Thursday Motivation: తినడం, తాగడం, నిద్రపోవడం… ఇవే పనులు చేస్తే విజయం రాదు, షారుక్ ఖాన్ చెప్పిన విజయ రహస్యాలు ఇవిగో
secrets of success: మీరు విజయం సాధించాలనుకుంటే తినడం, తాగడం, నిద్రపోవడం ఇవే పనులు చేస్తే కుదరదు. ఒక పాత వీడియోలో విజయం కోసం షారుక్ ఖాన్ కొన్ని విజయ రహస్యాలు చెప్పారు.
షారుక్ ఖాన్ కష్టపడి జీరో నుంచి హీరోగా మారిన వ్యక్తి. ఆయన నిజ జీవితంలో కూడా హీరోనే. ఈయనను బాలీవుడ్ కింగ్ ఖాన్ అని పిలుస్తారు. అదే సమయంలో షారుఖ్ కూడా తన చక్కటి వ్యక్తిత్వంతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. విజయం గురించి కింగ్ ఖాన్ గతంలో ఒక పాత ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇప్పుడు ఆ ఇంటర్య్వూ వైరల్ అవుతోంది. ఇందులో ఆయన విజయం సాధించేందుకు తన ఆలోచనలను పంచుకుంటున్నారు. సక్సెస్ రావాలంటే కష్టపడాలని షారుఖ్ ఖాన్ ఆ వీడియోలో వివరించారు. సక్సెస్ పై షారుఖ్ ఖాన్ చెప్పిన సలహాలు ఇవే..
హాయిగా బ్రతుకుతూ, తింటూ, కంఫర్ట్ జోన్ లో జీవితం గడుపుతుంటే సక్సెస్ రాదని షారుఖ్ ఖాన్ చాలా హ్యూమర్ తో చెప్పాడు. విజయం సాధించాలంటే రోజూ తినడం, తాగడం, నిద్రపోవడం వంటి పనులు పనులు చేస్తే సరిపోదని కింగ్ ఖాన్ చెప్పారు. విజయం సాధించాలనే కసి, మనస్తత్వం ఉండాలి. అప్పుడే విజయం వస్తుంది.
విజయం సాధించే మార్గంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఏ సక్సెస్ అయిన సులువుగా రాదు… ఎంతో ఇబ్బందులు, బాధలు పడ్డాకే దక్కుతుంది. కానీ ఆ బాధలు తాత్కాలికమే. విజయం దక్కిన తరువాత ఆ బాధలను మర్చిపోవడం సులువు.
విజయం కోసం ఎన్నో అభిరుచులు, కోరికలను త్యాగం చేయాల్సి రావచ్చు అని వివరిస్తున్నారు షారుక్. తనకు వర్కవుట్లు చేయడం ఇష్టం ఉండదని, కానీ సినిమాలో సక్సెస్ అవ్వడం కోసం ప్రతిరోజూ వర్కవుట్స్ చేస్తానని చెప్పాడు. అందుకే సిక్స్ ప్యాక్ యాబ్స్ ను సాధించానని చెప్పాడు. ఇప్పటికీ వ్యాయామాలు చేస్తానని షారుఖ్ ఖాన్ చెప్పారు. అందువల్ల, మీరు విజయం సాధించాలంటే, కంఫర్ట్ జోన్ నుండి బయటపడి సురక్షితంగా ఉండటం అవసరం. విజయం సాధించాలంటే విశ్రాంతిని వదులుకోవాలి. అప్పుడే విజయం వస్తుంది.
షారుక్ కు బాలీవుడ్ బాద్షా స్థానం అంత సులువుగా దక్కలేదు. ఆమె 1980వ దశకంలో టీవీ సీరియల్స్ లో చిన్న పాత్రలతో తన కెరీర్ మొదలుపెట్టాడు. కొన్నేళ్ల పాటూ సీరియల్స్ లో నటిస్తూ సినిమాల్లో ప్రయత్నించాడు. అలా 1992లో దీవానా సినిమాతో తెరంగేట్రం చేశారు. కెరీర్ మొదట్లో ప్రతినాయక పాత్రలు కూడా చేశాడు. ఆయన కుటుంబం నుంచి గతంలో ఎవరూ సినిమాల్లో లేరు. ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా బాలీవుడ్ లో అడుగుపెట్టి ఎంతో కష్టపడి తిరుగులేని విజయాన్ని సాధించాడు షారుక్. ఇతను తనను హాఫ్ హైదరాబాదీగా చెప్పుకుంటాడు. ఆమె తల్లి హైదరాబాద్ కు చెందిన వ్యక్తి.