Hanu Man: అసలు సిసలైన సంక్రాంతి మూవీ హనుమాన్.. వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Prasanth Varma About Hanu Man: యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న భారత్ సూపర్ హీరో మూవీ హనుమాన్. తాజాగా ఈ సినిమా నుంచి ఆవకాయ ఆంజనేయ సాంగ్ లాంచ్ జరిగింది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ వర్మ కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.
Hanu Man Avakaya Anjaneya Song Launch: యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న సూపర్ హీరో మూవీ హను-మాన్. తేజకు జోడీగా అమృత అయ్యర్ హీరోయిన్‌గా చేస్తోంది. తాజాగా హునుమాన్ సినిమా నుంచి మూడో సింగిల్ ఆవకాయ ఆంజనేయ సాంగ్‌ని గ్రాండ్‌గా లాంచ్ చేశారు. మాసీ బీట్‌లతో కూడిన ఈ గ్రూవీ ఫోక్ సాంగ్‌ను అనుదీప్ దేవ్ స్వరపరిచారు.
సింహాచలం మన్నెల సాహిత్యం అందించారు. సాహితీ పాటని అద్భుతంగా ఆలపించారు. వాయిస్ చాలా లవ్లీగా ఉంది.
ఆవకాయ ఆంజనేయ సాంగ్ లాంచ్‌లో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. "ఆవకాయ ఆంజనేయ పాట చాలా ప్రత్యేకం. ఈ పాటతోనే ఈ సినిమా చిత్రీకరణ మొదలుపెట్టాం. టీజర్‌తో సినిమాకి చాలా మంచి హైప్ వచ్చింది. జనాల్ని చాలా ఆకట్టుకుంది. సినిమాపై చాలా అంచనాలు నెలకొన్నాయి. అయితే సినిమా ఎలా ఉండబోతుంది? ఏ జానర్‌లో ఉంటుంది ? పూర్తిగా మైథాలజికల్ ఉంటుందా ? సినిమాల హనుమంతుడు ఉంటారా లేదా? ఇలా చాలా ఆసక్తిరమైన ప్రశ్నలు ఉన్నాయి. అయితే తర్వాత విడుదల చేస్తున్న ఒకొక్క ప్రమోషనల్ మెరటిరియల్ తో సినిమాలో ఏముంటుందో చెప్పే ప్రయత్నం చేస్తున్నాం" అని ప్రశాంత్ వర్మ తెలిపాడు.
మొదటి పాట హనుమాన్ చాలీసా.. సినిమాలో చాలా ముఖ్యమైన భక్తి గీతం. తర్వాత విడుదల చేసిన సూపర్ హీరో పాటతో ఈ సినిమా చూసి చిన్నపిల్లలు ఎంత వినోదాన్ని పొందవచ్చో అర్ధమై ఉంటుంది. ఇప్పుడు ఆవకాయ ఆంజనేయ ద్వారా సినిమాలో ఎంత మాస్, యాక్షన్, ఫన్ ఉండబోతుందో అర్ధం చేసుకోవచ్చు. ఇది అసలు సిసలైన సంక్రాంతి సినిమా. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ చూడదగ్గ సినిమా. సినిమాలో ఒక్క ధూమపానం, మద్యపానంకు సంబధించిన ఒక్క షాట్ కూడా ఉండదు. టోటల్ క్లీన్ ఫిల్మ్ ఇది" అని ప్రశాంత్ వర్మ పేర్కొన్నాడు.
ఇప్పటివరకూ నేను చేసిన చిత్రాలలో హనుమాన్ మోస్ట్ ఎంటర్ టైనింగ్ మూవీ. ఆవకాయ ఆంజనేయ పాటని అనుదీప్ అద్భతంగా కంపోజ్ చేశారు. తేజ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశాడు. చాలా కష్టపడ్డాడు. ఇందులో ప్రతి పాట కథని ముందుకు తీసుకెళుతుంది. ఈ పాటలో మంచి ట్విస్ట్ ఉంది. శివేంద్ర గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. నాగేంద్ర గారు బ్రిలియంట్ సెట్ వర్క్ చేశారు. సాయి బ్రిలియంట్ గా ఎడిట్ చేశారు" అని వర్మ చెప్పుకొచ్చాడు.