Salaar Movie: స‌లార్ లో ప్ర‌భాస్ డ్యూయ‌ల్ రోల్...సోష‌ల్ మీడియాలో కొత్త ప్ర‌చారం...-prabhas to essay dual role in salaar movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Prabhas To Essay Dual Role In Salaar Movie

Salaar Movie: స‌లార్ లో ప్ర‌భాస్ డ్యూయ‌ల్ రోల్...సోష‌ల్ మీడియాలో కొత్త ప్ర‌చారం...

Nelki Naresh Kumar HT Telugu
Jun 17, 2022 09:18 AM IST

ప్ర‌భాస్ అభిమానుల‌తో పాటు టాలీవుడ్ వ‌ర్గాలు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో స‌లార్ ఒక‌టి. కేజీఎఫ్‌-2 స‌క్సెస్ త‌ర్వాత ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ రూపొందిస్తున్న ఈ సినిమాపై అంచ‌నాలు ఆకాశాన్నంటాయి. తాజాగా గ్యాంగ్ స్టర్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి మ‌రో ఆసక్తికర వార్త సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం అవుతోంది. అదేమిటంటే...

ప్ర‌భాస్
ప్ర‌భాస్ (twitter)

భాషాభేదాల‌కు అతీతంగా అన్ని ఇండ‌స్ట్రీల‌లో ఆస‌క్తిని రేకెత్తిస్తున్న పాన్ ఇండియ‌న్ సినిమాల్లో స‌లార్ ఒక‌టి. ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రానికి ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. కేజీఎఫ్ 2 ఘ‌న విజ‌యం త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమా ఇది. బాహుబ‌లి తో ప్ర‌భాస్ కు దేశవ్యాప్తంగా మార్కెట్ ఏర్ప‌డింది. మ‌రోవైపు కేజీఎఫ్ 2 తో బాక్సాఫీస్ రికార్డుల‌న్నింటిని ప్ర‌శాంత్ నీల్ తిర‌గ‌రాశాడు. 

ఈ నేప‌థ్యంలో వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో రూపొందుతున్న ఈ సినిమాపై అంచ‌నాలు ఆకాశాన్నంటాయి. ప‌వ‌ర్‌ఫుల్ గ్యాంగ్‌స్ట‌ర్ డ్రామాగా ప్ర‌శాంత్ నీల్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఇందులో క‌రుడుగ‌ట్టిన గ్యాంగ్‌స్ట‌ర్‌గా ప్ర‌భాస్ క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఇటీవ‌లే హైద‌రాబాద్‌లో ఈసినిమాకు సంబంధించి కీల‌క‌మైన యాక్ష‌న్ సీక్వెన్స్ ను చిత్రీక‌రించారు. 

తాజాగా ఈసినిమాకు సంబంధించి మ‌రో ఆస‌క్తిక‌ర వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. స‌లార్ సినిమాలో ప్ర‌భాస్ డ్యూయ‌ల్ రోల్ చేయ‌నున్న‌ట్లు చెబుతున్నారు. రెండు టైమ్ పీరియ‌డ్స్‌లో ఈ క‌థ సాగుతుంద‌ని అంటున్నారు. వాటికి త‌గిన‌ట్లుగా ప్ర‌భాస్ క్యారెక్ట‌ర్ డ్యూయ‌ల్ షేడ్స్‌లో వైవిధ్యంగా కనిపిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలోని ఓ క్యారెక్ట‌ర్ కోస‌మే ప్ర‌భాస్ బ‌రువు త‌గ్గి స్లిమ్‌గా మారిన‌ట్లు చెబుతున్నారు. 

ఇటీవ‌ల ఆదిపురుష్ ప్రీప్రొడ‌క్ష‌న్  ప‌నుల కోసం ప్ర‌భాస్ ముంబై వెళ్లారు. అక్కడ ద‌ర్శ‌కుడు ఓంరౌత్‌, న‌టుడు సైఫ్ అలీఖాన్‌తో క‌లిసి ప్ర‌భాస్ దిగిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఈ ఫొటోల్లో స్లిమ్‌ లుక్ లో ప్ర‌భాస్ క‌నిపించారు. స‌లార్‌లోని డ్యూయ‌ల్ రోల్ ను దృష్టిలో పెట్టుకొనే ప్ర‌భాస్ లుక్ మార్చిన‌ట్లు చెబుతున్నారు. 

 సలార్ లో శృతిహాస‌న్ క‌థానాయిక‌గా  న‌టిస్తోంది. మ‌ల‌యాళ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమార్‌తో పాటు జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. ద‌క్షిణాది భాష‌ల‌తో పాటు హిందీలోనూ ఈ సినిమాను రిలీజ్ చేయ‌బోతున్నారు. దాదాపు 200 కోట్ల వ్య‌యంతో ఈ చిత్రం  రూపొందుతోంది. 

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్