Rathnam OTT: విశాల్ యాక్షన్ మూవీ రత్నం ఓటీటీలోకి వచ్చేసింది - తెలుగు స్ట్రీమింగ్ ఎందులో అంటే?
Rathnam OTT: విశాల్ లేటెస్ట్ యాక్షన్ మూవీ రత్నం ఓటీటీలోకి వచ్చేసింది. గురువారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
Rathnam OTT: విశాల్ యాక్షన్ మూవీ రత్నం ఓటీటీలో రిలీజైంది. గురువారం అమెజాన్ ప్రైమ్ ద్వారా ఈ యాక్షన్ మూవీ ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగుతో పాటు తమిళ భాషల్లో రత్నం మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. రత్నం మూవీ థియేటర్లలో విడుదలై నెల రోజులు కూడా కాకముందే ఓటీటీలోకి వచ్చేసింది.
యాక్షన్ సినిమాల ఫేమ్...
యాక్షన్ సినిమాల ఫేమ్ హరి దర్శకత్వంలో రూపొందిన రత్నం మూవీ ఏప్రిల్ 26న థియేటర్లలో విడుదలైంది. రొటీన్ కాన్సెప్ట్ కారణంగా మిక్సడ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. విశాల్ నటనతో పాటు హరి టేకింగ్, యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయనే కామెంట్స్ వచ్చినా కథలో కొత్తదనం లేకపోవడంతో రత్నం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
ప్రియా భవానీ శంకర్ హీరోయిన్...
రత్నం సినిమాలో విశాల్‌కు జోడీగా ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించింది. ఈ యాక్షన్ మూవీకి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించాడు. యోగిబాబు, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. గతంలో విశాల్, హరి కాంబినేషన్‌లో పూజ సినిమా వచ్చింది. వీరిద్దరి కాంబోలో సెకండ్ టైమ్ వచ్చిన రత్నం మూవీపై మాస్ ఆడియెన్స్‌లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.
ఆ అంచనాల్ని అందుకోవడంలో ఈ మూవీ విఫలమైంది. తమిళంలో ఈ మూవీ ఇరవై కోట్ల లోపే కలెక్షన్స్ దక్కించుకున్నది. తెలుగులో నాలుగున్నర కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రత్నం రిలీజైంది. రెండుకోట్లలోపే వసూళ్లను రాబట్టింది. రెండు భాషల్లో నిర్మాతలకు ఈ మూవీ నష్టాలను మిగిల్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి.
రత్నం కథ ఇదే...
ఎమ్మెల్యే పన్నీర్‌స్వామికి (సముద్రఖని) రత్నం (విశాల్ ) నమ్మిన బంటుగా పనిచేస్తుంటాడు. ఎమ్మెల్యే అండతో అవినీతి పరుల పని పడుతుంటాడు. రత్నం జీవితంలోకి అనుకోకుండా మల్లిక (ప్రియా భవానీ శంకర్) అనే అమ్మాయి వస్తుంది.
మల్లికను చంపడానికి లింగం బ్రదర్స్ ప్రయత్నిస్తుంటారు. కరుడుగట్టిన రౌడీలు అయిన లింగం బ్రదర్స్ బారి నుంచి మల్లికను రత్నం ఎలా కాపాడాడు? రత్నం గత జీవితం మొత్తం కష్టాల మయం కావడానికి కారకులు ఎవరు? తన శత్రువులపై రత్నం ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు? మల్లికను చంపాలని ప్రయత్నించింది ఎవరు? అనే పాయింట్‌తో దర్శకుడు హరి రత్నం మూవీని తీర్చిదిద్దాడు.
మార్క్ ఆంటోనీ వంద కోట్లు...
రత్నం కంటే ముందు విశాల్ హీరోగా నటించిన మార్క్ ఆంటోనీ బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. విశాల్ కెరీర్‌లోనే ఆల్‌టైమ్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. రత్నం మాత్రం ఆ విజయ పరంపరను కొనసాగించలేకపోయింది.
మరోవైపు సింగం సిరీస్ సినిమాలతో పాటు ఆరు, సామీ లాంటి యాక్షన్ సినిమాలతో కోలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్స్‌లో ఒకరిగా హరి పేరుతెచ్చుకున్నాడు. కెరీర్ ఆరంభం నుంచి యాక్షన్, కమర్షియల్ జోనర్ సినిమాలకే పరిమితమైన హరికి తమిళంలో గత కొన్నాళ్లుగా సరైన విజయాలు లేవు. రత్నం కూడా అతడికి సక్సెస్‌ను తెచ్చిపెట్టలేకపోయింది.ఈ యాక్షన్ మూవీలో సూర్య నటిస్తాడా? మరో కొత్త హీరోగా హరి మూవీ చేస్తాడా అన్నది కోలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.