RRR OTT Release | ఆర్‌ఆర్‌ఆర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ట్రిపుల్ ఆర్ మూవీ డిజిటల్ ప్రీమియర్ డేట్ ఫిక్సయింది. ఈ మూవీ రెండు వేర్వేరు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోకి రానుంది.
ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టించి.. వెయ్యి కోట్లకుపైగా వసూళ్లు రాబట్టిన ట్రిపుల్ ఆర్ మూవీ మొత్తానికి ఈ నెలలోనే ఓటీటీల్లోకి రాబోతోంది. రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ సినిమా.. ఇతర సాధారణ సినిమాల కంటే కాస్తా ఆలస్యంగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వస్తోంది. మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజైన విషయం తెలిసిందే.
జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటించిన ఈ మూవీ ఇప్పటికీ థియేటర్లలో మోస్తరు కలెక్షన్లతోనే నడుస్తోంది. ఇక ఇప్పుడు జీ5తోపాటు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీల్లోకి రావడానికి సిద్ధమవుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వెర్షన్లు జీ5లో రిలీజ్ కాబోతుండగా.. హిందీ వెర్షన్ మాత్రం నెట్‌ఫ్లిక్స్‌లో రానుంది.
ట్రిపుల్ ఆర్ మూవీని ఈ నెల 20 నుంచి ఓటీటీల్లోకి అందుబాటులోకి తేనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రికార్డు ధరకు ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఆర్ఆర్ఆర్ డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్నాయి. అయితే ఓటీటీల్లోకి వచ్చిన తొలి రెండు వారాల పాటు సబ్‌స్క్రైబర్లు కొంత మొత్తం చెల్లించి సినిమాను చూడాల్సి ఉంటుందని, జూన్ 3 నుంచి మాత్రం అందరికీ అందుబాటులోకి వస్తుందన్న వార్తలు కూడా వస్తున్నాయి. దీనిపై జీ5, నెట్‌ఫ్లిక్స్‌ల నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
సంబంధిత కథనం
టాపిక్