Toby Trailer: “అది తిరిగొస్తే మృత్యదేవతే”: ఆసక్తికరంగా టోబీ ట్రైలర్: కన్నడ ఇండస్ట్రీ నుంచి మరో సూపర్ హిట్ వస్తోందా?-sandalwood news raj b shetty toby trailer out check details ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Toby Trailer: “అది తిరిగొస్తే మృత్యదేవతే”: ఆసక్తికరంగా టోబీ ట్రైలర్: కన్నడ ఇండస్ట్రీ నుంచి మరో సూపర్ హిట్ వస్తోందా?

Toby Trailer: “అది తిరిగొస్తే మృత్యదేవతే”: ఆసక్తికరంగా టోబీ ట్రైలర్: కన్నడ ఇండస్ట్రీ నుంచి మరో సూపర్ హిట్ వస్తోందా?

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 04, 2023 07:46 PM IST

Toby Trailer: కన్నడ మూవీ ‘టోబీ’ ట్రైలర్ రిలీజ్ అయింది. చాలా ఇంటెన్స్, ఇంట్రెస్టింగ్‍గా ట్రైలర్ ఉంది.

టోబీ ట్రైలర్
టోబీ ట్రైలర్

Toby Trailer: వైవిధ్య నటుడు, ఫిల్మ్ మేకర్ రాజ్ బీ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘టోబీ’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. కన్నడ మూవీ ఇండస్ట్రీనే కాకుండా ఇతర సినీ ఇండస్ట్రీలు కూడా ఈ సినిమా పట్ల ఆసక్తిగా ఉన్నాయి. ‘గరుడ గమన, వృషభ వాహన’ సినిమాతో నట విశ్వరూపంతో పాటు దర్శకత్వ ప్రతిభను చాటుకున్నాడు రాజ్ బీ శెట్టి. ‘టోబీ’కి రాజ్ కథను అందించగా.. బాసిల్ అల్చలాకల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ‘టోబీ’లోనూ రాజ్ బి శెట్టి పాత్ర వైవిధ్యంగా ఉంది. ఫస్ట్ లుక్‍తోనే ఈ మూవీకి మంచి క్రేజ్ వచ్చింది. ఈ తరుణంలో నేడు (ఆగస్టు 4) టోబీ సినిమా ట్రైలర్ విడుదలైంది.

టోబీ కన్నడ ట్రైలర్ రిలీజ్ అయింది. “బలివ్వాల్సిన గొర్రె పారిపోయింది. ఎట్టిపరిస్థితుల్లో అది మళ్లీ గ్రామంలో అడుగుపెట్టకూడదు. ఒకవేళ ఆ గెర్రె తిరిగి వస్తే.. ఇక అది గొర్రెగా ఉండదు. మృత్యదేవతగా మారుతుంది” (కన్నడలో) అని ఓ పూజరి చెప్పే డైలాగ్‍తో టోబీ ట్రైలర్ మొదలవుతుంది. అయితే, ఈ చిత్రంలో టోబీ (రాజ్ బీ శెట్టి) క్యారెక్టర్‌ కూడా ఇదే విధంగా ఉంటుందన్నట్టు ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. మొదట్లో అమాయకంగా ఉండే రాజ్ బీ శెట్టి ఆ తర్వాత పూర్తి హింసాత్మకంగా మారతాడు. ట్రైలర్ మొదట్లో కాసేపు ప్రేమ కథ, పెళ్లి అంటూ కుటుంబ కథా చిత్రంగా అనిపిస్తుంది. ఆ తర్వాత రాజ్ బీ శెట్టి అరెస్ట్ అవడం కీలక మలుపుగా కనిపిస్తోంది. అతడు చనిపోయాడని అందరూ అనుకుంటారు. అయితే, ఆ తర్వాత గ్రామానికి అతడు తిరిగి వచ్చి.. తనకు కీడు చేసిన వారిని వేటాడుతాడనేలా కనిపిస్తోంది. ట్రైలర్‌ మొదట్లో చెప్పే గొర్రె డైలాగ్స్.. రాజ్ బీ శెట్టి క్యారెక్టర్‌ గురించి వివరించినట్టుగా ఉంది. మొత్తంగా రాజ్ బీ శెట్టి మరోసారి యాక్టింగ్‍తో అదరగొట్టాడు. టోబీ ట్రైలర్ ఇంట్రెస్టింగ్‍గా, ఇంటెన్స్‌గా ఉంది.

గతేడాది కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ‘కాంతారా’ చిత్రం సంచలనం సృష్టించింది. కన్నడ తర్వాత తెలుగు, హిందీ సహా ఇతర భాషల్లో డబ్బింగ్ అయి భారీ విజయాన్ని సాధించింది. కలెక్షన్ల వర్షం కురిపించింది. మరి ‘టోబీ’ కూడా కన్నడ ఇండస్ట్రీ నుంచి మరో బంపర్ హిట్ అవుతుందంటూ ఈ ట్రైలర్ చూసిన సినీ జనాలు కామెంట్లు చేస్తున్నారు.

కన్నడలో టోబీ చిత్రం ఆగస్టు 25వ తేదీన విడుదల కానుంది. ఒకవేళ మంచి రెస్పాన్స్ వస్తే ఇతర భాషల్లో డబ్బింగ్ అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

టోబీ చిత్రంలో చైత్ర జే అచార్, సంయుక్త హొరనడు, గోపాలకృష్ణ దేశ్‍పాండే, రాజ్ దీపక్ శెట్టి కీలక పాత్రల్లో నటించారు. మిధున్ ముకుందన్ సంగీతం అందించాడు.

IPL_Entry_Point