Rajinikanth in Kantara 2: కాంతారా ప్రీక్వెల్‌లో రజనీకాంత్.. ఇంట్రెస్టింగ్ బజ్-rajinikanth in kantara prequel reveals latest buzz ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Rajinikanth In Kantara Prequel Reveals Latest Buzz

Rajinikanth in Kantara 2: కాంతారా ప్రీక్వెల్‌లో రజనీకాంత్.. ఇంట్రెస్టింగ్ బజ్

Hari Prasad S HT Telugu
Feb 21, 2023 07:23 PM IST

Rajinikanth in Kantara 2: కాంతారా ప్రీక్వెల్‌లో రజనీకాంత్ గెస్ట్ రోల్‌లో కనిపించనున్నాడన్న వార్త ఆసక్తి రేపుతోంది. గతేడాది రిలీజై సంచలన విజయం సాధించిన కాంతారా మూవీకి ప్రీక్వెల్ తీసుకురాబోతున్నట్లు డైరెక్టర్, హీరో రిషబ్ శెట్టి వెల్లడించిన విషయం తెలిసిందే.

కాంతారా సక్సెస్ సందర్భంగా రిషబ్ శెట్టిని సన్మానిస్తున్న రజనీకాంత్
కాంతారా సక్సెస్ సందర్భంగా రిషబ్ శెట్టిని సన్మానిస్తున్న రజనీకాంత్ (twitter)

Rajinikanth in Kantara 2: కాంతారా మూవీ ఎంతటి సంచలనం సృష్టించిందో మనకు తెలుసు కదా. కేవలం రూ.15 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఏకంగా రూ.500 కోట్ల వరకూ వసూలు చేసింది. కన్నడలోనే కాదు తెలుగు, తమిళం, హిందీల్లోనూ ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయమే మేకర్స్ ను ఈ మూవీ ప్రీక్వెల్ తీసే దిశగా ప్రోత్సహించింది.

కాంతారాకు సీక్వెల్ వస్తుందని మొదట్లో వార్తలు వచ్చినా.. నిజానికి ప్రీక్వెల్ తీసుకొస్తున్నామని, ప్రేక్షకుల ఇప్పటికే రెండో పార్ట్ చూసేయగా.. తొలి పార్ట్ తీసుకురాబోతున్నట్లు ఈ మూవీ హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి చెప్పాడు. అయితే ఈ సినిమాలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించబోతున్నాడన్న వార్త ఇప్పుడు మరింత ఆసక్తి రేపుతోంది.

ఈ సినిమా కోసం ఈ మధ్యే మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ గా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న రిషబ్.. ఈ సందర్భంగా కాంతారా ప్రీక్వెల్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ ప్రీక్వెల్ కోసమే ప్రస్తుతం తాము రీసెర్చ్ చేస్తున్నట్లు తెలిపాడు. ఈ మూవీ కూడా కాంతారాలాంటి స్టోరీతోనే రానున్నా.. జానర్ మాత్రం మారబోతున్నట్లు తెలుస్తోంది.

అంతేకాదు ఈ సినిమాలో రజనీ గెస్ట్ రోల్ లో కనిపిస్తున్నాడటగా అని రిషబ్ ను ప్రశ్నించినప్పుడు అతడు కేవలం నవ్వి ఊరుకున్నాడు. ఈ వార్తలను ఖండించలేదు. దీంతో ఈ వార్తల్లో ఎంతోకొంత నిజం ఉందని స్పష్టమవుతోంది. నిజానికి కాంతారా మూవీపై గతంలో రజనీ ప్రశంసలు కురిపించాడు. ఈ సినిమా తనకు గూస్‌బంప్స్ తెప్పించదని అతడు అనడం విశేషం. ఈ నేపథ్యంలో ఇప్పుడదే మూవీ ప్రీక్వెల్ లో గెస్ట్ రోల్ పోషించనున్నాడన్న వార్త మరింత ఆసక్తి రేపుతోంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్