Kushi Movie Shooting Update: ఖుషి సినిమా సెట్స్‌లోకి సమంత రీఎంట్రీ ఎప్పుడంటే
Kushi Movie Shooting Update: విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తోన్న ఖుషి సినిమా షూటింగ్ తిరిగి మొదలు కాబోతున్నది. ఎప్పటి నుంచి షూటింగ్ పునఃప్రారంభంకానుందంటే...
Kushi Movie Shooting Update: మయోసైటిస్ కారణంగా టాలీవుడ్ షూటింగ్‌లకు కొద్ది నెలలుగా బ్రేక్ ఇచ్చిన సమంత త్వరలోనే ఖుషి సినిమా సెట్స్‌లో అడుగుపెట్టబోతున్నది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి 8వ తేదీ నుంచి తిరిగి మొదలుకాబోతున్నట్లు తెలిసింది. హైదరాబాద్‌లోనే తాజా షెడ్యూల్‌ను తెరకెక్కించనున్నట్లు సమాచారం.
ఈ షెడ్యూల్‌లో హీరోహీరోయిన్లు సమంత, విజయ్ దేవరకొండలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు సమాచారం. కశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో స్వచ్ఛమైన ప్రేమకథగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు శివనిర్వాణ దర్శకత్వం వహిస్తోన్నాడు. గత ఏడాది ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను కశ్మీర్‌లో చిత్రీకరించారు.
ఆ తర్వాత సమంత మయోసైటిస్ బారిన పడటంతో షూటింగ్ వాయిదాపడింది. ఇప్పుడిప్పుడే ఈ వ్యాధి నుంచి కోలుకుంటున్న సమంత ప్రస్తుతం బాలీవుడ్ వెబ్‌సిరీస్ షూటింగ్‌తో బిజీగా ఉంది. మార్చి 8 నుంచి ఖుషి షూటింగ్‌ను సమంత మొదలుపెట్టబోతున్నది.
మహానటి తర్వాత విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తోన్న సినిమా ఇది. గతంలో శివనిర్వాణతో మజిలీ సినిమా చేసింది సమంత. ఖుషి సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాకు మలయాళ సినిమా హృదయం ఫేమ్ హీషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తోన్నాడు.