Rashmi Gautam: అల్లు అర్జున్ డైలాగ్ తో జబర్ధస్త్ షోలోకి రీఎంట్రీ ఇచ్చిన రష్మి- నన్ను భరించండి అంటూ పోస్ట్
జబర్ధస్త్ షోలోకి అనసూయ స్థానంలో కొత్త యాంకర్‌గా రష్మి రీఎంట్రీ ఇచ్చింది. ఈ రీఎంట్రీ వీడియో యూట్యూబ్‌లో అభిమానులను ఆకట్టుకుంటోంది. జబర్ధస్త్ షోలోకి యాంకర్‌గా పునరాగమనం చేయడంపై రష్మి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
జబర్ధస్త్ షో నుండి యాంకర్ గా అనసూయ తప్పుకున్న సంగతి తెలిసిందే. ఆమె స్థానంలో కొత్త యాంకర్ ఎవరు వస్తారోనని బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ షో కు కొత్త యాంకర్ గా పలువురు బుల్లితెర స్టార్స్ పేర్లు వినిపించాయి. కానీ అందరి అంచనాల్ని తలక్రిందులు చేస్తూ రష్మి పేరును షో యాజమాన్యం ప్రకటించింది.
జబర్ధస్త్ షోలోకి రష్మి ఎంట్రీ ఇచ్చిన ఇంట్రో వీడియా ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారింది. ఈ వీడియోలో కొత్త యాంకర్ ఎవరోనని జబర్ధస్త్ కంటెస్టెంట్స్ అందరూ ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తూ కనిపించారు. చీరకొంగును ముసుగుగా ధరించి రష్మి జబర్ధస్త్ స్టేజ్‌పై అడుగుపెట్టింది. చివరకు ఆ ముసుగును చలాకీ చంటి తొలగించడంతో రష్మి ఎంట్రీ ఇచ్చింది. ఆమెను చూడగానే కంటెస్టెంట్స్ అందరూ డిసప్పాయింట్ అయినట్లుగా కనిపించారు.
కొత్త యాంకర్ వస్తుందని అనుకుంటే మీరు వచ్చారేంటి అని ఆమెను రాకెట్ రాఘవ అడగ్గా నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఈడా ఉంటా అంటూ రష్మి రుద్రమదేవి సినిమాలో బన్నీ డైలాగ్ ను చెప్పడం ఆకట్టుకున్నది. ఇక్కడ నుండి ఎక్స్‌ట్రా జబర్ధస్త్ కు వెళ్లా...అక్కడి నుండి తిరిగి ఇక్కడకు వచ్చా అంటూ సమాధానం చెప్పింది. జబర్ధస్త్ లోకి రీఎంట్రీ ఇవ్వడంపై రష్మి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. ఇందులో జబర్ధస్త్ షోకి తిరిగి హోస్ట్ గా వ్యవహరించడం ఆనందంగా ఉందని తెలిపింది. ‘ఈ షో కోసం నా సామర్థ్యాల మే మేరకు చేయగలిగింది అంతా చేస్తాను. కొత్త యాంకర్ వచ్చే వరకు నన్ను భరించిండి’ ప్లీజ్ అంటూ ట్వీట్ చేసింది.
టాపిక్