RRR | నాటు నాటు స్టెప్ వేసిన దర్శక ధీరుడు.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జక్కన్న
ఆర్ఆర్ఆర్ విజయాన్ని నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు సోమవారం నాడు సెలబ్రేట్ చేశారు. మొత్తం ఆర్ఆర్ఆర్ యూనిట్‌కు పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో తారక్, రామ్‌చరణ్ రాజమౌళి సహా సినీ ప్రముఖులందరూ పాల్గొన్నారు. ఈ వేడుకలో రాజమౌళి నర్తించారు.
టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం వసూళ్ల సునామీని సృష్టిస్తోంది. విడుదలై 10 రోజు దాటినా కలెక్షన్ల వర్షం మాత్రం ఆగట్లేదు. మార్చి 25న విడుదలైన ఈ చిత్రాన్ని రూ.900 కోట్ల పైచిలుకు వసూళ్లతో దూసుకెళ్తోంది. విడుదలకు ముందు రాజమౌళి, తారక్, రామ్ చరణ్ ముగ్గురు దేశవ్యాప్తంగా ప్రమోషన్లు విరివిగా నిర్వహించారు. ఇందులో భాగంగా దర్శకుడు అనిల్ రావిపూడితో జరిపిన ఇంటర్వ్యూలో రాజమౌళి హీరోలిద్దరికీ ఓ మాట ఇచ్చారు. సినిమా సక్సెస్ అయితే నాటు నాటు స్టెప్పు వేస్తానని స్పష్టం చేశారు. తాజాగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు మన జక్కన్న.
వివరాల్లోకి వెళ్తే..అనిల్ రావిపూడితో ఇంటర్వ్యూలో రాజమౌళి గురించి ఎన్టీఆర్-రామ్ చరణ్ మాట్లాడుతూ నాటు నాటు పాట కోసం జక్కన్న తమను ఎంతో ఇబ్బంది పెట్టారని, ఒక్క స్టెప్పు కోసం 17 టేక్స్ చేయించారని అన్నారు. కానీ తీరా రెండో టేక్‌నే ఓకే చేశారని అన్నారు. ఇప్పుడు నాటు నాటు స్టెప్పు రాజమౌళి కూడా వేయాలని చెప్పారు. అయితే సినిమా రిలీజై సక్సెస్ అయిన తర్వాత వేస్తానని రాజమౌళి అప్పటికీ బయటపడ్డారు. కానీ చిత్రం విడుదలై సంచలం విజయం సొంతం చేసుకోవడంతో తాజాగా ఇచ్చిన మాటను నిలపెట్టుకున్నారు.
ఈ సినిమా విజయాన్ని నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు సోమవారం నాడు సెలబ్రేట్ చేశారు. మొత్తం ఆర్ఆర్ఆర్ యూనిట్‌కు పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో తారక్, రామ్‌చరణ్ రాజమౌళి సహా సినీ ప్రముఖులందరూ పాల్గొన్నారు. ఈ పార్టీలో తారక్‌కు ఆర్ఆర్ఆర్ సక్సెస్ తర్వాత నాటు నాటు స్టెప్ వేస్తానని చెప్పిన రాజమౌళి.. దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి వేదికపై డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ చిత్రం మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో రామ్‌చరణ్ సరసన సీత పాత్రలో ఆలియా భట్, తారక్ సరసన బ్రిటీష్ యాక్ట్రెస్ ఒలివియా మోరిస్ నటించారు. అజయ్ దేవగణ్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయళ భాషల్లో ఈ సినిమా ఒకేసారి విడుదలైంది.
సంబంధిత కథనం
టాపిక్