Brahmastra Twitter Review: బ్రహ్మాస్త్ర ట్విట్టర్ రివ్యూ - ర‌ణ్‌భీర్, అలియా సినిమాకు టాక్ ఎలా ఉందంటే-ranbir kapoor alia bhatt brahmastra twitter review
Telugu News  /  Entertainment  /  Ranbir Kapoor, Alia Bhatt Brahmastra Twitter Review
ర‌ణ్‌భీర్ కపూర్, అలియాభట్
ర‌ణ్‌భీర్ కపూర్, అలియాభట్ (twitter)

Brahmastra Twitter Review: బ్రహ్మాస్త్ర ట్విట్టర్ రివ్యూ - ర‌ణ్‌భీర్, అలియా సినిమాకు టాక్ ఎలా ఉందంటే

09 September 2022, 7:07 ISTHT Telugu Desk
09 September 2022, 7:07 IST

Brahmastra Twitter Review: గత కొన్ని నెలలుగా పరాజయాలతో కొట్టుమిట్టాడుతోంది బాలీవుడ్. ఈ వరుస ఫ్లాప్ లకు బ్రహ్మాస్త్ర చిత్రంతో బ్రేక్ పడిందా? ర‌ణ్‌భీర్, అలియా భట్ జంటగా నటించిన ఈ సినిమాకు ట్విట్టర్ టాక్ ఎలా ఎందంటే...

Brahmastra Twitter Review: ర‌ణ్‌భీర్ కపూర్, అలియాభట్ జంటగా నటించిన బ్రహ్మాస్త్ర చిత్రం భారీ అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాలీవుడ్ లో అత్యంత భారీ బడ్జెట్ సినిమాల్లో ఒకటిగా రూపొందిన ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. అమితాబ్ బచ్చన్ తో పాటు టాలీవుడ్ అగ్రహీరో నాగార్జున బ్రహ్మాస్త్ర సినిమాలో కీలక పాత్రలను పోషించారు.

బ్రహ్మాస్త్ర సౌత్ వెర్షన్స్ కు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరించడంతో బాలీవుడ్ తో పాటు దక్షిణాదిలో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తి ఏర్పడింది. రణ్ భీర్ కపూర్, అలియా పెళ్లి తర్వాత విడుదలైన ఈ తొలి సినిమా ఇది. బాలీవుడ్ లో వరుస పరాజయాలకు బ్రేక్ వేస్తూ రికార్డులను తిరగరాసే సినిమా ఇదంటూ ట్రేడ్ వర్గాలు అంచనాలతో సినిమాపై భారీగా హైప్ క్రియేట్ అయ్యింది. మరోవైపు కరణ్ జోహార్ నిర్మించిన ఈ సినిమాను బాయ్ కట్ చేయాలంటూ సోషల్ మీడియాలో విమర్శలు పెరిగిపోయాయి. ఈ విమర్శలు, అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే...

విజువ‌ల్ వండ‌ర్‌

బ్రహ్మాస్త్ర సినిమాను విజువల్ వండర్ గా అయాన్ ముఖర్జీ తెరకెక్కించాడని నెటిజన్లు చెబుతున్నారు. అవెంజర్స్, మార్వెల్ సినిమాలు చూసిన ఫీలింగ్ కలిగిస్తుందని చెబుతున్నారు.ర‌ణ్‌భీర్ కపూర్, అలియా లవ్ స్టోరీ, వారి కెమిస్ట్రీ బాగుందని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్, గ్రాఫిక్స్ ఆకట్టుకుంటాయని చెబుతున్నారు.

సినిమా ఆరంభంలోనే సైంటిస్ట్ గా షారుఖ్ ఖాన్ కనిపిస్తాడని చెబుతున్నారు. సెకండాఫ్ లో రణ్ భీర్, అమితాబ్ మధ్య సెంటిమెంట్ డ్రామా ఆకట్టుకుంటుదని పేర్కొంటున్నారు. అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ క్యారెక్టర్స్ పవర్ ఫుల్ గా ఉంటాయని చెబుతున్నారు. యూనిక్ స్టోరీ తో ప్రతి సీన్ ఎపిక్ లా ఉంటుందని చెబుతున్నారు. పైసా వసూల్ సినిమా ఇదని అంటున్నారు. చక్కటి థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ను అందిస్తుందని అంటున్నారు.

రొటీన్ స్టోరీ

మరొకొందరు నెటిజన్లు మాత్రం సినిమాపై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. గ్రాఫిక్స్, స్టోరీ లైన్ బాగా లేదని అంటున్నారు. విఎఫ్ఎక్స్ ఇరిటేట్ చేస్తుంటాయని చెబుతున్నారు. త‌న‌కు వ‌చ్చిన అవ‌కాశాన్ని అయాన్ ముఖ‌ర్జీ స‌ద్వినియోగం చేసుకోలేక‌పోయాడ‌ని అంటున్నారు. స్క్రీన్‌ప్లే బాగాలేద‌ని, సినిమా బోర్ కొట్టిస్తుంద‌ని అంటున్నారు.