Richest Producer in India: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత ధనవంతుడు ఇతడే.. ఆ ముగ్గురు టాప్ హీరోల కంటే ఎక్కువే-richest producer in india ronie screwvala richer than shah rukh khan salman khan aamir khan billionaire producer ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Richest Producer In India: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత ధనవంతుడు ఇతడే.. ఆ ముగ్గురు టాప్ హీరోల కంటే ఎక్కువే

Richest Producer in India: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత ధనవంతుడు ఇతడే.. ఆ ముగ్గురు టాప్ హీరోల కంటే ఎక్కువే

Hari Prasad S HT Telugu
Aug 26, 2024 10:49 AM IST

Richest Producer in India: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత ధనవంతుడైన ప్రొడ్యూసర్ ఇతడు. ఇతని సంపద విలువ బాలీవుడ్ టాప్ హీరోలు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ ల మొత్తం సంపద కంటే కూడా ఎక్కువ కావడం విశేషం. అసలు సినిమా ఇండస్ట్రీలో ఏకైక బిలియనీర్ అతడే.

సినిమా ఇండస్ట్రీలో అత్యంత ధనవంతుడు ఇతడే.. ఆ ముగ్గురు టాప్ హీరోల కంటే ఎక్కువే
సినిమా ఇండస్ట్రీలో అత్యంత ధనవంతుడు ఇతడే.. ఆ ముగ్గురు టాప్ హీరోల కంటే ఎక్కువే

Richest Producer in India: ఇండియన్ సినిమాలో బాలీవుడ్ ఎప్పుడూ టాప్ లోనే ఉంటుంది. బడ్జెట్, రెమ్యునరేషన్లు, ఏడాదికి నిర్మించే సినిమాల సంఖ్య.. ఇలా అన్నింట్లోనూ మిగిలిన ఇండస్ట్రీల కంటే ముందే ఉంటుంది. అలాగే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత ధనవంతుడైన వ్యక్తి కూడా ఈ బాలీవుడ్ కు చెందిన వ్యక్తే. అతని సంపద విలువ ఏకంగా రూ.13 వేల కోట్లు. ఇంతకీ అతనెవరో తెలుసా?

రిచెస్ట్ ప్రొడ్యూసర్ ఇతడే..

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఏకైక బిలియనీర్ ఈ బాలీవుడ్ ప్రొడ్యసరే. అతని పేరు రోనీ స్క్రూవాలా. ఇతని మొత్తం సంపద విలువ రూ.13 వేల కోట్లు అంటే నమ్మగలరా?

దేశంలో ఈ ఇతర ప్రొడ్యూసర్, హీరో కూడా అతని దరిదాపుల్లో కూడా లేరు. ఒకప్పుడు టూత్‌బ్రష్ లు అమ్మే వ్యాపారంతో మొదలు పెట్టిన అతడు.. తర్వాత బాలీవుడ్ లోకి వచ్చి వేల కోట్లు సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. అతడు ఎదిగిన విధానం కూడా చాలా ఆసక్తికరమే.

రోనీ స్క్రూవాలా.. ఆ ముగ్గురి కంటే ఎక్కువే

రోనీ స్క్రూవాలా నెట్ వర్త్ రూ.13 వేల కోట్లు అని ఓ రిపోర్టు వెల్లడించింది. బాలీవుడ్ టాప్ హీరో షారుక్ ఖాన్ సందప విలువ రూ.6600 కోట్లు కాగా.. అంతకు రెట్టింపు ఈ ప్రొడ్యూసర్ సొంతం.

అంతేకాదు షారుక్ తోపాటు సల్మాన్ ఖాన్ (రూ.3 వేల కోట్లు), ఆమిర్ ఖాన్ (రూ.1900 కోట్లు) సంపద కలిపినా కూడా రోనీ స్క్రూవాలా కంటే తక్కువే అవుతుంది. ఇక బాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు కరణ్ జోహార్, ఆదిత్య చోప్రా సంపద కూడా చెరో రూ.6 వేల కోట్ల వరకే ఉంటుంది.

రోనీ జర్నీ ఇలా

రోనీ స్క్రూవాలా ఎదిగిన తీరు కూడా ఆశ్చర్యకరమే. అతడు 1970ల్లో ఓ టూత్‌బ్రష్ కంపెనీ మొదలుపెట్టాడు. తర్వాత 80ల్లో కేబుల్ బిజినెస్‌లోకి వచ్చాడు. 1990ల్లో యూటీవీ పేరుతో బాలీవుడ్ నిర్మాణ సంస్థను మొదలుపెట్టాడు. అప్పట్లో అతడు పెట్టిన పెట్టుబడి కేవలం రూ.37 వేలు మాత్రమే. అదే యూటీవీని ఆ తర్వాత డిస్నీకి ఏకంగా బిలియన్ డాలర్లకు అమ్మేశాడు.

తర్వాత ఆర్‌ఎస్‌వీపీ ప్రొడక్షన్ కంపెనీ ప్రారంభించాడు. శాంతి, సీహాక్స్ లాంటి టీవీ షోలను మొదట్లో నిర్మించిన అతడు.. తర్వాత స్వదేశ్, జోధా అక్బర్, ఫ్యాషన్, బర్ఫీ, చెన్నై ఎక్స్‌ప్రెస్, ఉరిలాంటి హిట్ సినిమాలు తీశాడు.

అయితే అతడు సినిమాల కంటే ఎక్కువగా ఇతర వ్యాపారాల ద్వారానే సంపాదించాడు. ఇప్పటికీ సంపాదిస్తున్నాడు. అప్‌గ్రాడ్, అజ్‌స్పోర్ట్స్, అన్‌లియాజెర్ లాంటి కంపెనీల్లో అతని పెట్టుబడులు ఉన్నాయి. బాలీవుడ్ లో సినిమాల నిర్మాణం ద్వారా వచ్చే సంపాదన వీటికి అదనం. కేవలం రూ.37 వేలతో బాలీవుడ్ లోకి వచ్చి ఇప్పుడు రూ.13 వేల కోట్ల సంపదతో దేశంలోనే అత్యంత ధనికవంతుడైన ప్రొడ్యూసర్ గా రోనీ స్క్రూవాలా ఎదిగిన తీరు ఆశ్చర్యకరమే.

Whats_app_banner