RGV Interview with Ashu: అషూ రెడ్డి కాళ్ల కింద కూర్చున్న వర్మ.. ఎందుకో తెలుసా.. మీరనుకునేదే?-ram gopal varma interview with double dangerous ashu reddy ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rgv Interview With Ashu: అషూ రెడ్డి కాళ్ల కింద కూర్చున్న వర్మ.. ఎందుకో తెలుసా.. మీరనుకునేదే?

RGV Interview with Ashu: అషూ రెడ్డి కాళ్ల కింద కూర్చున్న వర్మ.. ఎందుకో తెలుసా.. మీరనుకునేదే?

Maragani Govardhan HT Telugu
Dec 07, 2022 10:27 AM IST

RGV Interview with Ashu: రామ్ గోపాల్ వర్మ.. ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ అషూ రెడ్డితో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆమెతో కలిసి సరదాగా ముచ్చటించారు. అషూ కాళ్ల వద్ద కూర్చొని ఆర్జీవీ ఆమెతో కబుర్లు చెప్పారు.

అషూ రెడ్డితో ఆర్జీవీ బోల్డ్ ఇంటర్వ్యూ
అషూ రెడ్డితో ఆర్జీవీ బోల్డ్ ఇంటర్వ్యూ

RGV Interview with Ashu: కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ.. మరోసారి తనదైన శైలి పబ్లిసిటీ స్టంట్‌తో ముందుకొచ్చారు. ప్రముఖ నటి, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ అషూ రెడ్డితో ఆయన ఓ ఇంటర్వ్యూ నిర్వహించారు. గతంలోనూ వీరిద్దరూ ఓ కాఫీ షాపులో సరదాగా ముచ్చటించారు. అప్పుట్లో ఆ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఆర్జీవీ మరోసారి అషూతో కలిసి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. వీరిద్దరూ మాత్రమే ఉన్న ఈ ముఖాముఖీలో ఎప్పటిలానే అషూ.. పొట్టి దుస్తుల్లో తన అందాలను ప్రదర్శిస్తూ వీక్షకులను కవ్వించింది.

గతంలో అషూ రెడ్డి కాళ్లను, తొడలను ఫొటోలు తీస్తూ వార్తల్లోకెక్కిన ఆర్జీవీ.. ఈ సారి సీన్ మరింత రసవత్తరంగా ఉండాలనో లేక మహిళలకు పాదాక్రాంతమవుతానని ఇన్‌డైరెక్టుగా చెప్పాలనుకుంటున్నారో తెలియదు కానీ.. ఆమె పాదాల వద్ద కూర్చున్నారు. మరోపక్క అషూ.. నోట్లో హుక్కా పైప్ పెట్టుకుని.. ఆ పొగ పీలుస్తూ ఎంజాయ్ చేస్తూ కనిపించింది. రెగ్యూలర్ ఇంటర్వ్యూలకు ఎంతో వైవిధ్యంగా వీరి చిట్ టాట్ జరిగింది.

ముందుగా ఆర్జీవీ మాట్లాడుతూ.. "అషూ.. నేను నీ పాదాల వద్ద ఎందుకు కూర్చున్నానంటే.. గత ఇంటర్వ్యూలో నువ్వు నన్ను చెంపపై కొట్టడం నా బంధువులు, సన్నిహితులు బాగా కోపగించుకున్నారు. అమ్మాయిని తక్కువగా చూడటం వల్ల వారు అలా ఎమోషనల్ అయ్యారని నాకు అనిపించింది. ఎంతటి పురుష వీరుడైన కాంతలకు పాదాక్రాంతుడే అని చెప్పేందుకు నేను ఈ విధంగా కూర్చోవడం ఒక కారణం. మరో కారణమేంటంటే కింద కూర్చుని మీ కాళ్లను దగ్గరనుంచి తనివి తీరా చూడొచ్చనే ఇంకొక కుట్ర" అని ఆర్జీవీ అషూతో అంటారు.

ఇందుకు అషూ ప్రతి స్పందిస్తూ.. "నిన్ను కొట్టినందుకు నీ పిచ్చ ఫ్యాన్స్ నాపై ట్రోల్స్ చేశారు. కాబట్టి నేను ఏమంటనంటే అబ్బాయిలతో కొట్టిచ్చుకోవడం కంటే అమ్మాయిలు కొడితే బెటర్ కదా అని అషూ చెబుతుంది. ఇందుకు ఆర్జీవీ మాట్లాడుతూ.. అబ్బాయిలు కొడితే బలం ఎక్కువ ఉంటుంది కాబట్టి కిందపడతాను.. అదే అమ్మాయిలు కొడితే సుతిమెత్తని చేతులు తగులుతాయి కాబట్టి కొద్దిసేపు శునకానందం పొందవచ్చు" అని అన్నారు. ఇలా వీరిద్దరి మధ్య ఎన్నో సరదా ముచ్చట్లు, వివాదాస్పద సంభాషణలు వచ్చాయి.

ప్రస్తుతం ఆర్జీవీ తను తెరకెక్కించిన డేంజరస్ అనే చిత్ర ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో అప్సర రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రల్లో నటించారు. డిసెంబరు 9న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ఈ సినిమాలో ఇద్దరు అమ్మాయిల మధ్య ఉన్న ప్రేమ కథను రొమాంటిక్‌గా తెరకెక్కించారు ఆర్జీవీ.

Whats_app_banner

సంబంధిత కథనం