Sonali Bindre | NTR30 చిత్రంపై సోనాలి క్లారిటీ.. ఏదో థ్రిల్లర్‌లా ఉందని వెల్లడి-sonali bindre clarity on she will act in ntr 30 project ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sonali Bindre | Ntr30 చిత్రంపై సోనాలి క్లారిటీ.. ఏదో థ్రిల్లర్‌లా ఉందని వెల్లడి

Sonali Bindre | NTR30 చిత్రంపై సోనాలి క్లారిటీ.. ఏదో థ్రిల్లర్‌లా ఉందని వెల్లడి

Maragani Govardhan HT Telugu
May 31, 2022 02:16 PM IST

ఎన్టీఆర్30 సినిమాలో తాను నటిస్తున్నానంటూ వస్తున్న వార్తలపై సోనాలి బింద్రే క్లారిటీనిచ్చింది. తనకు ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదని ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె చెప్పుకొచ్చింది.

<p>సోనాలి-ఎన్టీఆర్</p>
సోనాలి-ఎన్టీఆర్ (Hindustan Times)

ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగి నటిన సోనాలి బింద్రే. తెలుగులో టాప్ హీరోలందరితోనూ నటించన ఈ ముద్దుగుమ్మ క్రమేణా సినిమాలకు దూరమైంది. అయితే చాలా రోజుల తర్వాత సోనాలికి తెలుగులో ఓ ఆఫర్ వచ్చిందట. జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ దర్శకత్వంలో రానున్న NTR30 సినిమాలో ఈ భామ కీలక పాత్ర పోషించనుందని వార్తలు వచ్చాయి. సినిమాను మలుపు తిప్పే పాత్రలో ఆమె నటిస్తారని ప్రచారం సాగింది. తాజాగా ఈ విషయంపై సదరు హీరోయిన్ స్పందించింది.

ఎన్టీఆర్ 30లో మీరు నటిస్తున్నార కదా.. అనే ప్రశ్నకు.. "నేనా.. నిజంగా నాకు తెలియదు. దయచేసి మీరే దాని గురించి చెప్పండి. మీరు అడిగేదాని గురించి కొంచెం కూడా నా వద్ద సమాచారం లేదు. బహుశా అది నేను కాదేమో. అవన్నీ అసత్య వార్తలు. ఒకవేళ అదే నిజమైతే ఇప్పటివరకూ ఎవరూ నన్ను సంప్రదించలేదు. ఇదంతా ఏదో థ్రిల్లర్‌లా ఉంది." అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది సోనాలి.

గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడిప్పుడే ముఖానికి రంగేసుకుంటోంది. ప్రస్తుతం ఆమె హిందీలో ది బ్రోకెన్ న్యూస్ అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తోంది. అది జీ5లో త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది.

మరోవైపు ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ ఇచ్చిన విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఆ ఊపులోనే కొరటాల శివ దర్శకత్వంలో NTR30కి శ్రీకారం చుట్టారు.జూన్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందులో ఎన్టీఆర్ పాత్ర వైవిధ్యంగా ఉంటుందని సమాచారం.ఎన్టీఆర్-కొరటాల చిత్రాన్ని నందమూరి కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ కే నిర్మిస్తున్నారు. దీని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో NTR31 కూడా చేయనున్నారు ఎన్టీఆర్. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది విడుదల కానుంది.

Whats_app_banner

సంబంధిత కథనం