Trisha to join politics: రాజకీయాల్లోకి త్రిష.. ఏ పార్టీలో చేరుతోందో తెలుసా
Trisha to join politics: ఒకప్పుడు టాలీవుడ్‌ను ఏలిన త్రిష ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతోంది. ఇప్పుడీ వార్త కోలీవుడ్ సర్కిళ్లలో హాట్ టాపిక్‌గా మారింది.
తెలుగులో సక్సెసైన తమిళ ముద్దుగుమ్మ త్రిష కృష్ణన్. ఎప్పుడో 23 ఏళ్ల కిందట జోడీ మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఆ తర్వాత వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడులాంటి సూపర్ డూపర్ హిట్ టాలీవుడ్ మూవీస్‌లో నటించి టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగింది. తమిళ సినిమాలతో కెరీర్ మొదలుపెట్టి తెలుగులో దుమ్మురేపి మళ్లీ కోలీవుడ్‌కు వెళ్లిపోయింది.
ఇప్పుడీ భామ రాజకీయాల వైపు చూస్తోంది. అది కూడా తమిళ సూపర్ స్టార్ నటుడు విజయ్ దళపతి సూచన మేరకు ఆమె పాలిటిక్స్‌లోకి వస్తుండటం విశేషం. అంతేకాదు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరాలని కూడా నిర్ణయించుకోవడం విశేషం. అతి త్వరలోనే ఆమె పాలిటిక్స్‌లోకి రాబోతున్నట్లు కోలీవుడ్ సీనియర్ జర్నలిస్ట్ ఒకరు వెల్లడించారు.
ఇప్పటికే జయలలిత, ఖుష్బూలాంటి తమిళ నటీమణులు రాజకీయాల్లో మెరిసిన విషయం తెలిసిందే. జయలలిత ఏకంగా ముఖ్యమంత్రిగా కూడా చేసింది. ఆ తర్వాత ఖుష్బూ మొదట కాంగ్రెస్‌లో చేరి తర్వాత బీజేపీలోకి వెళ్లింది. ఇప్పుడు త్రిష రూపంలో ఖుష్బూ వెళ్లిపోయిన లోటును కాంగ్రెస్ పూడ్చుకోవాలని చూస్తోంది. అయితే సిల్వర్ స్క్రీన్‌పై తన గ్లామర్, నటనతో అభిమానులను సంపాదించుకున్న ఆమె.. పాలిటిక్స్‌లో ఎలా రాణిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం త్రిష.. మణిరత్నం డైరెక్షన్‌లో వస్తున్న ప్రతిష్టాత్మక మూవీ పొన్నియిన్ సెల్వన్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ నుంచి ఆమె ఫస్ట్ లుక్ కూడా ఇప్పటికే వచ్చింది. ఈ సినిమా సెప్టెంబర్ 30న రిలీజ్ కానుంది. విక్రమ్, కార్తీ, ఐశ్వర్యరాయ్‌లాంటి నటులతో భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. రెండు పార్ట్‌లుగా వస్తున్న ఈ సినిమా తొలి పార్ట్ పీఎస్1 ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది.