Salman Khan Movies : ఇక వారితో సినిమా చేయెుద్దని డిసైడ్ అయిన సల్మాన్ ఖాన్
Salman Khan Movies : ఒకప్పుడు సల్లూ భాయ్ ఏ స్క్రీప్ట్ పట్టుకున్న బంగారమే. అయితే రాను రాను పరిస్థితులు మారాయి. ఫెయిల్యూర్ సినిమాలు తీశాడు. దీంతో సల్మాన్ ఖాన్ ఓ నిర్ణయానికి వచ్చాడు.
సల్మాన్ ఖాన్(Salman Khan) హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. కిసీ కా భాయ్ కీ జాన్ పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. కానీ అనుకున్నంత స్థాయిలో సినిమా ఆడలేదు. స్క్రిప్ట్ ఎంపికలో సల్మాన్ ఖాన్ పదే పదే తడబడడమే ఫెయిల్యూర్ కి కారణమని చెప్పవచ్చు. దీంతో సల్మాన్ ఖాన్ వరుస పరాజయాలను ఎదుర్కొంటున్నాడు. ఇటీవలి కాలంలో సరైన సక్సెస్ చూడలేదు.
అందుకే కొత్త నిర్ణయానికి వచ్చాడు సల్మాన్. కష్టాల్లో ఉన్న దర్శకుడితో సినిమా చేయకూడదని నిర్ణయించుకున్నాడు. దీంతో పాటు కుటుంబంతో కలిసి సినిమాలు చేయకూడదని డిసైడ్ అయ్యాడు. ఏ కారణం చేతనైనా.. అలా సినిమాలు చేసి ఫ్లాప్స్ తీయెుద్దని గొప్ప విజయం సాధించాలని ఆలోచనల్లో ఉన్నాడు.
సల్మాన్ ఖాన్ 'కిసీ కా భాయ్ కీ జాన్'(kisika bhai kisiki jaan)పై చాలా ఆశలు పెట్టుకుని ఇబ్బందులు పడ్డాడు. ఈ సినిమా చెప్పుకోదగ్గ విజయాన్ని అందుకోలేకపోయింది. ఇంతకు ముందు విడుదలైన సినిమాల పరిస్థితి కూడా ఇదే. స్క్రిప్ట్ ఎంపికలో సల్మాన్ ఖాన్ పదే పదే తడబడడమే ఫెయిల్యూర్ కి కారణం.
సల్మాన్ ఖాన్‌కు పెద్ద మనసు ఉందనేది నిజం. అందుకే చాలా మంది కష్టాల్లో ఉన్న దర్శకులతో కలిసి పనిచేశారు. అయితే ఇది సల్మాన్ ఖాన్‌కు వారి నుంచి ఎలాంటి ప్రయోజనం రాలేదు. వరుస పరాజయాలు చూస్తున్నాడు. దీంతో కొత్త నిర్ణయం తీసుకున్నాడు. స్నేహితులు, ఫ్యామిలీ సినిమాల్లో నటించకూడదని సల్మాన్ ఖాన్ నిర్ణయించుకున్నాడు. మంచి స్క్రిప్ట్‌ని ఎంపిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటి వరకు చేయని పాత్రను సల్మాన్ ఖాన్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. సల్మాన్ ఖాన్ హోమ్ బ్యానర్లో తన సోదరుడితో సినిమా చేయకూడదని కూడా డిసైడ్ అయ్యాడు. ప్రొఫెషనల్ లైఫ్ కు మైలేజ్ కోసం సినిమాలు చేసే ఆలోచనల్లో ఉన్నాడు సల్లూ భాయ్.
సంజయ్ లీలా బన్సాలీ(sanjay leela bhansali)తో సల్మాన్ ఖాన్ సినిమా చేయాల్సి ఉంది. దానికి ఇన్షా అల్లా అని పేరు పెట్టారు. అయితే స్క్రిప్ట్ విషయంలో ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయి. దీంతో సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పుడు మళ్లీ సల్మాన్ ఖాన్ భన్సాలీని సంప్రదించినట్లు సమాచారం. కలిసి ముందుకు వెళ్లే ఆలోచనల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఓ మంచి సూపర్ హిట్.. ఇచ్చి కమ్ బ్యాక్ చేయాలని సల్మాన్ ఖాన్ అనుకుంటున్నాడు.
టాపిక్