Vettaiyan Twitter Review: వేట్టయన్ ట్విట్టర్ రివ్యూ - రజనీకాంత్ సినిమాకు యావరేజ్ టాక్
Vettaiyan Twitter Review: రజనీకాంత్ హీరోగా నటించిన వేట్టయన్ మూవీ గురువారం భారీ అంచనాల నడుమ పాన్ ఇండియన్ లెవెల్‌లో రిలీజైంది. టీజే జ్ఞానవేళ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అమితాబ్‌బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించారు.
Vettaiyan Twitter Review: రజనీకాంత్ హీరోగా నటించిన వేట్టయన్ మూవీ పాన్ ఇండియన్ లెవెల్‌లో గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. జైభీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేళ్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. అమితాబ్‌బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించారు. జైలర్ తర్వాత వేట్టయన్‌తో రజనీకాంత్‌కు మరో బ్లాక్‌బస్టర్ దక్కిందా? లేదా? అంటే?
ఇన్వేస్టిగేట్ థ్రిల్లర్...
ఇన్వేస్టిగేట్ థ్రిల్లర్‌గా దర్శకుడు టీజే జ్ఞానవేళ్ వేట్టయన్ మూవీని తెరకెక్కించినట్లు నెటిజన్లు చెబుతున్నారు. ఎన్‌కౌంటర్లు చట్టానికి లోబడే జరుగుతుంటాయా? ఎన్‌కౌంటర్లను న్యాయవ్యవస్థ సమర్థిస్తుందా? వ్యతిరేకిస్తుందా? అనే అంశాలను కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి దర్శకుడు వేట్టయన్ మూవీలో చూపించినట్లు సమాచారం. న్యాయం జరగడంలో సొసైటీలో నెలకొన్న వివక్షను ఈ సినిమాలో చర్చించినట్లు చెబుతోన్నారు.
రజనీ ఫ్యాన్స్‌కు ట్రీట్...
సినిమా ఆరంభమైన ఇరవై నిమిషాలు రజనీ ఫ్యాన్స్‌కు ఓ ట్రీట్‌లా ఉంటుందని ఓ నెటిజన్ అన్నాడు. రజనీ మాస్ మూమెంట్స్, హీరోయిజం, ఎలివేషన్స్‌తో ఆరంభ సన్నివేశాలను ఆకట్టుకుంటాయని పేర్కొన్నాడు. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ పాత్రలో రజనీకాంత్ అదరగొట్టాడని, రజనీ డైలాగ్ డెలివరీ, మ్యానరిమజ్స్ మెప్పిస్తాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
రజనీకాంత్‌కు ధీటుగా అమితాబ్‌బచ్చన్ పాత్ర ఉంటుందని అంటున్నారు. రజనీకాంత్, అమితాబ్‌బచ్చన్ కలిసి స్క్రీన్‌పై కనిపించే సీన్స్ అదుర్స్ అని చెబుతున్నారు. పోలీస్ ఇన్ఫార్మర్ గా ఫహాద్ ఫాజిల్‌క్యారెక్టర్ ఫన్నీగా ఉంటుందని, నవ్విస్తూనే తన యాక్టింగ్‌తో ఫహాద్ ఫాజిల్ ఆకట్టుకుంటాడని చెబుతున్నారు. రానా దగ్గుబాటి, దుషారా విజయన్ క్యారెక్టర్స్ సర్‌ప్రైజింగ్‌గా ఉంటాయని అంటున్నారు.
బిగ్గెస్ట్ మైనస్...
రజనీకాంత్ ఇమేజ్ ముందు కథ చిన్నదైపోవడం ఈ సినిమాకు బిగ్గెస్ట్ మైనస్‌గా మారిందని మరికొందరు నెటిజన్లు చెబుతోన్నారు. కొన్ని యాక్షన్, ఇన్వేస్టిగేషన్ సీన్స్ బాగున్నా ప్రెడిక్టబుల్ స్టోరీలైన్, స్లోఫేజ్ స్క్రీన్‌ప్లేతో బోర్ కొట్టిస్తుందని అంటున్నారు.
అనిరుధ్ గెస్ట్ అప్పిరియెన్స్
మనసిల్లాయో సాంగ్‌లో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ గెస్ట్ అప్పిరియెన్స్ ఆకట్టుకుంటుందని అంటున్నారు. అనిరుధ్ బీజీఎమ్, సాంగ్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచాయని చెబుతున్నారు. సాంగ్ ప్లేస్‌మెంట్ మాత్రం సరిగా లేదని అంటున్నారు.