RRR team in Japan: జపాన్‌లో తారక్-చరణ్ ఫ్యామిలీ దోస్తీ.. వీడియో వైరల్-rrr actors ntr and ram charan fun with their family in japan ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rrr Team In Japan: జపాన్‌లో తారక్-చరణ్ ఫ్యామిలీ దోస్తీ.. వీడియో వైరల్

RRR team in Japan: జపాన్‌లో తారక్-చరణ్ ఫ్యామిలీ దోస్తీ.. వీడియో వైరల్

Maragani Govardhan HT Telugu
Oct 21, 2022 10:59 PM IST

RRR team in Japan: ఆర్ఆర్ఆర్ చిత్రం జపాన్‌లో అక్టోబరు 21న విడుదలైంది. ఈ సందర్భంగా అక్కడ ప్రమోషన్ల కోసం రామ్ చరణ్, తారక్.. రాజమౌళితో కలిసి చేరుకున్నారు. ఈ సందర్భంగా సతీసమేతంగా వారు జపాన్ వీధుల్లో సందడి చేశారు.

ఎన్టీఆర్- రామ్ చరణ్
ఎన్టీఆర్- రామ్ చరణ్

RRR team in Japan: టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇరువురు జపాన్‌లో సందడి చేశారు. వీరితో పాటు దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి కూడా అక్కడకు వెళ్లారు. ఆర్ఆర్ఆర్ చిత్రం శుక్రవారం నాడు జపాన్‌లో విడుదలైన సందర్భంగా సతీసమేతంగా ప్రమోషన్ల కోసం అక్కడకు చేరుకున్నారు. అంతేకాకుండా జపాన్ వీధుల్లో భార్యలో కలిసి సందడి చేశారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో నడుస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు.

గులాబీ పువ్వులను పట్టుకొని ఒకరి చేతిలో మరొకరు చేయ్యి వేసుకుని ముందుకు సాగారు. సంబంధిత దృశ్యాలను రామ్ చరణ్.. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని దోస్తి సాంగ్‌కు జత చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అంతేకాకుండా ఈ వీడియోపై నెటిజన్లు కూడా విశేషంగా స్పందిస్తున్నారు.

శుక్రవారం నాడు ఆర్ఆర్ఆర్ జపాన్‌లో విడుదలవడంతో చిత్రబృందం సందడి చేసింది. తమపై చూపించే అభిమానం చూపించే ఎంతోమందిని కలిసి కాసేపు ముచ్చటించారు. అంతేకాకుండా ఫ్యాన్స్‌కు ఆటోగ్రాఫ్ ఇచ్చారు. ఇటీవలే ఆర్ఆర్ఆర్ దర్శకుడు రాజమౌళి అమెరికా టూర్‌లో పాల్గొన్నారు. అక్కడ ప్రేక్షకుల నుంచి వచ్చిన విపరీతమైన ప్రేక్షకాదరణకు ఫిదా అయ్యారు.

ఈ సినిమాలో రామ్‌చరణ్ సరసన సీత పాత్రలో ఆలియా భట్, తారక్ సరసన బ్రిటీష్ యాక్ట్రెస్ ఒలివియా మోరిస్ నటించారు. అజయ్ దేవగణ్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయళ భాషల్లో ఈ సినిమా ఒకేసారి విడుదలైంది. మొత్తంగా రూ.1200 కోట్ల పైచిలుకు కలెక్షన్లు రాబట్టింది.

Whats_app_banner

సంబంధిత కథనం