sohel warming trollers: నెగెటివ్ కామెంట్స్ చేస్తే ఇంటికొచ్చి కొడతా - ట్రోల‌ర్స్‌కు సోహెల్ వార్నింగ్‌-sohel reacts on trolls and negative comments in lucky lakshman event ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sohel Warming Trollers: నెగెటివ్ కామెంట్స్ చేస్తే ఇంటికొచ్చి కొడతా - ట్రోల‌ర్స్‌కు సోహెల్ వార్నింగ్‌

sohel warming trollers: నెగెటివ్ కామెంట్స్ చేస్తే ఇంటికొచ్చి కొడతా - ట్రోల‌ర్స్‌కు సోహెల్ వార్నింగ్‌

Nelki Naresh Kumar HT Telugu
Dec 30, 2022 10:31 AM IST

Sohel Warming Trollers: నెగెటివ్ కామెంట్స్ చేసే వారికి బిగ్‌బాస్ సోహెల్ వార్నింగ్ ఇచ్చాడు. ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా త‌న‌తో పాటు ఇండ‌స్ట్రీపై నెగెటివ్ కామెంట్స్ చేస్తే ఇంటికొచ్చి కొడ‌తాన‌ని పేర్కొన్నాడు.

సోహెల్
సోహెల్

Sohel Warming Trollers: త‌న‌తో పాటు టాలీవుడ్ హీరోల‌పై నెగెటివ్ కామెంట్స్ చేసే ట్రోల‌ర్స్‌కు బిగ్‌బాస్ సోహోల్‌ వార్నింగ్ ఇచ్చాడు. సోహెల్ హీరోగా న‌టించిన ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్ సినిమా శుక్ర‌వారం (నేడు) ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల స‌మావేశంలో సినిమా ఇండ‌స్ట్రీలోని హీరోలు, ప్రొడ్యూస‌ర్లు, డైరెక్ట‌ర్ల‌ను తిడితే ఇంటికొచ్చి త‌రిమి కొడ‌తాన‌ని వార్నింగ్ ఇచ్చాడు. త‌న‌ను ఏమ‌న్నా ప‌డ‌తాన‌ని చెప్పాడు.

కానీ త‌ల్లిదండ్రుల‌ను తిడితే మాత్రం ఊరుకోన‌ని అన్నాడు. ఈ సారి పేరెంట్స్‌ను తిడితే దొర‌క‌బ‌ట్టి ఇంటికొచ్చి త‌రిమి కొడ‌తాన‌ని పేర్కొన్నాడు. సినిమా గురించి అనండి...అంతేకానీ హీరో, డైరెక్ట‌ర్లు, ప్రొడ్యూస‌ర్ల‌ను వ్య‌క్తిగ‌తంగా తిడితే మాత్రం వెతికి కొడ‌తాన‌ని వార్నింగ్ ఇచ్చాడు. నెగెటివ్ కామెంట్స్ చేసే వారికే ఈ వార్నింగ్ ఇస్తున్న‌ట్లు తెలిపాడు.

సినిమా క‌ష్టాలు వారికి తెలియ‌వ‌ని చెప్పాడు. కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేసి సినిమా చేస్తే అవేవీ తెలియ‌కుండా ఇష్టానుసారం కామెంట్స్ చేస్తుంటార‌ని చెప్పాడు. అలాంటి కామెంట్స్ పెట్ట‌వ‌ద్ద‌ని రిక్వెస్ట్ చేశాడు. త‌న‌తో పాటు ఏ హీరోను ఉద్దేశించి నెగెటివ్ కామెంట్స్ పెట్ట‌వ‌ద‌ని రిక్వెస్ట్ చేశాడు. అమ్మ‌నాన్న‌ల‌ను బూతు మాట‌ల‌తో తిట్టిన‌ట్లుగా కామెంట్స్ చేస్తుంటార‌ని, చాలా సార్లు అలాంటివి తాను చూశాన‌ని చెప్పాడు.

సినిమా న‌చ్చ‌క‌పోతే చెప్పండి. ఆ కామెంట్స్ యాక్సెప్ట్ చేస్తాన‌ని పేర్కొన్నాడు. త‌న‌తో పాటు ప్ర‌తి ఆర్టిస్ట్ డైరెక్ట‌ర్ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వ‌స్తుందోన‌ని కామెంట్స్ ఆశ‌గా చూస్తుంటార‌ని అలాంటి స‌మ‌యంలో బూతు కామెంట్స్ ఉంటే వాళ్ల ఇంట్లోవాళ్లు, పేరెంట్స్ ఎంతో బాధ‌ప‌డుతుంటార‌ని సోహెల్ అన్నాడు. నెగెటివ్ కామెంట్స్ చేయ‌వ‌ద్ద‌ని రిక్వెస్ట్ చేస్తున్నాన‌ని చెప్పాడు. ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్ సినిమాకు ఏ.ఆర్ అభి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

IPL_Entry_Point

టాపిక్