు తండ్రే. తండ్రి భుజాలపై నుంచే ఈ లోకాన్ని దర్శిస్తారు. అలాంటి తండ్రి గొప్పతనాన్ని, త్యాగగుణాన్ని ఆవిష్కరిస్తూ టాలీవుడ్‌లో స్టార్ హీరోలు పలు బ్లాక్‌బస్టర్ మూవీస్ చేశారు.ఆ సినిమాలు ఏవంటే?
(1 / 5)
నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన జెర్సీ నేషనల్ అవార్డులతో పాటు మంచి సినిమాగా ప్రేక్షకుల మన్ననలను అందుకున్నది. కొడుకు కల నెరవేర్చడం కోసం 30 ఏళ్ల తర్వాత క్రికెటర్‌గా రీఎంట్రీ ఇచ్చిన ఓ తండ్రి స్ఫూర్తిదాయక ప్రయాణంతో ఈ మూవీ రూపొందింది.
(2 / 5)
ఎన్టీఆర్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన నాన్నకు ప్రేమతో ఫాదర్, సన్ ఎమోషన్‌తో వచ్చిన బెస్ట్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. తండ్రికి జరిగిన అన్యాయంపై ఓ కొడుకు ఏ విధంగా పగ తీర్చుకున్నాడనే కాన్సెప్ట్‌తో నాన్నకు ప్రేమతో మూవీని తెరకెక్కించారు దర్శకుడు సుకుమార్.
(3 / 5)
సిద్ధార్థ్, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీలో తండ్రీకొడుకుల ప్రేమను కొత్త కోణంలో దర్శకుడు చూపించారు. తండ్రి అతి ప్రేమ, అంక్షల కారణంగా ఓ కొడుకు ఎదుర్కొనే సంఘర్షణను హృద్యంగా దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ ఈ మూవీలో చూపించాడు.
(4 / 5)
అల్లు అర్జున్ హీరోగా నటించిన సన్నాఫ్ సత్యమూర్తి కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని దక్కించుకున్నది. తండ్రి మాటను నిలబెట్టడం కోసం ఓ కొడుకు పడే తపన, సాంగించిన పోరాటం నేపథ్యంలో దర్శకుడు త్రివిక్రమ్ ఈ మూవీని రూపొందించాడు.
ఇతర గ్యాలరీలు