Ravi Teja Eagle Postpone: సంక్రాంతి రేసు నుంచి త‌ప్పుకున్న ఈగ‌ల్‌ - నాగార్జునకు ర‌వితేజ స‌పోర్ట్‌-raviteja eagle movie out of sankranthi race ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ravi Teja Eagle Postpone: సంక్రాంతి రేసు నుంచి త‌ప్పుకున్న ఈగ‌ల్‌ - నాగార్జునకు ర‌వితేజ స‌పోర్ట్‌

Ravi Teja Eagle Postpone: సంక్రాంతి రేసు నుంచి త‌ప్పుకున్న ఈగ‌ల్‌ - నాగార్జునకు ర‌వితేజ స‌పోర్ట్‌

Nelki Naresh Kumar HT Telugu
Jan 04, 2024 11:39 AM IST

Ravi Teja Eagle Postpone: ర‌వితేజ ఈగ‌ల్ మూవీ సంక్రాంతి రేసు నుంచి త‌ప్పుకున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. సంక్రాంతికి నెల‌కొన్న పోటీ దృష్ట్యా మేక‌ర్స్ సినిమాను పోస్ట్‌పోన్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

ర‌వితేజ ఈగ‌ల్ మూవీ
ర‌వితేజ ఈగ‌ల్ మూవీ

Ravi Teja Eagle Postpone: సంక్రాంతి రేసు నుంచి ర‌వితేజ ఈగ‌ల్ మూవీ త‌ప్పుకున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం సంక్రాంతి బ‌రిలో ఐదు సినిమాలు నిల‌వ‌డం, థియేట‌ర్స్ ప‌రంగా ఇబ్బందులు ఎదుర‌వుతుండ‌టంతో పండుగ రేసు నుంచి వెన‌క్కి వెళ్లాల‌ని ఈగ‌ల్ మేక‌ర్స్ డిసైడ్ చేసుకున్న‌ట్లు స‌మాచారం. పోస్ట్‌పోన్‌కు సంబంధించి ఈ రోజు లేదా రేపు అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.

పోటీ మ‌ధ్య రిలీజ్ చేస్తే సినిమాకు న‌ష్టం జ‌రిగే అవ‌కాశం ఉండ‌టంతోనే మేక‌ర్స్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. పోస్ట్‌పోన్ ఆలోచ‌న‌తోనే ఇప్ప‌టివ‌ర‌కు ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ మొద‌లుపెట్ట‌న‌ట్లు తెలుస్తోంది. ఈగ‌ల్ సినిమా పోస్ట్‌పోన్ రూమ‌ర్స్ గ‌తంలో చాలా సార్లు వ‌చ్చాయి. కానీ వాటిని మేక‌ర్స్ ఖండిస్తూ వ‌చ్చారు. ఈ సారి మాత్రం పోస్ట్‌పోన్ కావ‌డం ప‌క్కా అని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. జ‌న‌వ‌రి 26న పెద్ద సినిమాలు పోటీలో లేక‌పోవ‌డంతో అదే రోజు ఈగ‌ల్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

నాగార్జున‌కు సాయం...

సంక్రాంతికి ఈగ‌ల్‌తో పాటు మ‌హేష్‌బాబు గుంటూరు కారం, వెంక‌టేష్ సైంధ‌వ్‌, నాగార్జున నా సామిరంగ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈగ‌ల్‌ను పోస్ట్‌పోన్ చేయ‌డం ప‌క్కా కావ‌డంతో ర‌వితేజ మూవీ కోసం కేటాయించిన థియేట‌ర్ల‌ను నాగార్జున నా సామిరంగ‌కు ఇవ్వ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి నిర్మాత‌ల మ‌ధ్య డిస్క‌ష‌న్ జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం. నాగార్జున నా సామిరంగ మూవీ జ‌న‌వ‌రి 14న రిలీజ్ అవుతోంది.

ఈగ‌ల్ యాక్ష‌న్ ట్రీట్‌...

ఈగ‌ల్ సినిమాకు సినిమాటోగ్రాఫ‌ర్ కార్తిక్ ఘ‌ట్ట‌మ‌నేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. షార్ప్ షూట‌ర్ క‌థాంశంతో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ఇందులో ర‌వితేజ మాస్, క్లాస్ క‌ల‌బోత‌గా సాగే పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్, కావ్య థాప‌ర్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. న‌వ‌దీప్ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు.

దాదాపు యాభై కోట్ల బ‌డ్జెట్‌తో ఈగ‌ల్ మూవీ రూపొందుతోన్న‌ట్లు స‌మాచారం. ఈగ‌ల్ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్థ ప్రొడ్యూస్ చేస్తోంది. ధ‌మాకా త‌ర్వాత ఈ బ్యాన‌ర్‌లో ర‌వితేజ చేస్తోన్న సెకండ్ మూవీ ఇది కావ‌డం గ‌మ‌నార్హం. ఈగ‌ల్ ద‌ర్శ‌కుడిగా కార్తిక్ ఘ‌ట్ట‌మ‌నేనికి సెకండ్ మూవీ. గ‌తంలో నిఖిల్‌తో సూర్య వ‌ర్సెస్ సూర్య అనే సినిమా చేశాడు కార్తిక్ ఘ‌ట్ట‌మ‌నేని. ఆ సినిమా త‌ర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న అత‌డు ఈగ‌ల్‌తో తిరిగి మెగాఫోన్ ప‌ట్టాడు. కార్తికేయ, నిన్నుకోరి, అ! సినిమాల‌కు కార్తిక్ ఘ‌ట్ట‌మ‌నేని సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేశాడు. ర‌వితేజ ధ‌మాకా సినిమాకు కూడా కెమెరామెన్‌గా బాధ్య‌త‌ల్ని నిర్వ‌హించాడు.

మూడు సినిమాలు...

కాగా గ‌త ఏడాది ర‌వితేజ న‌టించిన మూడు సినిమాలు రిలీజ‌య్యాయి. చిరంజీవితో క‌లిసి వాల్తేర్ వీర‌య్య సినిమా చేశాడు ర‌వితేజ‌. సంక్రాంతికి రిలీజైన ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ర‌వితేజ సోలో హీరోగా న‌టించిన రావ‌ణాసుర‌, టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు డిజాస్ట‌ర్స్‌గా నిలిచాయి. ఈ రెండు సినిమాల‌పై రిలీజ్‌కు ముందు భారీగా అంచ‌నాలు ఏర్ప‌డిన క‌థ‌లో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డంతో ప‌రాజ‌యం పాల‌య్యాయి.

Whats_app_banner