Ravi Teja: కొత్త రవితేజను చూస్తారు.. మాస్ మహారాజా కామెంట్స్ వైరల్-ravi teja comments in eagle x dhamaka celebrations ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ravi Teja: కొత్త రవితేజను చూస్తారు.. మాస్ మహారాజా కామెంట్స్ వైరల్

Ravi Teja: కొత్త రవితేజను చూస్తారు.. మాస్ మహారాజా కామెంట్స్ వైరల్

Sanjiv Kumar HT Telugu
Dec 27, 2023 04:34 PM IST

Ravi Teja At Eagle X Dhamaka Celebrations: రవితేజ కెరీర్‌లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా ధమాకా. ఇప్పుడు రవితేజ నటిస్తున్న కొత్త మూవీ ఈగల్. ఈ రెండింటి పేర్లతో తాజాగా ఈగల్ X ధమాకా సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ వేడుకలో రవితేజ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

కొత్త రవితేజను చూస్తారు.. మాస్ మహారాజా కామెంట్స్ వైరల్
కొత్త రవితేజను చూస్తారు.. మాస్ మహారాజా కామెంట్స్ వైరల్

Eagle X Dhamaka Celebrations: మాస్ మహారాజా రవితేజ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ ‘ధమాకా’. శ్రీలీల హీరోయిన్ గా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం ఏడాది పూర్తి చేసుకుంది. మరోవైపు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రవితేజ తాజా చిత్రం ‘ఈగల్‌’ 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే విడుదలైన ఈగల్ మూవీ ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో అంచనాలు భారీ స్థాయిలోకి చేరుకున్నాయి.

ఈ సందర్భంగా ‘ఈగల్‌ x ధమాకా’ సెలబ్రేషన్స్‌‌ని ఇటీవల గ్రాండ్‌గా నిర్వహించారు మేకర్స్. ఈ వేడుకలో ‘ధమాకా’ టీమ్‌కు మెమెంటోలు అందజేశారు. "నిర్మాత విశ్వప్రసాద్ గారికి అభినందనలు. ధమాకా నిన్నో మొన్నో విడుదలైనట్లుంది. ఏడాది అయిందంటే నమ్మబుద్ధి కావట్లేదు" అని ‘ఈగల్‌ x ధమాకా’ సెలబ్రేషన్స్‌లో రవితేజ అన్నాడు.

"సంగీత దర్శకుడు భీమ్స్‌ ఇచ్చిన పాటలకు.. తనకి మంచి గుర్తింపు వస్తుందని సినిమా విడుదలకాక ముందే బలంగా నమ్మాను. అదే నిజమైంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మనకున్న సంగీత దర్శకుల్లో తనుకూడా ఒక బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. మళ్లీ మేం కలిసి పనిచేయబోతున్నాం. శ్రీలీల పెద్ద హీరోయిన్ అవుతుందని చెప్పాను. ఊహించినట్లే శ్రీలీల హీరోయిన్‌గా అద్భుతంగా రాణిస్తోంది. ఆది, మంగ్లీ, మౌనిక టీం అందరికి పేరుపేరునా అభినందనల" అని రవితేజ తెలిపాడు.

"ఇక ‘ఈగల్‌’ సినిమా విషయానికి వస్తే.. కార్తిక్ ని కెమరామ్యాన్ గా చూశాం. ఇప్పుడు దర్శకుడిగా చూడబోతున్నాం. ఈ సినిమాతో కార్తిక్ కి చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని నా బలమైన నమ్మకం. ఒక్కటి మాత్రం చెప్పగలను.. ఇందులో ప్రేక్షకులకు ఒక కొత్త రవితేజను చూపించబోతున్నాడు. అది నాకు చాలా తృప్తిని ఇచ్చింది" అని రవితేజ చెప్పుకొచ్చాడు.

"ఈగల్ సినిమాలో కొత్త కావ్యా థాపర్‌ కనిపిస్తుంది. ఆమె పాత్ర నాకు చాలా నచ్చింది. దేవ్ జాంద్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. తను గొప్ప స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను. అవసరాల శ్రీనివాస్ చాలా సెన్సిబుల్ పర్సన్. విశ్వగారికి ఆల్ ది వెరీ బెస్ట్. మా ప్రయాణం ఇలాగే కొనసాగుతుంది'' అని మాస్ మహారాజ రవితేజ మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Whats_app_banner