Samantha 13 Years Journey: స‌మంత ఫ‌స్ట్ సినిమా రిలీజై నేటితో ప‌ద‌మూడేళ్లు కంప్లీట్‌ - జ‌ర్నీపై సామ్ ఎమోష‌న‌ల్ పోస్ట్‌-samantha completes 13 years journey in tollywood emotional post viral ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Samantha 13 Years Journey: స‌మంత ఫ‌స్ట్ సినిమా రిలీజై నేటితో ప‌ద‌మూడేళ్లు కంప్లీట్‌ - జ‌ర్నీపై సామ్ ఎమోష‌న‌ల్ పోస్ట్‌

Samantha 13 Years Journey: స‌మంత ఫ‌స్ట్ సినిమా రిలీజై నేటితో ప‌ద‌మూడేళ్లు కంప్లీట్‌ - జ‌ర్నీపై సామ్ ఎమోష‌న‌ల్ పోస్ట్‌

Nelki Naresh Kumar HT Telugu
Feb 26, 2023 01:19 PM IST

Samantha Emotional Post: స‌మంత టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఆదివారం (నేడు)నాటితో ప‌ద‌మూడేళ్లు పూర్త‌య్యాయి. ఈ ప్ర‌యాణాన్ని గుర్తుచేసుకుంటూ సోష‌ల్ మీడియాలో ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టింది స‌మంత‌

స‌మంత
స‌మంత

Samantha Emotional Post: స‌మంత తొలి సినిమా ఏ మాయ చేశావే రిలీజై ఆదివారం నాటితో ప‌ద‌మూడేళ్లు పూర్త‌య్యాయి. రొమాంటిక్ ల‌వ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమా 2010 ఫిబ్ర‌వ‌రి 26న ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ సినిమాతోనే స‌మంత క‌థానాయిక‌గా సినీ ప‌రిశ్ర‌మ‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి అడుగులోనే త‌న న‌ట‌న‌, అందంతో ప్రేక్ష‌కుల మ‌న‌సుల్ని దోచుకున్న‌ది.

త‌న ప‌ద‌మూడేళ్ల ప్ర‌యాణాన్నిగుర్తుచేసుకుంటూ సోష‌ల్ మీడియాలో ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టింది స‌మంత‌. అభిమానులు చూపించిన ఆద‌ర‌ణ వ‌ల్లే ప‌ద‌మూడేళ్ల ప్ర‌యాణాన్ని స‌క్సెస్‌ఫుల్‌గా పూర్తిచేసుకోగ‌లిగాన‌ని స‌మంత అన్న‌ది. వారి ప్రేమే త‌న‌ను ఎల్ల‌ప్పుడూ ముందుకు న‌డిపిస్తుంద‌ని చెప్పింది. అభిమానుల ప్రోత్సాహం వ‌ల్లే ఈ స్థాయికి చేరుకోగ‌లిగాన‌ని అన్న‌ది. ఇండస్ట్రీలోకి వచ్చి ప‌ద‌మూడేళ్లు పూర్త‌యినా ఇప్పుడే కొత్త‌గా జ‌ర్నీని మొద‌లుపెట్టిన అనుభూతి క‌లుగుతోంద‌ని స‌మంత పేర్కొన్న‌ది.

స‌మంత పెట్టిన ఎమోష‌న‌ల్ పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ప‌ద‌మూడేళ్ల ప్ర‌యాణాన్ని పూర్తిచేసుకున్న స‌మంత‌కు ప‌లువురు శుభాకాంక్ష‌లు అంద‌జేస్తున్నారు.

ఏ మాయ చేశావే సినిమాలో నాగ‌చైత‌న్య హీరోగా న‌టించాడు. కాగా గ‌త ఏడాది య‌శోద సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది స‌మంత‌. ప్ర‌స్తుతం శాకుంత‌లంతో పాటు ఖుషి సినిమాల్లో హీరోయిన్‌గా న‌టిస్తోంది. బాలీవుడ్‌లో సిటాడెల్ అనే యాక్ష‌న్ వెబ్‌సిరీస్ చేస్తోంది స‌మంత‌.

Whats_app_banner