Rakhi Sawant to a fan: నాకు పెళ్లయింది.. ఇప్పుడు నన్ను ముట్టుకోవద్దు: అభిమానితో రాఖీ సావంత్‌-rakhi sawant to a fan says maintain some distance i am married now ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rakhi Sawant To A Fan: నాకు పెళ్లయింది.. ఇప్పుడు నన్ను ముట్టుకోవద్దు: అభిమానితో రాఖీ సావంత్‌

Rakhi Sawant to a fan: నాకు పెళ్లయింది.. ఇప్పుడు నన్ను ముట్టుకోవద్దు: అభిమానితో రాఖీ సావంత్‌

Hari Prasad S HT Telugu
Jan 16, 2023 11:54 AM IST

Rakhi Sawant to a fan: నాకు పెళ్లయింది.. ఇప్పుడు నన్ను ముట్టుకోవద్దు అంటూ ఓ అభిమానితో రాఖీ సావంత్‌ అంటున్న వీడియో వైరల్‌ అవుతోంది. ఈ మధ్యే ఆమె తన ప్రియుడు ఆదిల్‌ ఖాన్‌ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

దగ్గరగా వస్తున్న అభిమానిని దూరం జరుగు అంటూ హెచ్చరిస్తున్న రాఖీ సావంత్
దగ్గరగా వస్తున్న అభిమానిని దూరం జరుగు అంటూ హెచ్చరిస్తున్న రాఖీ సావంత్

Rakhi Sawant to a fan: బాలీవుడ్‌లో ఓ డిఫరెంట్‌ క్యారెక్టర్‌ రాఖీ సావంత్‌. సినిమాల్లో ఐటెమ్‌ గాళ్‌గా, సెక్స్‌ బాంబ్‌గా పేరుగాంచినా.. బయట మాత్రం ఆమె వ్యవహారం కాస్త వెరైటీగా ఉంటుంది. తనకు అప్పటికప్పుడు ఏమనిపిస్తే అది అనేయడం రాఖీకి అలవాటు. ముంబై రోడ్లపై ఎన్నోసార్లు ఆమె చేసిన హల్‌చల్‌ అంతా ఇంతా కాదు.

తాజాగా తనతో సెల్ఫీ దిగడానికి దగ్గరకు వచ్చిన ఓ అభిమానితో ఆమె అన్న మాటలు వైరల్‌ అవుతున్నాయి. కాస్త దూరంగా ఉండి తీసుకో.. ఇప్పుడు నాకు పెళ్లయింది అని రాఖీ అనడం విశేషం. ఈ వీడియోను విరల్‌ భయానీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసుకున్నాడు. ముంబైలో రోడ్డుపై నిల్చొన్న రాఖీ దగ్గరికి ఓ అభిమాని వచ్చి సెల్ఫీ తీసుకోబోయాడు. అతడు మరీ దగ్గరగా రావడంతో రాఖీ ఇలా రియాక్టయింది.

"కొంచెం దూరం నుంచి తీసుకో. నాకు పెళ్లయింది. ఇంతకుముందు వేరే విషయం. ఇప్పుడు మీరు నన్ను ముట్టుకోవద్దు. ఇక చాలు వెళ్లండి" అని ఆ వీడియోలో రాఖీ అనడం చూడొచ్చు. ఆమె మాటలకు సరే సరే అంటూ ఆ అభిమాని దూరం నుంచే సెల్ఫీ తీసుకొని వెళ్లిపోయాడు. ఈ సెల్ఫీలతో రాఖీ కాస్త అసహనం వ్యక్తం చేస్తూ కనిపించింది.

ఈ వీడియో చూసి ఫ్యాన్స్‌ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. రాఖీ ఎప్పుడూ ఇంతే.. ఇలా కొత్త కొత్త పదాలతో వస్తుంది.. ఆమె సహజంగానే చాలా ఫన్నీ క్యారెక్టర్‌ అని ఓ అభిమాని కామెంట్‌ చేశాడు. రోడ్డుపై నీ సమస్యలకు ఎందుకు పరిష్కారం చూస్తున్నావ్‌ అంటూ మరో యూజర్‌ రాశాడు.

గత వారం తాను బాయ్‌ఫ్రెండ్‌ ఆదిల్‌ ఖాన్‌ను పెళ్లి చేసుకున్నట్లు రాఖీ వెల్లడించిన విషయం తెలిసిందే. గతేడాది జులై 2న తమ పెళ్లి జరిగినట్లు ఆమె చెప్పింది. కోర్టులో తమ పెళ్లి జరిగినట్లు చెబుతూ ఆ ఫొటోలను షేర్‌ చేసుకుంది. గతంలో రాఖీ.. రితేష్‌ రాజ్‌ను పెళ్లి చేసుకొని తర్వాత అతనితో విడిపోయింది.

Whats_app_banner

సంబంధిత కథనం