Ram Charan Buchi Babu Movie: రామ్ చరణ్, బుచ్చిబాబు మూవీలో ఆ స్టార్ హీరోయిన్-sai pallai in ram charan buchi babu movie says a report ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ram Charan Buchi Babu Movie: రామ్ చరణ్, బుచ్చిబాబు మూవీలో ఆ స్టార్ హీరోయిన్

Ram Charan Buchi Babu Movie: రామ్ చరణ్, బుచ్చిబాబు మూవీలో ఆ స్టార్ హీరోయిన్

Hari Prasad S HT Telugu
Nov 17, 2023 05:34 PM IST

Ram Charan Buchi Babu Movie: రామ్ చరణ్, బుచ్చిబాబు మూవీలో స్టార్ హీరోయిన్ సాయి పల్లవి నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.

రామ్ చరణ్ తో డైరెక్టర్ బుచ్చి బాబు
రామ్ చరణ్ తో డైరెక్టర్ బుచ్చి బాబు

Ram Charan Buchi Babu Movie: రామ్ చరణ్ ఓవైపు గేమ్ ఛేంజర్ మూవీలో బిజీగా ఉంటూనే.. తన తర్వాతి మూవీని ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానాతో చేయనున్నట్లు అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ కెరీర్లో ఇది 16వ సినిమా. అయితే ఈ మూవీలో స్టార్ హీరోయిన్ సాయి పల్లవి నటించబోతున్నట్లు తెలిసింది.

దీనికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ త్వరలోనే రానుంది. రామ్ చరణ్ మూవీలో నటించమని సాయి పల్లవిని అడగటానికి కొన్ని రోజుల కిందట డైరెక్టర్ బుచ్చిబాబు చెన్నై వెళ్లాడు. దానికి ఆమె ఓకే చెప్పినట్లు తెలిసింది. సాయి పల్లవికి ఈ మూవీ స్క్రిప్ట్ బాగా నచ్చినట్లు తెలిసింది. చరణ్ సరసన పల్లవి నటించబోతుందన్న వార్తే అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది.

ఈ క్రేజీ కాంబినేషన్ ఎలా ఉండబోతుందో చూడాలి. నిజానికి ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ గా మొదట జాన్వీ కపూర్ ని అనుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తర్వాత ఆ వార్తలు ఉత్తవే అని తేలింది. ఆర్ఆర్ఆర్ మూవీలోనే చరణ్ సరసన జాన్వీని అనుకున్నా.. చివరికి ఆ ఛాన్స్ ఆలియాకు దక్కింది. ప్రస్తుతం జాన్వీ.. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి దేవర చేస్తోంది. ఇదే ఆమెకు తొలి టాలీవుడ్ సినిమాు.

ఇక చరణ్, బుచ్చిబాబు సినిమా విషయానికి వస్తే.. ఇదో భారీ బడ్జెట్ సినిమా. సుమారు రూ.300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనున్నట్లు సమాచారం. కోస్తా బ్యాక్‌డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో సీనియర్ నటి లయ కూడా నటించనుంది. ఇక ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నట్లు ఆ మధ్య డైరెక్టర్ బుచ్చిబాబే బిగ్ బాస్ తెలుగు షోలో వెల్లడించాడు.

వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా బుచ్చిబాబు తెరకెక్కించిన ఉప్పెన సినిమా మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. ఉత్తమ తెలుగు సినిమాగా నేషనల్ ఫిల్మ్ అవార్డు కూడా అందుకోవడం విశేషం.